19, నవంబర్ 2011, శనివారం

మన బంగారం మంచిదయితే చాలు....!


గత కొద్ది రోజులుగా తెలుగు సినిమా పరిశ్రమలో ఒక అనారోగ్యకర వాతావరణం నెలకొంది. రికార్డు కలెక్షన్లు అనే నేపధ్యంలో ఇద్దరు పెద్ద హీరోల అభిమానుల మధ్య చిన్న సైజ్ యుద్ధం జరుగుతోంది. మాదే రికార్డు అని ఒకరు, కాదు మాదే రికార్డు అని మరొకరు పరస్పరం సవాళ్లు విసురుకోవటం ఉద్రిక్త పరిస్థితులు సృష్టించుకోవటం చూస్తుంటే బాధ కలుగుతోంది...చివరకు ఈ వివాదం ముదిరి పత్రికల్లో పెద్ద పెద్ద ప్రకటనల వరకు  వెళ్లిందంటే ఆందోళన కలుగుతోంది కూడా...ఈ సినిమా రికార్డు కలెక్షన్లు సాధించింది...ఇప్పటివరకు ఏ సినిమా ఇంతటి వసూళ్ళు చేయలేదు...రికార్డులు బద్దలు కొట్టింది...అని ఎవరయినా ప్రచారం చేసుకున్నారంటే అది వారి అమాయకత్వమో లేక మితి మీరిన ఆత్మ విశ్వాసమో అయివుండాలి. నిర్మాణ వ్యయం, టికెట్ల రేట్లు, ఆర్టిస్టుల పారితోషికాలు, ప్రచారం ఖర్చు లాంటివి అనూహ్యంగా పెరిగిపోతున్న ఈ సమయంలో ఏ విధంగా నిన్నటి సినిమాకు, ఇవాల్టి సినిమాకు పోలిక చూపెడతారన్నది ప్రశ్న. మాయా బజార్ సినిమా నాటికి మగధిర సినిమా నాటికి తేడా లేదా....?  లవకుశ సినిమా రోజులకు దూకుడు సినిమా రోజులకు వ్యత్యాసం లేదా....?  ఆ రోజు ఖర్చుకు...లాభాలకు.... ఈ రోజు ఖర్చుకు... లాభాలకు  తేడా లేదూ....? ఎలా యాభయి ఏళ్ళ  చరిత్రలో రికార్డు అనే పదాన్ని వాడతారో అర్ధం కాదు... సరే... సినిమా ప్రమోషన్ కు సవా లక్ష ప్రచారాలు చేసుకోవటం తప్పు కాదు....పైగా అద్భుతమైన కలెక్షన్లు వసూలు చేస్తున్న సినిమాలకు అదేమంత ఆక్షేపణియము కూడా కాదు..అయితే ఇది శ్రుతి మించటం వల్లనే ఈ పరిస్థితులు దాపురిస్తున్నాయి...కాని ఒక్క విషయం...ఈ జాడ్యం ఇవాల్టిది కాదు...మా హిరో గొప్ప అంటే మా హిరో గొప్ప అని అభిమానులు కొట్టుకోవటం కొత్తేమి కాదు..మన సినిమాకు, మన రాష్ట్రానికి పరిమితమైనది కూడా కాదు...అయితే కొంచెం నిశితంగా పరిశిలిస్తే ఇటివలి వివాదం కేవలం " సినిమా " " అభిమానం " అనే పరిధులు దాటి వేరే అనారోగ్యకర దారుల్లోకి పయనిస్తోందనిపిస్తోంది. ఇది ప్రమాదకరం..ఈ మొత్తం అంశంలో తప్పు హిరోలది కాదు...అభిమానులది కాదు...అత్యుత్సాహంతోనో...విజయోత్సాహంతోనో కొంచెం గీతలు దాటి ప్రకటనలు, ప్రచారాలు చేస్తున్న కొందరు నిర్మాతలే ఈ పరిస్థితికి కారకులన్నది స్పష్టంగా కనిపిస్తోంది....బాధ్యత గల నిర్మాతలు  ఎవరూ ఇటువంటి వాటిని ప్రోత్సహించరన్నది నిర్వివాదాంశం. " మా సినిమా 
గొప్పది " అన్నంతవరకు సమస్య లేదు..తప్పూ లేదు. " పక్కవాడి సినిమా కంటే నా సినిమా గొప్పది " అన్నప్పుడే సమస్య తలెత్తుతుంది...మనం గొప్పవాళ్ళం అన్నది గుండె మిద చెయ్యి వేసుకుని చెప్పగలిగితే అది విజయం...పక్కవాడి కంటే నాది గొప్పది అని తోడ కొట్టి చెపితే అది అహంభావం... ఈ తేడా తెలుసుకుని కొంచెం బాధ్యతగా మెలగ గలిగితే 
పరిశ్రమ బావుంటుంది...హీరోలు బావుంటారు...అభిమానులు బావుంటారు...
అందరు బావుంటారు...మనకు ఎన్ని ఎకరాలు ఉన్నదో చెప్పుకోవటంలో తప్పు లేదు...పక్కోడికి ఎన్ని ఎకరాలు వుంటే మనకెందుకు ???




6 కామెంట్‌లు:

  1. తమ అభిమానులకి కొట్టుకోవద్దని చెప్పాల్సిన బాధ్యత హీరోలకి లేదా? కేవలం తమ సినిమాలకి కలెక్షన్‌లు వస్తే చాలనుకుంటున్నారా?

    రిప్లయితొలగించండి
  2. intha varaku ea producer naku intha collection vachindhi ani media mundu cheppaledu,kevalam record vasullu sadinchindi ani matrame chepparu kanuka evvaru nmmavddu....

    రిప్లయితొలగించండి
  3. DOOKUDU gurinchi andariki telusu, fake saga ... please stop unnecessary arguments...

    రిప్లయితొలగించండి
  4. asalu ee dookudu producers ni ban cheyyali,valla valle intha newsense jaruguthundi.

    రిప్లయితొలగించండి
  5. DOOKUDU IS ALL TIME TFI RECORD TES IT IS TRUE.PAPAM DOOKUDU RECORDS ENDUKU FAKE AYYAYI FIRST OKA AMOUNT BLOG LO PETTI DOOKUDU DAANINI DATESTUNDI ANI TELUSUKONI AMOUNT MARCHINODU FAKE ANTE THAT IS MEGA LUCHAS CHECK TV9 REPORT

    రిప్లయితొలగించండి
  6. paapam DOOKUDU producers ki collections kosam 1st week tarvata song add chesukovatam 50days tarvata scean ludugau add chesokovatam teliyaduga ASALU MEGA FAMILYNI MINCHINA DONGANA KODUKULU UNNARA ATU CINEMALO KANI ITU POLITICS LO KANI FUCK U ASSSSSSSSSS HOLE

    రిప్లయితొలగించండి