8, మార్చి 2012, గురువారం

వర్మ గారు....బ్రాహ్మణ శాపం పవర్ ఫుల్....!!

      
  
      నాలుగయిదు నెలలు ప్రశాంతంగా వున్నాం. మళ్లీ రాం గోపాల్ వర్మా, ఆయన తాలూకూ వివాదాలూ మొదలయినాయి. ' రెడ్డి గారు పోయారు ' అనో ' చౌదరి గారు పరారు ' అనో  ఆయన ఒక సినిమా ప్రకటించటం....
ఇక అక్కడినుంచి మీడియా దానిని పెద్దదిగా చూపటం.... ప్రధాన వార్తలలో దాని గురించి హైప్ చేస్తూ చెప్పటం పునరావృతమవుతోంది. వర్మ సినిమాల మిద లైవ్ షో లు, టాక్ షోలు, ఇంటర్వ్యులు తిరిగి మొదలయ్యాయి. వర్మ
ఏ సినిమా అయినా, ఎలాంటి సినిమా అయినా తీసుకోవచ్చు... క్రియేటర్ గా అది ఆయన హక్కు...దానిని అడిగే హక్కు ఎవరికీ లేదు...ఇష్టం లేని వాళ్ళు ఆ సినిమాలు చూడాల్సిన అవసరం లేదు.... వివాదాలతో కూడిన సినిమాలను అనౌన్స్ చేయటం రాం గోపాల్ వర్మ కు అలవాటు.... వ్యాపార పరంగా అది ఆయనకు అవసరం....ఆ పరంగా అయనను   నిలదిసేందుకు  ఎవరికయినా ఏమి హక్కు వుంటుంది.  అయితే  వర్మకు గొప్ప వరం  తెలుగు  మీడియా...ప్రచారపరంగా వర్మకు భగవంతుడిచ్చిన వరం. కొన్ని లక్షల విలువయిన పబ్లిసిటిని ఉచితంగా వర్మకు మీడియా ఇస్తోంది.  వర్మ తుమ్మినా, దగ్గినా అదొక వార్తగా మీడియా పరిగణిస్తోంది. నిరంతరం ఆయన్ను వార్తల్లో వ్యక్తిగా నిలబెడుతున్నాయి. ఆయనకు కూడా అంతకంటే ఏంకావాలి... ఇవాళ తాజాగా పూజారుల గురించి వర్మ గారు ట్విత్తర్ లో చేసిన వ్యాఖ్యలు బ్రాహ్మణుల మనోభావాలను దెబ్బ తీసాయంటూ కొన్ని చానెళ్ళు లైవ్ షో లు పెట్టాయి. సాక్షాత్తు వర్మ గారు కుడా ఒక చానెల్లో కనిపించారు. ఎందుకిలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు అంటూ చానెల్ వారు ఆయన్ను అడిగారు...వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం కాదు....తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావాలనే ఆయన ప్రయత్నం...అది నెరవేరింది...అంతే....సింపుల్....బ్రాహ్మణులకు మంత్రాలకు అర్ధాలు తెలియవంతు వర్మ చేసిన వ్యాఖ్యలు ఎంత అర్ధ రహితమో మేధావి వర్మ గారికి మాత్రం తెలియదా....తన బారసాల దగ్గర్నించీ తన పిల్లల అక్షరాభ్యాసం వరకు బ్రాహ్మలు లేనిదే గడవదన్న కనీస పరిజ్ఞానం వర్మ గారికి ఉండదని ఎలా అనుకుంటాము...ఆయనకు అన్నీ తెలుసు...ఉత్తినే...ఉబుసుపోక ...అప్పుడప్పుడు ఇలాంటి కామెడి చేస్తుంటారు... అంతే... మరీ అంత కోపం వస్తే బ్రాహ్మణులను శపించమని చెప్పండి అంటున్నారు వర్మ గారు...వద్దు సర్...బ్రాహ్మణ శాపం చాలా శక్తివంతమైనది....తట్టుకోలేరు....మీ వివాదాలు సినిమాలకు పరిమితం కానివ్వండి...కులాలకు విస్తరింప చేయాలని చూడద్దు....!!!6 కామెంట్‌లు:

 1. విప్రులెల్లరు జేరి వెర్రి కూతలుకూసి
  సతిపతుల గూర్చి సమ్మతమున
  కోరి మను ముహూర్త ముంచ
  ముండెట్లు మోసెరా విశ్వధభిరామ వినురవేమ!

  http://nuvvusetty.wordpress.com

  రిప్లయితొలగించండి
 2. Aseerwadalu phalinchabovemo kani sapalu gattiga tagultai. Daniki brahmale kanakkarledu. Eppudu nijam cheppevadaithe chalu

  రిప్లయితొలగించండి
 3. for Brahmins by Brahmins "BRAHMANA BHAVAN" opening in Hyderabad city...

  Pl visit www.brahmanasanghamap.com or theheadconstable.com/abcd

  Giri Prasad Sarma @ 86 8668 1516

  రిప్లయితొలగించండి