28, జూన్ 2012, గురువారం

కౌంట్ డౌన్ మొదలయ్యింది....


    ప్రపంచంలోనే మొదటిసారిగా నా మస్తిష్కంలో పురుడు పోసుకున్న ఆలోచన  " బ్లాగ్ బస్టర్ అవార్డ్స్ ". ఈ
   ఆలోచనకు ఇప్పటికే ఆసియా రికార్డ్ లభించింది..కనుచూపు మేరలో వరల్డ్ రికార్డ్ కూడా వచ్చే అవకాశం ,
   ఆశ వున్నాయి...ఈ కాన్సెప్ట్ అధికారికంగా మొదలు పెట్టినప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ
   స్పందన లభించటం ఆనందకరంగా వుంది...త్వరలోనే ఈ పోలింగ్ పూర్తి చేసి అవార్డుల వేడుకను నిర్వహించాలని
  వుంది...అందుకోసం జ్యూరి సభ్యులతో కూడా చర్చించిన తరువాత జులై నెల 15 వ తేది రాత్రి ఈ పోలింగ్ కు
  చివరి తేదీగా నిర్ణయించటం జరిగింది...జులై 15 వ తేది అర్దరాత్రి 12 గంటల తరువాత పోల్ అయ్యే వోట్లు పరిగణన
  లోకి తీసుకోవటం జరగదు.... ఈ లోపు మీరు, మీ మిత్రులు ఈ వోటింగ్ లో పాల్గొని మీ అభిమాన నటీనటులకు
  సాంకేతిక నిపుణులకు వోట్లు వేయండి....ఇదో కొత్త ఆలోచన....కొత్త సంకల్పం .....మీ ప్రోత్సాహం, ఆదరణ
  అవసరం. ఒక తెలుగు వాడు మొదలెట్టిన నవ్య ప్రయత్నం....మీ స్నేహితులకు అందరికి ఈ కాన్సెప్ట్ గురించి
  ప్రచారం చేసి వారి చేత కూడా వోట్లు వేయించండి...ఇదో బాధ్యతగా మీరు స్వీకరించగలిగితే ధన్యుడిని.
  ఈ దిశగా మీ పూర్తి సహకారాన్ని ఆశిస్తున్నాను.



 కౌంట్ డౌన్ మొదలయ్యింది....

1 కామెంట్‌: