10, నవంబర్ 2010, బుధవారం

రోజా ప్రయాణం ఎటు....???

    ఇది పార్టీలకతీతంగా వ్యక్తిగతంగా స్పందిస్తున్న అంశం. రోజా రెండ్రోజుల క్రితం నెల్లూరులో జగన్ మీటింగుకు హాజరయి ఆయనకు జేజేలు పలకటం చాలామందితో పాటు నాకు కూడా ఆశ్చర్యం కలిగించిన విషయం. ఆవిడ చేసింది తప్పని నా ఉద్దేశ్యం కాదు. అయితే... జగన్ తన ఓదార్పు యాత్రను గత కొద్ది మాసాలుగా నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. ఆయన సభలకు  ఎవరూ ఊహించని రీతిలో జనం రావటం పట్ల కొంతమంది విస్మయాన్ని, మరికొంతమంది భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎవరు ఏమనుకున్నా ఎంతమంది కాదన్నా జగన్ మాత్రం తాను అనుకున్న విధంగా యాత్రను కొనసాగిస్తున్నారు. ఆయన డెడికేషన్ను, గట్సును చాలామంది అభినందిస్తున్నారు కూడా. ఎవరు తన వెంట వచ్చినా రాకపోయినా తాను మాత్రం తన మార్గంలో
 ప్రయాణిస్తున్నారు. ఈ సాహసం ఆయనకు ప్రయోజనం కలిగిస్తుందా లేక నష్టం కలిగిస్తుందా అన్నది కాలం చెప్పాలి. 
     ఇది పక్కన పెడితే సడెన్ గా ఈ మీటింగులో రోజా ప్రత్యక్షం కావటం గమ్మత్తయిన పరిణామం. వైయస్ గారిని కలిసిన రోజా ఆయన మరణానంతరం మొన్నటి దాకా సైలెంట్ గా ఉండి అకస్మాత్తుగా ఎంట్రి ఇవ్వటం ఎవరికీ అర్ధం కాని ట్విస్టు. వైయస్ గారి విధానాలకు ఆకర్షితురాలయి కాంగ్రెస్ పార్టీలో చేరానని చెబుతున్న రోజా ఇప్పటిదాకా పార్టీ కార్యకలాపాల్లో ఎందుకు చురుకుగా పాల్గొనలేదు అన్నది ప్రశ్న. అందుకు ఆవిడకు ఆ పార్టీలో ఎవరయినా అడ్డం పడ్డారా?
అన్న సందేహం కలగటం అసహజమేమీ కాదు. అలా కాకుండా తాను వైయస్ గారిని  వ్యక్తిగతంగానే అభిమానించే కాంగ్రెస్ పార్టీలో చేరాను కాని కాంగ్రెస్ పార్టీని అభిమానించి  కాదు అనుకుంటే మరి ఇప్పటిదాకా జగన్ వెంట ఎందుకు ఫాలో కాలేదో అర్ధం కాని అంశం. తన యాత్రకు అధిష్టానం సుముఖంగా లేదు అని జగన్ ఎంతో ఓపెన్ గా పత్రికా ముఖంగా చెప్పారు. జగన్ వెంట వెళితే అధిష్టానానికి ఎక్కడ కోపం వస్తుందోనని చాలామంది జగన్ ను అభిమానించే ఎం ఎల్ ఏ లు నాయకులు సైతం తమ ఆలోచనను విరమించుకున్నారు. కొంతమంది అయితే అధిష్టానం మాటను కూడా తోసిరాజని జగన్ ను ఫాలో అయ్యారు. ఈ నేపధ్యంలో జగన్ ను ఫాలో కావటం ద్వారా తాను కాంగ్రెస్ అధిష్టానాన్ని తోసిరాజంటున్నారా? అన్న ప్రశ్న ఉత్పన్నం కాక మానదు. ఫైనల్ గా రోజా ' వైయస్ గారి ఫ్యామిలితో వున్నారా? '            'కాంగ్రెస్ పార్టీలో ఉంటారా ?' లేక ' ఎటూ తేల్చుకోలేని సందిగ్ధం లో వున్నారా ? ' అన్న స్పష్టత ఆవిడే ఇస్తే బెటరేమో అన్నది నా ఫీలింగ్. రోజా అభిప్రాయం ఏదయినా కావచ్చు. అది ఆవిడ ఇష్టం. అయితే మొదటినుంచి జగన్ ను ఫాలో అయివుంటే రోజా ఇమేజ్ పెరిగి వుండేది. కాని జగన్ మాత్రం తన వెంట ఎవరు వస్తున్నారా..ఎవరు రావటంలేదా...అన్నది చూసుకోకుండా తన ప్రస్థానాన్ని సాగించటం ఆయన ధైర్యానికి నిదర్శనం అన్నది చాలామంది అభిప్రాయం.
   అయితే నిన్న ఒక టివి ఇంటర్వ్యులో మాట్లాడిన రోజా పార్టీలో తనకు గుర్తింపు రాకపోవటం వల్లనే తెలుగుదేశం నుంచి బయటకు వచ్చానని చెప్పారు. నవ్వొచ్చింది. తెలుగుదేశం లో రోజా కు ఇచ్చిన ప్రాముఖ్యం గురించి ఆ పార్టీలో వాళ్ళకే కాక మామూలు జనానికి కూడా తెలుసు. మరి ఆవిడ అలా ఎందుకంటున్నారో ఆవిడకే తెలియాలి. అయితే రోజాది
ఐరన్ లెగ్ అంటూ కొంతమంది చేస్తున్న వ్యాఖ్యానాలు మాత్రం తప్పు. ఇలా మాట్లాడటం సబబు కాదు.
    ఇదంతా పక్కన పెడితే జగన్ మీటింగుకు లక్ష్మి పార్వతి గారు హాజరు కావటం మరో వందేళ్ళు ఆలోచించినా నాలాంటి వాడికి సమాధానం దొరికే అవకాశం లేని ప్రశ్న. జగన్ ఓదార్పు యాత్ర మొత్తానికి ఇది ఓ కొసమెరుపు.  




