బ్లాగ్ అవార్డుల కాన్సెప్ట్ కు ప్రశంసలతో బాటు అభినందనలు కూడా వెల్లువెత్తుతున్నాయి. సినిమాల జాబితాతో బాటు నా అప్పీలు కూడా మంచి స్పందననే పొందగలిగాయి. బ్లాగు వాళ్ళ అభిప్రాయాలు పొందుపరచటంతో బాటు చాలామంది తమ అవార్డుల సిఫారసులను నాకు పెద్ద సంఖ్యలో పంపారు. వాటన్నిటినీ క్రొడీకరించి ఒక సెమీ ఫైనల్ జాబితా తయారు చేసి మీ ముందుంచుతున్నాను. వ్యూయర్స్ సూచనల మేరకు పది క్యాటగిరీలతో బాటు ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డును పదకొండో క్యాటగిరీగా చేరుస్తున్నాను....
ప్రతి క్యాటగిరీలోనూ నాలుగేసి నామినేషన్లు చొప్పున తయారు చేయటానికి,అందులో భాగంగా వ్యూయర్స్ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవటం లాంటి ప్రధానమైన బాధ్యత ఒకటి వుంది. ఈ బాధ్యత సమర్ధవంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ఓ అయిదుగురు సభ్యులు గల జ్యూరీని ఏర్పాటు చేయటం జరిగింది. ఇందుకోసం అయిదుగురు ప్రముఖ తెలుగు సినిమా జర్నలిస్టులను నేను కోరటం, వారు రెండో మాట లేకుండా అంగీకరించటం జరిగింది. వారికి నా ధన్యవాదాలు....
జ్యూరీ సభ్యులు.....
1.శ్రీ ప్రభు
2.శ్రీ వినాయక రావు
3.శ్రీ ఓం ప్రకాష్
4. శ్రీ వేణుగోపాల్
5. శ్రీ కె. ఫణి మాధవ్
ఇక నామినేషన్ల విషయంలోకి ఎంటర్ అయిపోదాం. ప్రతి బాక్స్ లో నాలుగు ప్రతిపాదనలు, క్రింద వోటు వేసేందుకు ప్రావిజన్ ఇవ్వటం జరిగింది. వోటు వేయండి. మన అభిమాన కళాకారుల్ని, సాంకేతిక నిపుణుల్ని అవార్దుకు అర్హులుగా ఎంపిక చేసుకుందాం.
ఒక కొత్త ఆలొచన అమలులో అందరం భాగస్వాములం అవుదాం.
-------------------------------------------------------------------------------------------------------------
|