9, జులై 2010, శుక్రవారం

రెస్పాన్సిబుల్ రెస్పాన్స్ ...!

పైరసీ గురించి నేను వ్యక్తం చేసిన అభిప్రాయం ఆసక్తికరమైన చర్చకు దారి తీయటం ఆనందంగానే ఉంది . నా అభిప్రాయాల్ని సమర్ధించుకోవాలనో ... ఎదుటివారి అభిప్రాయాల్ని విమర్శించాలనేదో నా అభిమతం కాదు . పైరసీ సీడీలు చూడటంలో  తప్పేముందని అడుగుతూ... పరిశ్రమ పవిత్రంగా ఉందా అని ప్రశ్నించిన వాళ్ళందరూ ' పైరసీ సీడీలు చూసేవాళ్ళు ' అని అనుకునేంత అవివేకిని కాను . ఒక మిత్రుడు  పరిశ్రమలో జరుగుతున్న కాపీయిజం గురించి , నల్లధనం గురించి , ఇతర అవలక్షణాల గురించి అద్భుతంగా ప్రస్తావించారు . ఆయన సునిశిత పరిశీలనాసక్తిని చూస్తే నాకు ముచ్చటేసింది . కానీ .... నేను స్పందించింది జూబ్లిహిల్స్  లో ఉన్న పాతిక , ముప్పై మంది గురించి కాదు , ఆంధ్రదేశంలో సినిమాను నమ్ముకొని బతుకుతున్న లక్షలాదిమంది గురించి .
కధలు కాపీకొడుతున్న వాళ్ళ గురించి కాదు ... గోడల మీద వాల్ పోస్టర్లు అంటిస్తున్నవాళ్ళ     గురించి ... 
సన్నివేశాలు కాపీకొడుతున్న వాళ్ళ గురించి కాదు ... సైకిల్ స్టాండ్లను  నమ్ముకొని బతికే వాళ్ళ గురించి ...
మ్యూజిక్కు  కాపీకొడుతున్న వాళ్ళ గురించి కాదు ... సినిమా హాళ్ళల్లో పల్లీలు ,సోడాలూ అమ్ముకునే వాళ్ళ గురించి ...
సన్నివేశాలు లేపింది ఏ ఉడ్ నుంచి అన్నది కాదు ప్రశ్న ... ఎన్ని లక్షల మంది సినీ కార్మికులు ఫుడ్డుకోసం ఎంతగా అల్లాడుతున్నారనేది ముఖ్యం ...
నల్లడబ్బు సంపాదించిన బడా సినీ బాబుల గిరించి నేను మాట్లాడలేదు... ఏరోజు రూపాయి ఆ రోజు సంపాదించుకొని మెతుకు తినే గతుకు బతుకుల గురించి మాత్రమే  నేను స్పందించాను ...
స్ధలాల ఆక్రమణా , టాక్సులు ఎగ్గొట్టటం , నల్ల డబ్బు రాజ్యమేలటం లాంటివి  ప్రపంచంలో అన్ని రంగాల్లో ఉన్న దౌర్భాగ్యమే . ఎక్కడైనా అది తప్పే ... దానిని ఎవడూ సమర్ధించడు . దానిని పైరసీ సమస్యకు ముడిపెట్టటం సబబు కాదేమోనని నా ఆభిప్రాయం .
                    నేను లక్కీగా ఆర్టిస్టునయ్యానని కొందరు ఆనందం వ్యక్తం చేశారు , వాళ్ళకు ధ్యాంక్స్ . సినిమా రంగమైనా .. రాజకీయమైనా .. రొయ్యల వ్యాపారమైనా ... చివరికి బ్యాంకింగు రంగమైనా లక్ ఉంటేనే పైకొస్తారు .  నా సినిమాల ఢమాలుకు పైరసీయే కారణమని నేనెప్పుడూ నగారా మోగించి చెప్పలేదు . పైరసీ సమస్య నా వ్యక్తిగతం కాదు , మంచి సినిమాలు ఎక్కడ వస్తున్నాయి  అని ప్రశ్నించుకునే ముందు ఏవి మంచి సినిమాలో .. ఏవి కావో ..తెలియాలంటే ధియేటరుకు వెళ్ళి చూడాలి కదా . పైరసీ సీడీల్లో చూస్తే మల్లీశ్వరీ , మాయాబజార్ , మగధీరా సినిమాలు కూడా దరిద్రంగానే ఉంటాయి . సినిమాలు తీయమని ఎవరూ ఏడవరు...
 స్వర్గీయ " యన్ టీ ఆర్ " అన్నట్టు సినిమా ఓ కమర్షియల్ కళారూపం . సినిమా చూద్దాం అనుకునే ప్రేక్షకుడికి వ్యయం ఎలా పెరిగి పోయిందో , సినిమా నిర్మాణ వ్యయం కూడా అలాగే పెరిగింది . కృష్ణ గారి అల్లూరి సీతారామరాజు  సినిమా ఆ రోజుల్లో 27 లక్షలు అయ్యింది . ఇప్పుడైతే 27 కోట్లు అవుతుంది . ఒక్కటి మాత్రం నిజం  . పైరసీ పెరగటానికి బలమైన కారణాల్లో ఒకటి .. సినిమాకు వెళ్ళాలనుకునే ప్రేక్షకుడికి ఖర్చు విపరీతంగా పెరగటం . ముందుగా టిక్కెట్ల రేట్లు తగ్గేందుకూ ... సినిమా హాళ్ళల్లో అమ్మే స్నాక్స్ ధరలు తగ్గేందుకు ... సినీ పరిశ్రమ కృషి చేయాలి . ఎంత ఖర్చైనా సరే ధియేటర్ కు వచ్చే సినిమా చూడండీ , అని అడగటం ... అలా ఆశించటం తప్పు . ముందు పరిశ్రమ ఏం చేయాలో చేస్తే తరువాత ప్రేక్షకుడు ఏం చేయాలో అభ్యర్ధిద్దాం .
                   ఇదంతా నేను రాసింది ఏవరికో సమాధానం చెప్పటం కోసం కాదు ..  లేదా నా బ్లాగును ఓ చర్చా వేదికగా మార్చాలనే సంకల్పంతోనూ కాదు ... ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి ... నా అభిప్రాయం నాది ... సమస్యను పాజిటివ్ గా అర్ధం చేసుకుంటారని నా ఆశ ...ఈ అంశం పై ఇంతకు మించి  నేను స్పందించటం అవసరం కాదేమో .
పైరసీ సీడీలు చూసే వాళ్ళెవరైనా నా మాటలకు నొచ్చుకుని ఉంటే మన్నించండి .....

