రాం గోపాల్ వర్మ మరోసారి అపజయంతో వివాదాస్పదమయ్యారు..క్రమేపి వివాదాలు ఆయనకు మానరిజం గా మారిపోయాయి...ప్రతిసారి తన సినిమాల వ్యాపారం కోసం తనకు తాను వివాదాలు సృష్టించుకునే వర్మ ఈ సారి తన సినిమా ఘోర పరాజయ నేపధ్యంలో ప్రేక్షకులకు సంజాయిషీ ఇచ్చుకోవలసిన స్థితిలో ఉన్నారనిపిస్తోంది...' నా సినిమా నా ఇష్టం...నా ఫెయిల్యూర్ నాకే స్వంతం ' అని వర్మ అనవచ్చు..అది ఆయన స్టైల్. . కాని మిగిలిన దర్శకులకు అది వర్తిస్తుందేమో కాని వర్మకు అలా కాదు...సినిమా విడుదలకు ముందే తన సినిమాలకు వివాదాస్పద ఆకర్షణను క్రియేట్ చేసుకోవటం ఆయన ప్రాక్టిస్ చేసారు...ప్రేక్షకులకు అలవాటు చేసారు కూడా..ప్రస్తుతం ప్రేక్షకులు ఫిలిం లేకుండా అయినా వర్మ సినిమాలు చూస్తారేమో కాని, కాంట్రవర్సి లేకుండా చూడలేని స్థితికి చేరుకున్నారు...దారి తప్పిన మేధావి అని కొంతమంది, అభద్రతా భావం వున్న దర్శకుడు అని మరికొందరు ఇవాళ వర్మ గారిని పాయింట్ అవుట్ చేస్తున్నారంటే దానికి కారణం నూటికి నూరు పాళ్ళు వర్మ అనే చెప్పాలి...నేను గతంలో ఒకసారి బ్లాగులో రాసుకున్నట్టే సినిమా రిలీజుకు ముందు కాంట్రవర్సి మీద వర్మ చూపించిన శ్రద్ధలో ఇరవై అయిదు శాతం తన సినిమాల మీద చూపిస్తే మరోసారి సత్య, రంగీలా, సర్కార్, కంపెనీ లాంటి గొప్ప సినిమాలు చూసే అవకాశం భారతీయ ప్రేక్షకులకు లభిస్తుంది..అప్పలరాజు సినిమా చూసిన వర్మ ఫాన్స్ తో బాటు సామాన్య ప్రేక్షకుడు కూడా తీవ్రంగా నిరాశకు గురయ్యారంటే ఈ క్రెడిట్ ఎవరి ఎక్కౌంట్ లో వెయ్యాలి...? పైగా సినిమాను వర్మ సెల్ ఫోన్ లో డైరెక్ట్ చేసి ఉంటాడు అని కొన్ని వెబ్ సైట్ లు కూడా రాశాయంటే ఎంత బాధాకరం..రాం గోపాల్ వర్మ తుమ్మినా దగ్గినా లైవ్ లు పెట్టి తెగ ప్రచారం చేసిన మీడియానే ప్రస్తుతం టాక్ షోల పేరుతో చాకిరేవులు పెడుతున్నాయంటే వర్మ ప్రతిష్ట పెరుగుతోందా...తగ్గుతోందా..? సినిమాలు హిట్లు కావటం, ఫ్లాపులు కావటం అతి సాధారణ విషయం..కాని వర్మ గారి సినిమా ఫ్లాప్ అయితే ఎందుకింత చర్చ జరుగుతోంది..? బహుశా ఆయన సినిమా హిట్ అయినా కూడా ఇంత చర్చ జరగదేమో...ఎప్పుడయినా ఒక కళాకారుడికి గాని, లేదా సాంకేతిక నిపుణుడికి గాని ఎంత వినయం వుంటే అంత ప్రేక్షకుడికి దగ్గరవుతారు...వాళ్ళ పట్ల ఒక పాజిటివ్ వైబ్రేషన్ వుంటుంది... వాళ్ళు సక్సెస్ కావాలని ప్రేక్షకుడు సైతం కోరుకుంటాడు..వర్మ గారెందుకోమరి తన
