16, జులై 2010, శుక్రవారం

కోతిమూక..సంథింగ్ డిఫరెంట్...!

కోతిమూక సినిమా సెన్సారు పూర్తిచేసుకుని రిలీజుకు చేరువయ్యింది . ఈ నెల 30వ తేదీన  విడుదల చేయబోతున్నామంటూ పత్రికల్లో యాడ్ కూడా ఇచ్చేశాము . మొన్న రాత్రి  సినిమా ప్రివ్యూ జరిగింది . చూసిన వాళ్ళల్లో కొంతమంది బావుందన్నారు , మరి కొంతమంది చాలా బావుందన్నారు , ఇంకొంత మంది సినిమా ఇలావుంటుదని మేం ఊహించలేదు అన్నారు . ఎవరు ఎలా చెప్పినా నాకెందుకో ప్రివ్యూ షోల రెస్పాన్స్ మీద పెద్దగా నమ్మకం లేదు . సినిమా బావుందో ... బాలేదో ...అంతిమంగా తీర్పు ఇచ్చేది థియేటర్లో  టికెట్టు కొని సినిమా చూసే ప్రేక్షకుడే .  దర్శకుడిగా " కోతిమూక " నాకు నాలుగో సినిమా . గత మూడు సినిమాల్లో నేను ఇవ్వలేక పోయిన ఒక గోప్ప సందేశాన్ని ఈ సినిమాలో సున్నితంగా ప్రెజంట్ చేశాను . సెన్సిబుల్ కామెడీతో పాటు సెన్సిటివ్ మెస్సేజ్ ను అందించేందుకు నేను చేసిన ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారో ... ఆశీర్వదిస్తారో .. అనే టెన్షను రోజురోజుకూ పెరుగుతుంది . " కోతిమూక "  అనే టైటిల్ ' ఏవీయస్ ' అనే కమెడియన్ డైరెక్షన్ కారణంగా సినిమాకు వచ్చే ఆడియన్స్ పగలబడి నవ్వుకుందామనే ప్రిపరేషన్ తో వస్తారు . కానీ కేవలం జోకుల సమాహారంతో నవ్వించటమే ఇతివృత్తంగా నేను  " కోతిమూక "ను రూపొందించలేదు హాయిగా నవ్విస్తూ ... మెల్లగా నేను చెప్పదలచుకొన్న కధలోకి ఆడియన్స్ ని తీసుకువెళ్ళేలా స్క్రీన్ ప్లే రాసుకున్నాను . హాల్లో కూర్చున్న ఆడియన్స్ కు ఒక్క క్షణం కూడా బోరుకొట్టకుండా టైం కూడా తెలియకుండా  " కోతిమూక " రూపొందిందని నా నమ్మకం సినిమా క్లైమాక్స్ లో నేను టచ్ చేసిన ఒక ఎపిసోడ్ అటు ప్రేక్షకుల్లోనూ ... ఇటు పరిశ్రమలోనూ టాపిక్ గా మారుతుందని నాకనిపిస్తుంది .
                                         నటీనటుల విషయానికొస్తే ... ప్రతి ఒక్క ఆర్టిస్టూ నాకెంతగానో సహకరించారు , అలాగే టెక్నీషియన్స్ కూడా . మా నిర్మాత ఓ అద్భుతమైన క్యారెక్టర్ , ప్రచార ఆర్భాటానికి దూరంగా ఉండే మనిషి  . ఏక్కడా రాజీపడకుండా అందంగా ... హృద్యంగా
 " కోతిమూక " సినిమా తయారయ్యిందంటే అది మా నిర్మాత గొప్పతనం అనేది నా భావన  .   "కోతిమూక " సినిమాను చూడండి ... మీకు నచ్చితే మీ మిత్రుల్లో ముగ్గురికి " కోతిమూక " సినిమాను చూడమని చెప్పండి ... ఆ ముగ్గురినీ తలా ముగ్గురికి చెప్పమని చెప్పండి....  చిరంజీవిగారు అదేదో సినిమాలో ఇలాంటిదే చెప్పి  దాన్ని హ్యూమన్ సర్వీస్ అన్నారు . ఆయనది హ్యూమన్ సర్వీస్ అయితే ... నాది హ్యూమర్ సర్వీస్ ....ఆయనది  " మానవసేవ " .... కోతిమూకది " మా నవ్వుల సేవ " . మంచి సినిమాను తెలుగు ఆడియన్స్ ఎప్పుడూ  ఆదరిస్తారనే నమ్మకం   "కోతిమూక " సినిమా హిట్ అవుతుందనే నా విశ్వాసానికి మరో మజిలీ .....
 

7 కామెంట్‌లు:

 1. AVS గారూ మీ కోతిమూక సినిమా హిట్ కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

  రిప్లయితొలగించు
 2. మిత్రమా, కోతిమూక సినిమా నేను ఎంజోయ్ చేసాను. అలా అలా ... కామెడీగా తీసుకెళ్ళి, చివర్లో ఊహించని విధంగా మలుపు తిప్పారు. నిజంగా ఆ పాయింట్ సెన్సేషన్ అవుతుంది. ALL THE BEST

  రిప్లయితొలగించు
 3. AVS garu:

  కోతిమూక సినిమా super hit అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ USA కూడా release చేస్తే మన ప్రవాసాంధ్రులు అందరూ కూడా చూసి తరిస్తారు !
  With all the Best Wishes for the super success of this movie...

  సీత గరికపాటి,
  New York, USA.

  రిప్లయితొలగించు