32 కామెంట్‌లు:

 1. >>"పైరసీ సీడీలు చూసే వాళ్ళెవరైనా నా మాటలకు నొచ్చుకుని ఉంటే మన్నించండి." :-) :-)

  వచ్చే ప్రతీ సినిమానూ తిట్టుకుంటూనే, మళ్ళీ ఏదైనా సినిమా రిలీజైతే ఫస్ట్ రోజే క్యూలో నిల్చోవాలనుకుంటారు. నాలాంటోళ్ళు చాలా మంది. :-)

  రిప్లయితొలగించండి
 2. మంచి రెస్పాన్స్ చాల బాగుంది . పైరసీ ని అరికట్టడం కోసం మీరు పబ్లిష్ చేసిన రెండు పోస్ట్ లూ చదివాను . చాలా బాగున్నాయి. వాటికి కొందరు ఇచ్చిన రెస్పాన్స్ చూశను . సమస్యకు స్పందించడం , అసలు సమస్యను పక్కదారి పట్టించడం లోని తేడాను చాలామంది మర్చిపోతున్నారు అనిపిస్తుంది . అసలు సమస్యను పక్కన పెట్టి కొందరు కొత్త సమస్యల గురించి ఆలొచిస్తున్నారు . ఎనీవే మీరు ఇలాగే రెగ్యులర్ గా రాయండీ . ప్రతి సమస్యకు స్పందించండి . we are there to support u .

  కృష్ణశ్రీ గారు గుడ్ లక్ ,
  ఎవరి లక్ ఎవరు చెప్పొచ్చారు , మీ లక్ మీది ఆయన లక్ ఆయనది , బ్యాంకింగ్ రంగంలో ఉన్న మీ లక్ గురించి వేరే చెప్పాలా , ఎదుటి వారిని వేలెత్తి చూపించేముందు మనం ఏమిటో తెలుసుకోవడం ముఖ్యం . వెయ్యి జన్మలెత్తినా ఆర్టిస్టు కావడం అనేది నిజంగా లక్ యు ఆర్ రైట్ ఎంత మందికి ఉంటుంది ఆ లక్ చెప్పండి . ఇప్పటికీ మీరు గుర్తుంచుకున్న " తుత్తీ " అనేది ఆయన సినిమా మ్యానిరిజమే కదా . సినిమా అంత గొప్పది , ఆర్టిస్ట్ అంతకంటే గొప్పవాడు ఒక సమస్య గురించి స్పందించేటప్పుడు ఏదుటి వారి వ్యక్తిగత విషయాలను చర్చించకూడదనే కొద్దిపాటి అవగాహన ఇంత పెద్దవారైన మీకు లేనందుకు బాదపడుతున్నాను .

