సుబ్బరామిరెడ్డి గారు మంచి మనిషి. సాధ్యమయినంత వరకు వివాదాలకు దూరంగా వుండే నాయకుడు. మరెందుకో సడెన్ గా పది కోట్లు ఖర్చు పెట్టి తాజాగా ఓ వివాదాన్ని కొనితెచ్చిపెట్టుకున్నారనిపిస్తోంది. తెలుగు లలిత కళా తోరణానికి ముందు రాజీవ్ గాంధి పేరు తగిలించి అనవసరంగా తేనెతుట్టె కదిలించారనిపిస్తోంది. స్వర్గీయ రామారావు గారి మదిలో మెదిలిన ఒక అద్భుతమయిన ఆలోచనకు సాదృశ్యరూపం తెలుగు లలిత కళాతోరణం, ఒక విధంగా అప్పట్లో ఇది సంచలనం. దీనికి ముందు రాజీవ్ గాంధి పేరు పెడితే పదికోట్లు ఇస్తానని సుబ్బరామి రెడ్డి గారు ఆఫర్ ఇవ్వటం,,,రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఒకే అనటం జరిగిపోయాయి. సహజంగానే ఇది ఎన్, టి. ఆర్, అభిమానులతో పాటు తెలుగు వాళ్ళు చాలామందిని బాధ పెట్టింది. లలితకళలకు సంబంధించిన ఒక థియేటర్ కు తెలుగు కళాకారుడి పేరు కాకుండా ఒక రాజకీయనాయకుడి పేరు పెడితే పదికోట్లు ఇస్తానంటూ ఎవరయినా ముందుకు వస్తే సర్కారు ఎలా ఒప్పుకుందనేది అర్ధంకాని విషయం. అవునులెండి...కళాకారుడి పేరు పెడితే పదికోట్లు ఎవరిస్తారు చెప్పండి.,,విమానాశ్రయానికి ఎన్టీయార్ పేరు తీసేసి రాజీవ్ గాంధి పేరు పెట్టారంటే అందులోని రాజకీయాన్ని అర్ధం చేసుకోగలం.,, కాని తెలుగు అన్న పదం ముందు రాజకీయ నాయకుడి పేరు అవసరమా అన్నది అర్ధం కాని అంశం. కావాలనుకుంటే ఆ రోజునే రామారావు గారు ఈ ప్రాంగణానికి ఎన్టీయార్ తెలుగు లలిత కళా తోరణం అని పెట్టి ఉండవచ్చు. దీనికే కాదు అప్పట్లో దాదాపు అన్నిటికి తన పేరు ముందు పెట్టుకున్నా రామారావు గారిని ఎవరు అడిగివుండేవారు కాదు..అడిగినా ఆయన లెక్క చేసే మనిషి కూడా కాదు. కాని ఆయన తన హయాంలో దాదాపు అన్నింటికీ తెలుగు అనే పేరు పెట్టేందుకే ప్రాధాన్యం ఇచ్చారు,, దటీజ్ ఎన్టీయార్..ఆ సమయంలో రామారావు గారి తెలుగు మమకారం మీద బోలెడన్ని జోకులు కూడా వచ్చినాయి.
