ఇవాళ అంతర్జాతీయ మాతృదినోత్సవం అని చెప్పారు. అమ్మకు ఒక రోజు
కేటాయించటం ఏమిటి అని వాదించే పిచ్చి కొడుకుల్లో నేనూ ఒకడినే.అయినా ఎందుకో ఒక్కసారి అమ్మను స్మరించుకుంటూ గతంలో అమ్మ
గురించి నేను రాసుకున్న పాట మళ్లీ గుర్తు చేసుకుందామనిపించింది.
పల్లవి : అచ్చ తెలుగు భాషరా అమ్మంటే....
అచ్చు వేద ఘోషరా అమ్మంటే....
అనుపల్లవి : ఆప్యాయత కంచంలో అనుబంధంలా
తొలి అన్నం ముద్దరా అమ్మంటే.....
ఆత్మీయత ఫలకంపై అనురాగంలా
తొలి అక్షర ముత్యంరా అమ్మంటే..... // అచ్చ తెలుగు //
చరణం 1 : ఆకసాన సృష్టికర్త బ్రహ్మ రా
అవని మీద సృష్టికర్త అమ్మరా
గొదారీ కాశ్మీరం ఓ తిరుపతి క్షేత్రం
నీ ధ్యాసే నిరంతరం ఇదే అమ్మ గోత్రం !
అమ్మంటే స్వచ్చమైన శ్వాసరా
అమ్మంటే స్పష్టమైన యాసరా ! // అచ్చ తెలుగు //
చరణం 2 : అమ్మపాట మానవాళి జాతియ గీతం
అమ్మమాట ఆవుపాల జలపాతం
పాలతోటి మురిపాలు ఇదే అమ్మ స్తన్యం
ప్రేమ కరుణ జాలి దయ ఇవే అమ్మ సైన్యం !
అమ్మంటే జన జీవన వేదంరా
అమ్మంటే మరో ప్రణవ నాదంరా ! // అచ్చ తెలుగు //
అమ్మకు నమస్కరిస్తూ.........
just now I heard that u r no more.....!
రిప్లయితొలగించండిMissing u r good n healthy comedy sir......
Can't really believe that you are no more...sir. miss you sir. RIP. :-(
రిప్లయితొలగించండి