  రిప్లయితొలగించండి
 3. ఓ సినిమాలో విలన్ కే కోటి రూపాయలు పైగా రెమ్యూనరేషన్ ఇచ్చారని విన్నాను. కోటి రూపాయలు ఉంటే ఒక లో బడ్జెట్ సినిమా తియ్యొచ్చు. భారీ బడ్జెట్ తో తీసే సినిమాలని నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లకి ఎక్కువ ధరకి అమ్ముతారు. డిస్ట్రిబ్యూటర్లు థియేటర్లకి ఎక్కువ ధరకి అమ్ముతారు. థియేటర్ యజమానులు టికెట్ల ధరలు పెంచుతారు. హీరోలు, విలన్ లకి ఇచ్చే రెమ్యూనరేషన్ తగ్గించినా సినిమా వాళ్లకి ఖర్చు సఘం తగ్గుతుంది.

  రిప్లయితొలగించండి
 4. i am amazed by these bankrupt, sick, educated bloggers. who wrote the following


  >> వీళ్ళ వ్యాపారం వీళ్ళు చేసుకొంటున్నారు,
  >> వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకొంటున్నారు!

  >> దేని కోసం పైరసీ అరికట్టమంటున్నారో చెప్పండి

  >> పరిశ్రమ దివాలా కోరు భావదారిధ్ర్యం ముందు ఈ నేరం
  >> నాకు చిన్నగా అనిపించడం

  It is like saying: "that guy murdered somebody, so I will murder him or rape his xyz".

  defending piracy is a bankrupt intellectual brinkmanship.

  We discussed this topic sometime back. then all these shameless pirates gang of piracy supporters were shown the door by the cinematography minister's announcement that Piracy laws will be enacted.

  period.

  రిప్లయితొలగించండి
 5. CHALABAGA ANSWER CHEPPARU SIR NAKU IPPUDU ARDHAM AYYINDI PIRACY ENDHU PERIGINDHO ARTIST REMENURATION EKKUVA THISUKUNTUNNARANI ANDHARU ALIGARU HA HA HA EVARU ENTHA TESUKUNTE MANAKENTANDI MANAM OKA CINEMA PRODUCE CHESTHE TELUSTUNDHI MAHESH BABU ACT CHESINA MOVIE KI VELATHRARA KOTHA HERO ACT CHENA MOVIE VELATHARA? ENTHA CHETTUKI ANTHA GALI MAHESH BABU IMAGE PEDDADI REMENURATION PEDHADI.PIRACY NI ARIKATTANDI ANTE ANDHARU OWN PROBLEM LA FEEL AVUTUNNARU SIR AVS GARU MANCHI CHEPTUNTE CHEDU VETHIKE VALLAKI MEERU REPLY IVVAKRLADHU U KEEP ROCKING SIR. MGK GARU YOU ARE RIGHT ISSUE IS GETTING TOOOOOOO PERSONAL

  రిప్లయితొలగించండి
 6. డియర్ AVS & others!

  నా ఈ క్రింది టపా చదవండి.

  http://krishnasree.blogspot.com/2010/07/blog-post.html

  అందరికీ ధన్యవాదాలు!

  రిప్లయితొలగించండి
 7. >> WitReal, deepu లాంటి వాళ్ళు తెలుగు వ్రాయగలిగీ,
  >> ఇంగ్లీ-తెలుగు లో యెందుకు బ్లాగుతున్నారో నాకు తెలీదు.

  if you don't understand ప్రపంచానికేమి నష్టం లేదు!

  రిప్లయితొలగించండి
 8. తెలుగు బ్లాగుల్లో ఇంగ్లీషు కామెంట్లు చెయ్యకున్నా, ప్రపంచానికేమీ నష్టం లేదనుకుంటా.