నాకు తెలిసి రాజీవ్ గాంధి గారి కంటే కళలు సాహిత్యాలకు సంబంధించి సుబ్బరామిరెడ్డి గారి పేరు గొప్పది,,.హాయిగా ఆ పదికోట్లేదో ఇచ్చి తన పేరు పెట్టుకున్నా సుబ్బరామిరెడ్డి గారిని తెలుగు వాళ్ళందరూ తెగ మెచ్చుకునే వాళ్ళేమో.,, లేదా మన రాష్ట్రంలో ఎంతోమంది గొప్ప గొప్ప తెలుగు కళాకారులు< సాహితీవేత్తలు వున్నారు. వాళ్ళెవరి పేరయినా పెట్టి వున్నా బావుండేదేమో.. తెలుగు లలితకళా తోరణంలో తెలుగు కార్యక్రమాలు జరగటం లేదు కాబట్టి రాజీవ్ గాంధి పేరు పెట్టటంలో తప్పు లేదంటున్నారు సుబ్బారామిరెడ్డి గారు.,,ఆంద్రప్రదేశ్ లో కేవలం తెలుగు వాళ్ళే కాదు..అన్ని భాషలవాళ్ళు ఉన్నారు. అంతమాత్రాన ఓ వెయ్యి కోట్లు ఇచ్చి రాజీవ్ గాంధి ఆంద్ర ప్రదేశ్ అనో, రాహుల్ గాంధి ఆంద్ర ప్రదేశ్ అనో మార్చలేము కదా.,,రాష్ట్రంలో రోడ్లు,భవనాలు, జిల్లాలు, పార్కులు, అన్నీ రాజకీయ నాయకుల పేర్లతో మారిపోతున్నాయి. కనీసం లలిత కళల జోలికి అయినా వీళ్ళు రాకుండా వుంటే బావుండునన్నది ఓ కళాకారుడిగా నా ఫీలింగ్., సుబ్బరామిరెడ్డి గారికి ఎందుకు ఆలోచన రాలేదో నాకు తెలియదు గాని ఆ పది కోట్లు ఇచ్చి రాజీవ్ గాంధి గారి పేరు బదులు ఎన్.టి.ఆర్.తెలుగు లలితకళా తోరణం అని పెట్టి వుంటే తెలుగు వాళ్ళు పార్టీలు, రాజకీయాలకు అతీతంగా ఆయనకు బ్రహ్మరధం పట్టి వుండే వాళ్ళు., అయినా ఈ మాత్రం సుబ్బరామిరెడ్డి గారికి తెలియదా...ఆయన మనసులో ఇంకా ఏదో గొప్ప ఆలోచన వుండే వుంటుంది...ఒక్కటి నిజం...నా దగ్గర డబ్బు వుండి వుంటే కచ్చితంగా సుబ్బరామిరెడ్డి గారి పేరు పెట్టివుండే వాణ్ని...ఆయనంటే నాకు అంతఇష్టం,,, ఎవరయినా ఓ పదికోట్లు అప్పిస్తే బావుణ్ణు,,,,!
శుభలగ్నంలో ఏవిఎస్(అంటే మీరే) అన్నట్లు "ఏమిటో.....ప్చ్"
రిప్లయితొలగించండిఎడారులమీదగా, సముద్రాలమీదగా మన దేశానికి దురాక్రమణదారులుగా వచ్చి, దేశాన్ని ఆక్రమించి, ఇక్కడి సంస్కృతిని నాశనం చేసి మన్ని బానిసలుగా వందల సంవత్సరాలు పాలించిన వాళ్ళల్లొ కొందరి పేర్లు ఇప్పటికీ కొన్ని రోడ్లకు, జలాశయాలకు ఉన్నాయి. వాటిపేర్లు మార్చే దమ్ము ఈ రాజకీయ నాయకులకెవరికీ లేదు. వేరే పార్టీకి చెందిన నాయకుడి అలోచనలకు వాస్తవ రూపమైన లలిత కళా తోరణం మటుకు నిస్సిగ్గుగా మార్చేశారు.
రిప్లయితొలగించండిజస్ట్ వాదనకోసం ఒక మాట. ఓకవేళ నరేద్ర మోడి తనకున్న పలుకుబడి ఉపయోగించి 10000 కోట్లు విరాళం ఇప్పించి హుస్సేన్సాగర్ జలాశయాన్ని బాగుచేయించండి కాని పేరు మాత్రం "వినాయక్ సాగర్" అని మార్చండి అని ఉంటే, మీడియా ఎంత అల్లరి చేసి ఉండేది. మోడీ మీద ఎంతమంది నోరుపారేసుకుని ఆడిపోసుకునేవాళ్ళు. వాళ్ళెవ్వరూ ఇప్పుడు కిక్కురుమనటంలేదు. అసలు రాజీవ్ గాంధీ మన రాష్ట్రానికి ఏమిచేశాడని ప్రతిదానికి ఆ మనిషి పేరుపెట్టాలి??
AVS garu!
రిప్లయితొలగించండిpedda vaLLa "Amma" bhakti meeku teleyanindi kaadu. Idi kooda ado type raajakeeyam anthe!!.
vyardhamaina vishyalaku alajadi, nirasana telepe.. mana janam oka manchi vishyaam(Telugu lalitha kala Tornam pEru maarpu vaddu ani ) kosam vudyamincharem??