గెస్చర్స్ లో కాని, బాడి లాంగ్వేజ్ లో కాని, భాషలో కాని ఒక మితిమీరిన ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ ఉండేలా తనను తాను ట్యూన్ చేసుకున్నారు..ఈ శైలి గతంలో కూడా ఉండేదే కాని ఇటివలి కాలంలో దాని మోతాదు ప్రేక్షకుడు భరించలేనంతగా పెరిగింది.. అది ఆయన పట్ల నెగెటివ్ వైబ్రేషన్స్ ను పెంచింది..యాభయి రోజులు తీసిన అప్పలరాజు ఇలా వుంటే అయిదు రోజులు తీసిన దొంగల ముఠా ఎలా వుంటుందో ? అని నిన్న ఒక మీడియా టాక్ షోలో ప్రస్తావించారంటే వర్మ కెరీర్ గ్రాఫ్ ఎటు వెళుతుందో ఆయన ఒక్కసారి సీరియస్ గా ఆలోచించటం అవసరం అన్నది ఆయన ఫాన్ గా నా సూచన..' నువ్వు చెప్పెదేవిటి...నా ఇష్టం ' అని ఆయన అంటే ఎవరు చేయగలిగింది ఏవీ లేదు...విజయం వివాదం కావచ్చేమో కాని..వివాదం విజయం కాదు...వివాదంతో విజయం రాదు...!! పేరు రావాలంటే ఎక్కువ కష్ట పడాలి....పేరు పోగొట్టుకోడానికి కష్టపడక్ఖర్లేదు అని మా పెదనాన్న ఎప్పుడో చెప్పిన మాటలు ఎందుకో మరి ఇప్పుడు నాకు గుర్తొస్తున్నాయి...!!! ఇది ఒక జర్నలిస్టుగా నా స్పందన మాత్రమే...వర్మ గారి సంస్కారం మీద నాకు అపారమైన నమ్మకం...
Quite interesting AVS Garu !!!
రిప్లయితొలగించండిAlapati.
Good one
రిప్లయితొలగించండి<< విజయం వివాదం కావచ్చేమో కాని..వివాదం విజయం కాదు...వివాదంతో విజయం రాదు...!! >>
రిప్లయితొలగించండిVery rightly said. In a recent interview for saakshi, I was hoping sirivennela Seetharama Shastry could make RGV retrospect, but RGV was hell-bent to not do so while he clearly understood what Seetharama Shastry was aiming at! God knows why...
ఒక రక౦గా సునీల్ అదృష్టవ౦తుడు,సినిమా లో పార్ట్నర్షిప్ వద్దని రెమ్యునరేషన్ తో సరిపెట్టుకొని!
రిప్లయితొలగించండిannaiah chala baga raasaru
రిప్లయితొలగించండిఅప్పలరాజు సినిమా బాగానే ఉంది కానీ రొటీన్ సినిమాలు చూసేవాళ్లకి ఆ సినిమా నచ్చదు.
రిప్లయితొలగించండివర్మ గురించి పట్టించుకోవడం మానేస్తే బెటర్....అప్పుడు దారి కోస్తాడని నా అబిప్రాయం.
రిప్లయితొలగించండిevarenni cheppinaa maaradu ayana
రిప్లయితొలగించండిI think it RGV's wish .... he have right to make his own films... we cant restrict and comment abt any ones creativity. If we dont like his film we can say that we dont like the film...i think no one can make a gr8 film... it should happen.
రిప్లయితొలగించండిThere are even worst directed movies which are comming in telugu. y these ppl will not comment those movies and directors. Every one want publicity i think even AVS sir wrote abt RGV because layman is reading.
I appreciate if we right some thing developing.. instead of criticizing a person.
అప్పలరాజు సినిమా బాగానే ఉంది కానీ రొటీన్ సినిమాలు చూసేవాళ్లకి ఆ సినిమా నచ్చదు.
రిప్లయితొలగించండి"Varma gariki konchem thikkundhi kaani dhaniko lekkundhi"
రిప్లయితొలగించండి