  రిప్లయితొలగించండి
 9. >> తెలుగు బ్లాగుల్లో ఇంగ్లీషు కామెంట్లు చెయ్యకున్నా,
  >> ప్రపంచానికేమీ నష్టం లేదనుకుంటా

  why these crap comments?
  how are they related to the discussion?

  those who escaped from vizag hospital can make a much coherent discussion than this.

  రిప్లయితొలగించండి
 10. @విట్ రియల్: పైరసీ చట్టాన్ని కట్టడిచెయ్యండి అని AVS గారు appeal చేసుంటే వచ్చే ప్రతిస్పందన వేరుగా ఉండేది. కానీ వారు చేసింది నైతికపరమైన ప్రశ్నల్ని లేవదీస్తూ చేసిన అభ్యర్థన. దానికి నైతిక పరమైన స్పందనమే లభిస్తుంది.

  పైరసీ చట్ట వ్యతిరేకం. నేరం. దానిని అరికట్టడానికి ఒక వ్యవస్థ ఉంది. దాన్నుంచీ తమని తాము కాపాడుకోవలసిన బాధ్యత/హక్కు పరిశ్రమకుంది. Let them do their job, who is stopping them.

  అంతేగానీ, ఎమోషనల్ రెటొరిక్ తో "పరిశ్రమను కాపాడండీ" అని దేబరిస్తే చెత్త సినిమాలు చూపిస్తున్న పరిశ్రమను "మీ స్థాయి ఇంతే మీగతికి మేము బాధ్యులము కాము" అని చెప్పడానికి ఎవరూ వెనకాడరు.

  రిప్లయితొలగించండి
 11. >> "మీ స్థాయి ఇంతే మీగతికి మేము బాధ్యులము కాము"

  Suppose you earn millions by wrong deeds.

  you keep the money in the bank.

  Then the bank manager like 'కృష్ణశ్రీ' who thinks that he has to punish you by pilferage'ing that account -- then will you still say "పరిశ్రమ దివాలా కోరు భావదారిధ్ర్యం ముందు ఈ నేరం నాకు చిన్నగా అనిపించడం ఎవరి బాధ్యతో ఒకసారి ఆలోచించమంటున్నాను"


  >> ఎమోషనల్ రెటొరిక్ తో "పరిశ్రమను కాపాడండీ" అని దేబరిస్తే

  తప్పు చేస్తున్న లేక చెయ్యబొతున్న వాడికి - "నువ్వు చెస్తున్నది తప్పు అని చెప్పటం" దేబిరించటమా?

  ఇప్పుడు see this scenario:

  1. you all committed that "చట్ట వ్యతిరేకం. నేరం." (in your own words) activity of abetting piracy.

  2. The reason most of you give is that some producers violated copyright laws. - That means, you decided the punishment for the producers' crime.

  3. Now, just as you did, someone else decides a punishment for your crime of abetting piracy.....he will do some damage to you..... and the chain goes on.

  if you dont/cant think of what chain you are being a part of, then ask the video shop owner who was beaten black & blue by Mohanbabu fans.

  If such a chain of self decided punishments goes on ...... Then do we remain as a civil society?

  now, you think.

  రిప్లయితొలగించండి
 12. very good witreal garu chala bagha chepparu.krishna sri garu nenu telugu lone blaguthanu naaku idhe comfortable andhariki matter post chesama ledha anadhe point.

  రిప్లయితొలగించండి
 13. Mahesh garu blog lo 90%positive unte meeru 10%negitive ni choostunnaru.meeru chetha cinemalu testhe choodamu antunnaru atleast hit movies theatre lo choodandi chalu. adhi kaka prathidi manam choose dantlo undhi sir

  రిప్లయితొలగించండి
 14. పైరసీని కళాకారులు,కళను అభిమానించే వారు ఎవరైనా ప్రోత్సహించడం మంచిది కాదు.ఇక్కడ ఏవీయస్ గారు అదే విజ్ఞప్తి చేశారు. మంచిది.

  కాకపోతే ఈ టపాలో గోడల మీద వాల్ పోస్టర్లు అంటిస్తున్న వాళ్ళ గురించి, సైకిల్ స్టాండ్లను నమ్ముకుని బతికే వాళ్ళ గురించి, పల్లీలు-సోడాలు అమ్ముకునే వాళ్ళ గురించి ప్రస్తావించారు. దాని గురించి కొద్దిగా చెప్పదలుచుకున్నాను.