"రాజీవ్, సోనియా,ఇందిరా పబ్లిక్ Toilets" "రాజీవ్ sulabh కాంప్లెక్స్, "రాజీవ్ స్మశాన వాటిక "; "ఇందిరమ్మ వేశ్యా గృహం" "రాజీవ్ కుక్కలు", "రాజీవ్ పందు లని" "రాజీవ్ తెలంగాణా" తర్వాత తెలుగు భాష పేరు సోనియా భాష. ITALIAN OF EAST. "రాజీవ్ లంగాణ" ,"ఇందిరా తిరుమల, రాజీవ్ వెంకటేశ్వర స్వామి"
రిప్లయితొలగించండిరోశయ్య గాని కి బుద్ధి సరిగా పని చేయటం లేదు - మైండ్ కరాబు అయింది . ఎర్రగడ్డ దవాఖానా లో కే సి ర్ గాడి బెడ్ పక్కన జాయిన్ చేసి ఇద్దరికీ కలిపి షాక్ ట్రీట్ మెంట్స్ ఇవ్వాలి .
well said, request you to remove the background color as black it really strains the eyes to read the same.it discourages the users to read complete post, oh no.... word verification too :(
రిప్లయితొలగించండిసుబ్బరామిరెడ్డి గారు మంచి మనిషి. సాధ్యమయినంత వరకు వివాదాలకు దూరంగా వుండే నాయకుడు. :D :D :D
రిప్లయితొలగించండిఆంధ్రులకు ఆత్మాభిమానం తక్కువా !?
రిప్లయితొలగించండిat ANALYSIS <<<>>> అనాలిసిస్
http://analysis-seenu.blogspot.com/2009/09/blog-post.html
emi sethure lingaa emi sethu...pejasaamyam lo prathodi ki chaana sechcha sothantralochinayaaa pethodu peru marchesodde..jagratha naayanaaa repu mee koothulla pellillu sesesi kaapuraalu kooda meme sesethamane dagakoru madusulu vache kaalam vachesindi..
రిప్లయితొలగించండిemi sethura linga nenemi sethu
Dabbulunte emaina cheyavachhani marosari niroopincharu... ntr aatma marosaari kshobaku gurai vuntundi...
రిప్లయితొలగించండిCongrats Subbaramireddy garu..U hv taken a good decision by withdrawing Rajiv Gandhi' name. Also Congrats to Telugu people, power and spirit.
రిప్లయితొలగించండిTHAMILA THAMBILA NUNCHI MANAM ENTHA NERCHUKUNNA THAKKUVE. CONGRESS PARTY KI LARGEST CONTRIBUTED MP'S UNNA...PRAYOJANAM SUNNA. CENTRAL NUNCHI AP KI NYAYANGA RAVALSINA WORKS CHEYADANIKI CHETHA KAADU..KAANI...SONIA KI BAAKA OODHADANIKI RAJIV PERLU KAAVALAA......RAMESH.G
రిప్లయితొలగించండిNTR is a legend andhuke. Tv9 ki naa abinandanalu ee vishayamlo valle subbi ki chamatalu pattincharu.
రిప్లయితొలగించండిidi telugu varu siggu padavalasina vishayam
రిప్లయితొలగించండిIT SHOULDHAVE BEEN RENAMED AS NTR LALITHA KALA THORANAM IN THE FOND MEMORY OF THE GREAT LELGEND.
రిప్లయితొలగించండిBOYINA KAMESWARARAO
సార్ ఏవీఎస్ గారు.... ఒకవేళ ఈ ఆర్టికల్ సుబ్బిరామిరెడ్డి గారు చదివితే మీరు ఆయన్ని తిట్టారో.. మరేదైనా చేశారో తెల్కక పరేషాన్ అవుతాడండీ. నొప్పించక తానొవ్వక అన్నట్లు రెడ్డి గారిపై వేసిన వ్యంగ్య రాళ్లు ఆయనకు గుచ్చితే చాలు మరోసారి అలాంటి సాహసం చేసే ప్రయత్నం చేయరు...
రిప్లయితొలగించండి