21, జులై 2011, గురువారం

లాంగ్ లివ్ బాలయ్యా....




హీరో నందమూరి బాలకృష్ణ గురించి ఒక అపవాదు ప్రచారంలో వుంది..ఆయనకు కోపం ఎక్కువనీ...అత్యంత మూడి మనిషి అనీ కొంతమంది అంటారు...కాని ఆయనతో కొద్దిగా పరిచయం, చనువు ఏర్పడిన వారికి ఎవరికయినా ఆయన ఎంత మంచి మనిషో, ఆయనది ఎంతటి పసిపిల్లవాడి మనస్తత్వమో అర్ధమవుతుంది...నేను ఆర్టిస్టుగా ఆయనతో ఆరేడు సినిమాలు చేసాను..బాలయ్య ఎంతో జోవియల్ గా వుండే వ్యక్తి అని అప్పుడే అర్ధమయ్యింది...అనేక సందర్భాలలో ఆయనను కలిసినా నాకు బాలకృష్ణ మీద అదే ఒపినియన్...తెలుగు సినిమా వజ్రోత్సవాలలో నేను ఆయనతో కలిసి దుర్యోధన, శకుని రూపకాన్ని నటించాను...దాని రిహార్సల్స్ సమయంలో బాలయ్య అంకిత తత్వం , చిత్త శుద్ధి గమనించాను...అది సినిమా కావచ్చు, నాటకం కావచ్చు మరోటి కావచ్చు .....ఒక బాధ్యత ఒప్పుకున్న తరువాత దాన్ని సక్సెస్ చేసేందుకు ఆయన పడే తపన, తాపత్రయం చూస్తే ముచ్చట వేస్తుంది....ప్రత్యేకించి ఇటీవల తానా లో ఒక ప్రదర్శన నిమిత్తం బాలయ్య బాబు తో కలిసి నేను, మురళి మోహన్ గారు, పరుచూరి గోపాలకృష్ణ గారు మరికొంత మంది అమెరికా వెళ్లాం.  రాజ రాజ నరేంద్రుడు పాత్రను బాలయ్య బాబు పోషించారు...దీనికి సంబంధించిన స్క్రిప్ట్ తన చేతికి అందినప్పటినుంచి ప్రదర్శన పూర్తి అయ్యేంత వరకు దాని పట్ల బాలయ్య బాబు చూపించిన ఏకాగ్రత, సిన్సియారిటి చాలామందికి ఆదర్శ ప్రాయం... అంత పెద్ద హీరో అయివుండి కూడా ఏమాత్రం పోజు లేకుండా అందరితో కలిసి రిహార్సల్స్ చేయటం, మిగిలిన పాత్రల సంభాషణలు కూడా బై హార్ట్ చేయటం మాకు ఆశ్చర్యం కలిగించింది.ఒక్కోసారి రిహార్సల్స్ లో మేము తడబడ్డా ఆయన అందించటం మాకు కించిత్ సిగ్గును కూడా కలిగించింది...డ్రెస్.... గెటప్...... మేకప్....పెర్ఫార్మెన్స్....ఇలా ప్రతి అంశంలోనూ ఆయన చూపే శ్రద్ధ, ఆసక్తి చూస్తే నిజంగా ముచ్చట వేస్తుంది...తోటి ఆర్టిస్టుల పట్ల ఆయన చూపే ఆత్మీయత, ఆప్యాయత, ప్రేమ మా అందరికి ఆయన పట్ల గౌరవాన్ని మరింత ఇనుమడింప చేసింది...నో డౌట్...బాలయ్య .....ఎ లవబుల్ హీరో...తండ్రి సంస్కారాన్ని పుణికి పుచ్చుకున్న వ్యక్తి....లాంగ్ లివ్ బాలయ్య బాబు....ఈ సారి అమెరికా ప్రయాణంలో బాలయ్య తో ఈ అనుభూతిని , అనుభవాన్ని ఇలా బ్లాగు లో షేర్ చేసుకోకుండా ఉండలేక పోతున్నాను....






5 కామెంట్‌లు:

  1. నిజమేనండీ..బాలయ్య బహుముఖ పాఠవం
    గలవాడు.మీ నుండిమరిన్ని పోస్ట్లను ఆశిస్తున్నాము

    రిప్లయితొలగించండి
  2. బాలయ్య నిజంగా బాలయ్యే అందుకే చాలా మంది
    (దాసరి,yvs,)మొదలగు వాళ్ళు ఆయన్ను పక్కదోవ పట్టించారు
    ఇప్పటికైనా ,,,సంతోషం
    లేక ఈపాటికే ఎన్నో శ్రీ రామ రాజ్యాలు వచ్చేవి
    (సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా)

    రిప్లయితొలగించండి
  3. bala krishna goppa sanskara vanthudu antunnaru kani oorike chiranjeevini thiduthu janallo alusu ay potunnadu

    రిప్లయితొలగించండి
  4. Very true AVS garu.. Many people misunderstands him.. I feel bad, when arrogant fans post bad comments on him..

    రిప్లయితొలగించండి