  ఒక వేళ అందరూ పైరసీ సీడీలు చూడ్డం మానేసి, థియేటర్లకు వెళ్ళే సినిమాలు చూస్తున్నారనీ తద్వారా సినీపరిశ్రమ మంచి లాభదాయకంగా నడుస్తున్నదనీ అనుకుందాం. అప్పుడు పైన చెప్పిన వాళ్ళకి ఒరిగేదేమైనా ఉందా?
  వాల్ పోస్టర్లు అంటించే వారికి జీతం పెంచుతారా?
  సినిమాను నమ్ముకున్న అనేక మంది కళాకారులకు నిర్మాతల, హీరోల లాభంలో వాటా పంచుతారా?
  వాళ్ళ సమస్యలు వాళ్ళవే. వాళ్ళ బతుకులు వాళ్ళవే. పేద బతుకులు పేదవే.

  సూటిగా చెప్పాలంటే ముందుగా కథానాయకులకు, నటులకు, దర్శకులకు చెల్లించే కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తగ్గించి ఆ మిగులు సినిమాకు పనిచేసే ప్రతి చిన్న పనివాడికి ఇస్తే వాళ్ళ బతుకుల్లో వెలుగు నింపిన వారవుతారు.

  రిప్లయితొలగించండి
 15. ఈ విషయ సందర్భంగా నా అభిమాన బ్లాగర్ శ్రీ శివరాం ప్రసాద్ గారు ఒక చక్కని వ్యాసం రాశారు. అది ఇక్కడ ఉంది..
  http://saahitya-abhimaani.blogspot.com/2010/03/blog-post_2147.html

  @రవి చంద్ర గారు,
  సినిమా 100 రోజులు ఆడితే పని చేసేవాళ్ళకి బోనస్లు ఇస్తారని విన్నాను(కరెక్ట్ గా తెలీదు). అందుకే సినిమా హిట్ అవ్వడం వారికి లాభదాయకం..

  రిప్లయితొలగించండి
 16. Hi Sir,
  After "EkNiranjan" i stopped watching movies in theaters.
  And the only movie i watched recently in theaters is "Leader",Even i found a piracy CD at one of my friends.
  And Recently We spent 1000 rs to know that "Jummandi Nadam" is a worest movie(My friend booked the tickets :( )

  రిప్లయితొలగించండి
 17. ఈ టెంప్లేట్ మార్చండి సారూ. కళ్లు జిగేల్మనిపిస్తుంది. కాస్త తేలికపాటి రంగులెంచుకుంటే మరింతమంది చదివి చర్చలో పాల్గొంటారు.

  రిప్లయితొలగించండి
 18. పైరసీ వల్ల తెలుగు సినీ పరిశ్రమలో ఎవరెవరికి ఎంతెంత నష్టం జరుగుతోందో ఆ వివరాలకి సంబంధించి సాధికారిక సమాచారం ఎక్కడైనా దొరుకుతుందా? అలాంటి వివరాలు ప్రభుత్వం కాని సినీ పరిశ్రమ కాని సేకరించి, ప్రచారం చెయ్యగలిస్తే ఉపయోగకరంగా ఉంటుంది.

  రిప్లయితొలగించండి
 19. @Karthik Thank you for giving the link for the article I had written sometime back.

  Dear AVS Garu. You are from the Ciny field and so you are giving your version on the piracy. Please read the article I had written in my blog link for which already given by Shri Karthik, to understand the agony of the telugu movy lovers, who are unable to get proper CDs. In thelugu there are no DVDs at all but only VCD copied onto DVD and price hiked up.

  If you can do something about these commercial aspects where inferior quality VCD/DVDs are simply sold with impunity at very high prices until recently. Only because of piracy to beat them out of the market, the VCDs/DVDs are now available for less than Rs.50- otherwise these commercially minded people were selling each movy for more than Rs.300 to 400 not so long ago.