6 కామెంట్‌లు:

  1. రోజా విషయంలో మనమెంత ఆలోచించినా మెదడు తొలిచేదిగానే ఉంటుంది తప్ప మిగిలేది ఏమి ఉండదు.ఆవిడ ఎంచుకున్న మార్గం సబబే అయినా కాలం కాటేస్తుంటే తనైనా ఏం చేయగలదు.

    రిప్లయితొలగించండి
  2. Roja gurinchi manaki andu andi.........mana pani manam chesukoka.....avida gurinchi matladadam anavasaram......

    రిప్లయితొలగించండి
  3. inta matar meeru telugulo ela type chestunaaro telupagalaru. ante phonotec lonaa ledaa edainaa software vaadutunnaara ani sandeham . kaadanaka nivruti cheyagalaru.

    రిప్లయితొలగించండి
  4. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  5. ఎ.వి.యస్. గారు,
    మీరు ఆమేని గురించి రాయటం మీస్థాయి కి తగిన విధంగా లేదు. ఆమే వేసిన సినేమా వేషాలు గాని, ఆమే వ్యక్తిగత జీవితంలో గాని ఎటువంటి ప్రత్యేకతలు లేవు.డబ్బులు సకాలం లో తీసుకున్న వారికి చెల్లించ లేదని కోర్ట్ నుంచి నోటిసులు ఈ విడ కి పలుమార్లు అందాయి. అంతకాక పోతే తె.దే. పార్టి సినేమావారికి ఇచ్చిన ప్రాముఖ్యత వలన ఆమేకి ఆమాత్రమైనా గుర్తింపు వచ్చింది. మిగాతాది మీడియా వారి వలన వచ్చింది. ఎలెక్షన్ లో నిలబడ్డ ప్రతిసారి ప్రజలు ఆమేను తిరస్కరించారు. ఏ ఒక్క ప్రత్యేకత లేని ఆమేని గురించి ఆలోచించటం మన విలువైన సమయాన్ని వృథా చేసుకోవటమే. ప్రత్యేకత అంటె ఒకటి గుర్తుకు వచ్చింది. ఆవిడకి ఎలెక్షన్ లో గెలిచె సత్తా లేక పోయినా పెద్ద కాకాలు తీరిన రాజకీయనాయకులు పార్టి మార్చి నట్ట్లు అంతో ఇంతో గుర్తింపు నిచ్చిన తె.దె. పార్టి నుంచి కాంగ్రెస్ లో కి చేరటం అనే నిర్ణయం తీసుకొవటం ఒక్కటె ఈ విడగారి ప్రత్యేకత. టి.వి. / మీడియా వారికి ఈవిడ ఒక మంచి కాలక్షేపం. వారు ఆమే ముందు అభిప్రాయం చెప్పమని మైక్ పెట్టను,ఈవిడ తన అభిప్రాయాలను "మొగ గొంతు" తో చెప్పను. ఈవిడ అభిప్రాయాల కన్నా, మా ఇంట్లో 6సం|| పిల్లలు టి.వి. ప్రోగ్రాంలు చూసి మంచి గా చెపుతారు.
    -----------------------------------------------
    రాజకీయాలలోకి రావటానికి అసలికి ఆమేకి ఉన్న ఒక మంచి అర్హత ఎమీటి? తె.దె. పార్టి హవా కొనసాగి ఉంటె ముమైత్ ఖాన్ కూడా ఈ పాటికి రాజకీయాలలోకి వచ్చి ఉండెది. ఆమేకు ఎలాగు సినేమాలు లేవు కదా! రోజా వలన తె.దె. పార్టీకి కలిగిన లాభమేమి లేదు. ఆమే పార్టి ఫీరాయించేటప్పుడు బాబు గారు మీడియాకు ఆమే మా పార్టి వదలి పోయినా నష్టం లేదు అని వివరణ ఇచ్చుకోవటం తప్ప. అక్కడికి ఈవిడ పెద్ద నాయకురాలు అయినట్లు. ఆమేలేక పోతే తె.దే. పార్టికి కలిగిన నష్ట మేమి లేదు.

    రిప్లయితొలగించండి
  6. "...మీటింగుకు లక్ష్మి పార్వతి గారు హాజరు కావటం మరో వందేళ్ళు ఆలోచించినా నాలాంటి వాడికి సమాధానం దొరికే అవకాశం లేని ప్రశ్న..." The answer is very simple. Because she has no other work.

    "...ఐరన్ లెగ్ అంటూ కొంతమంది చేస్తున్న వ్యాఖ్యానాలు మాత్రం తప్పు..." One Actor just because in one movie had acted in a role by name "iron Leg" he was harassed till he died as "Iron Leg Sastry". Whether same objection was raised then also?? Otherwise why this misplaced sympathy!!

    రిప్లయితొలగించండి