  రిప్లయితొలగించండి
 20. మీలాంటి సినిమాతార తెలుఁగులో ఇలా బ్లాగుమొదలు పెడతారని నాకు ఐదేళ్ళ క్రితం ఎవరైనా చెప్పివుంటే నేను నవ్వుకునేవాడిని। కానీ ఇవాళ అది జరగడం చూసి నాకు చాలా సంతోషంగా వుంది। ఆంగ్లంలో బ్లాగి ట్వట్టించుకునే యువతరం తారలకంటే మీరు తెలుఁగు భాషనవీకరణ ద్వారా తెలుఁగు ప్రజలకు చేసే సేవ చాలా గొప్ప॥

  సినీదోపిడీ మీద ఎవరి అభిప్రాయాలు వారికి వుండవచ్చు। మీతో నేను పూర్తిగా ఏకీభవించకపోయినా, మీరు విమర్శకులను సున్నితంగా ఖండించిన తీరు నాకు చాలా బాగానచ్చింది। సినిమాతార అయినప్పటకీ చాలా వినయంగా సమాధనమిచ్చారు। మీలాంటి ప్రాచుర్యం వున్నవారి బ్లాగులో విషపూరితమైన మఱియు వివాదాత్మకమైన వ్యాఖ్యలు వ్రాసి వారి ప్రాచుర్యాన్ని పెంపొందించుకోఁజూచు వారు చాలా మంది వుంటారు। మీరు వారిని పట్టించుకోకుండా ముందుకు సాగుతారని ఆశిస్తున్నాను। అవసరమనిపిస్తే వ్యాఖ్యల moderation పెట్టుకోండి॥

  బ్లాగ్లోకానికి స్వాగతం॥

  చివరిగా - ఈ బుడగల రంగులు చూడలేకపోతున్నాం। సున్నితమైన రంగులు ఎంచుకోండి। పైపెచ్చు తెలుపుపై నలుపు అక్షరాలు వచ్చే టెంప్లేటు అయితే చదువరులకు అనుకూలంగా వుంటుంది। నా బ్లాగురంగులు చూడండి॥

  రాకేశ్వర రావు
  అందం బ్లాగు

  రిప్లయితొలగించండి
 21. @ శివ said...

  >> inferior quality VCD/DVDs are simply sold
  >> with impunity at very high prices

  ఎట్టెట్టా?

  ధరలు విపరీతంగా పెరిగిపొతున్నాయి.. కిలో బియ్యం పది రూపాయిలుండేది, ఇప్పుడ్ 40-50 రూపాయిలు పెట్టి కొనాల్సి వస్తొంది.

  ధరలు తగ్గించక పొతే, మేము బియ్యం కొట్టుకి కన్నం వేస్తాం!

  ఇట్టాగుంది మీ వరస!!

  రిప్లయితొలగించండి
 22. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 23. @విట్ రియల్, మరీ అంత వ్యగ్యం అక్కర్లేదు, అంత ఎక్ష్ట్రీం కు వెళ్ళక్కర్లేదు. బియ్యం రేటు ఎక్కువైతే ఎవరూ దొంగతనం చెయ్యట్లేదు. కాని సి.డి ల విషయంలో ఈ దొంగ వ్యాపారుల పీడనుంచి తప్పించుకోవటానికి వినియోగదారులకు ప్రస్తుతం టెక్నాలజీ ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చింది. ఆ అవకాశాన్ని కొంతమంది వాడుకుంటున్నారు, ఆ దెబ్బకి 200 300 రూపాయలు అమ్ముకునే సినిమా సి డిలను కాపీ రైటు ఉన్నవాళ్ళు కూడ 30 రూపాయలకే అమ్మటం మొదలు పెట్టారు. ఇప్పుడు కూడ వాళ్ళకు లాభమే. ఇంతకు ముందు 200 300 రూపాయలు మన దగ్గర తీసుకున్నది ఏమిటి దోపిడీ కాదా? పైగా చెత్త క్వాలిటీతో, సినిమాలో అన్ని భాగాలు లేకుండా, పాటలు కత్తిరించి పాత సినిమా సి.డి లను అమ్మటం తెలుగు సినిమా సి.డి వర్తకులు చేస్తున్న అన్యాయం మీకు అద్భుతమైన వర్తక నైపుణ్యంగా కనపడుతున్నట్టున్నది,

  మీ బియ్యం ఉదాహరణే తీసుకుంటే, ఒకడు రైతు దగ్గర 10 రూపాయలకు కొని, అందులో రాళ్ళు తప్ప తాలు కలిపి ఒక కిలోని ఒకటిన్నర కిలో చేసి 50 రూపాయలకు అమ్ముతుంటే తప్పకుండా మీరు అన్నదే జరుగుతుంది. బియ్యం వర్తకులు మరీ అంత ఘోరానికి తెగపడటంలేదు, రేటు పెంచినకొద్ది కొద్దొ గొప్పో నాణ్యం కనపడేట్టుగా చేస్తున్నారు, ఏమైనా తినే వస్తువుకదా. సి.డిలు అమ్ముకునే ఈ నిరక్షరాశ్య వర్తకులు అటువంటి నాణ్యత పాటించటంలేదు, అదొక ముఖ్య కారణం పైరసీ విజృంభించటానికి. మంచి నాణ్యంతో, సరసమైన రేటుతో సి.డిలు అమ్మండి, పైరసీ పారిపోతుంది, అది నా పాయింటు.

  రిప్లయితొలగించండి
 24. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 25. Sir

  Cinema vyapareme kani Industry antey naku ekkado guchukuntadi. creative field lo unnaru, sontha risk tho vastary, oka painting amudupothadi, okati podu. Market will decide what they should get paid....

  mari intha independent field lo sangalu avsarama...sangalu manufacturing chesey uncreative jobs ki ok kani....cinema ku panikiravu. Unless telugu cinema nu mirantha kalisi doordarshan sthayiki tiskupovalianukuntey taputey. oka actor ni ban chesi hakku mi sangalaku enduku? 400 individual get together and make cinema...!

  Unless miru bad quality isthunaru ane confident untey taputhey asal e sagalu avsaram antara

  రిప్లయితొలగించండి
 26. I am not talking about moral implicatins here. It is up to the producers and directors who copy stuff and the audience who watch it online or in cds. I would like to put at ease AVS and some other people with this info
  1) Do not count all piracy watchers as missed audience. 90% would not go to the movie theater to watch the movie anyway. A lot of them look at a movie with "not so great" talk as a tv episode that they can pass but would watch if it is readily available
  2) the reason you guys get so upset is seeing the number of pirated cds released. for example teja's last movie or dasari's last movie (young india!) make 10 crore pirated copies of those movies and distribute freely and see how many people watch it. even if they did, does that mean the producers lost 1000 crores because of piracy ?
  3) Bavundhi ani talk vachina movie edhaina flop aindhaa! prasthaanam ani industry lo chincukovadam tappa emanna point undha movie lo! simha lanti movies chala chotla mute or forward cheste kani family tho chudalemu
  4) DVD start avadaniki mundu ads lo user input disable chesi maree chupistaaru. oka 10 mins paatu mee chetta advertisements bharinchaali. daani kanna piracy cd chaala better. direct to the point cinema ki vastaru.
  5) AVS garu magadheera lanti cinema lu pirated copy lo daridram ga untayi ani raasaaru. mari aa cinema enduku antha pedda hit ayindhi ? piracy jaragaledha ?

  రిప్లయితొలగించండి
 27. Well said Efsan. You have a point when you said all those purchasing pirated CDs are the viewers lost to a movie. Very much True.

  రిప్లయితొలగించండి
 28. @ Sharad Chandra . excellent points. industry anedhi oka parisrama anta. lands kavali anta. murali mohan cinema produce chesi 10 years aindhi. atanu producers association lo active. sontham ga kotlu sampadinchaadu. govt daggara public money and lands kosam tirige badulu sontha dabbu ichukovachu kadha. dasari hit ichi 15 years antaku mundu inko 15 years. tammareddy inkokaru. 20 yrs aindhi atanu cinema teesi . veellu industry heads. evarini uddaristunnaaru. kotta vaallu movies teeste teliyakunda digutunnaaru loss autunnaaru ani deppi podupu. unions strikes bans on actors, caps on remunerations dharna lu ivaa creative minds chese pani ? kontha mandhi directors or heros vaste andaru lechi nunchovali anta. sir ani pilavali anta. ivanni lekunda hollywood lo pillalu teese cinemalu music copy kottadam okati. andaru lechi nunchuni nunchuni teesina latest KRR movie ongundhi. aina kaani edho pedda speilberg laga buildup okkokkaru

  రిప్లయితొలగించండి
 29. GR8 SHARAT CHANDRA & OSFAN I APPRECIATE UR ideas but do u know some issues murali mohan gaaru tana sonta dabbu to ento mandi ni chadivistunnaru adi telusaa meeku , endukandi anavasaran gaa aakasam meeda raallu veyadam adi manakey tagulutundi kadaa meeru sanga seva cheyyakkara ledu at least chesevalaanu chayyanivvandi . and avs garu oka samaajika amsaanni andari mundu pettaru so try to react positively or else keep quite dont waste ur time on useless typing i suggest u this and evari gurinchi teliyakundaa inkosaari maatladavaddu . unions strikes anevi annitilo unnaayi so its commons and cinema is an industry whether u say it or not ok daani valla konni lakshala mandi batukutunnaru so it is an INDUSTRY

  రిప్లయితొలగించండి
 30. @శివ గారు,
  మీరు చెప్పినట్టు మంచి క్వాలిటి వున్న సిడిలను తయారు చేసి ఎక్కువ రేటుకి(అనగా 200,300) కి అమ్మినా ఇప్పుడు వున్న టెక్నాలజీ వాడుకొని వాటిని కూడ పైరసి చేయరని గ్యారంటి లేదు కదండి. అప్పుడు కూడ అటువంటి సిడిలను పైరసి చేసి 20, 30 రూపాయలకు అమ్మవచ్చు కదా??

  మరి మంచి క్వాలిటి సిడిలతో పైరసి ఎలా తగ్గించవచ్చు??

  రిప్లయితొలగించండి
 31. అన్నిటికంటే చేయాల్సింది ముందు బ్లాక్ లో టిక్కెట్స్ అమ్మకుండా చూడటం.పిల్లల్ని ఎలాగో కంట్రోల్ చేసుకొని స్టాల్స్ వైపు వెళ్ళకుండా ఆపుకోగలం, టిక్కెట్ రేట్ పెరిగితే వారానికి బదులు రెండువారాలకోసారి సినిమా చూస్తాం.కానీ లైన్లో పదిమందికి టిక్కెట్స్ ఇచ్చి హౌస్ ఫుల్ బోర్డ్ పెట్టి బ్లాక్ లో టిక్కెట్స్ అమ్మించే థియేటర్స్ యాజమాన్యాన్ని ఎవరు కంట్రోల్ చేస్తారు .పిల్లలతో సినిమాకి వెళ్దామంటే అరవైరూపాయల టిక్కెట్ నూటయాభై రూపాయలకి అమ్ముతుంటే కొనలేక, పిల్లల కళ్ళల్లో నిరాశ చూడలేక వెనక్కి వెళ్ళిపోయే మధ్యతరగతి వాళ్లకి పైరసీ కాక వేరే దిక్కేముందండీ? అలాని పైరసీని ఎంకరేజ్ చేస్తున్నానని అనుకోకండి ఈవైపునుండి కూడా ఆలోచించమంటున్నాఅంతే.నిజానికి థియేటర్ వాళ్ళ తప్పూ లేదేమో సినిమా ఎలా ఆడుతుందో తెలీదు డబ్బులు మాత్రం రాబట్టేసుకోవాలనే తాపత్రయం వాళ్ళది. హ్మ్...ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి ... ఇది నా అభిప్రాయం మాత్రమే సుమండీ:) :)

  రిప్లయితొలగించండి
 32. AVS గారి మాటలని ఇంత సీరియస్‌గా తీసుకొనేవారున్నారంటే ఆశ్చర్యమేస్తోంది. ఇప్పటివరకూ AVSగారి ఫోస్టులన్నీ చూస్తే నాకనిపించిందేమిటంటే:
  1. AVSగారు సినిమారంగ పక్షపాతి.
  2. ఆయనకు కొన్ని తప్పని సరి మొహమాటాలున్నాయి & వాటిని ఆయన పాటిస్తారు (ఆయన సత్యసంధుడేమీకాదు & సీబీఐ లాగా ఆయన విధేయతలు ఆయనకున్నాయి) ఉదా:- మోహన్ బాబుని స్థిత ప్రజ్ఞుడిగా అభివర్ణీంచడం. "చంక"ని ఉపయోగిస్తూ ఇంతకంటే దీన్ని బలంగా చెప్పలేను.
  3. ఈయన అగ్రతారలను ఎలాగైనా సమర్ధిస్తారు మరియు వారిలో ఈయనకి లోపాలేమీ కనబడవు. ఒకవేళ విమర్శించినా అవి కేవలం సన్నాయినొక్కులు మాత్రమే. లేదంటే భావావేశాలను రెచ్చగొట్టేవిమాత్రమే (ఈ టపాలోలాగా)
  4. కనీసం ఈయన సినిమా రంగమ్నుండి తప్పుకొన్నాకైనా నిష్పక్షపాతమైన విశ్లేషణ చేస్తారని ఆశిస్తున్నాను.

  రిప్లయితొలగించండి