7, జులై 2010, బుధవారం

సినిమాను బతికించండి ...!

ఇవ్వాళ మోహన్ బాబు గారు మీడియా ముందు ఫైర్ అయ్యారు . పైరసీ విషయంలో నిర్మాతల మండలి ఏమీ పట్టనట్టు నిర్లక్ష్యం వహిస్తోందనేది ఆయన కోపానికి కారణం . కొన్ని సినిమాలను ఒక విధంగా ... ఇంకొన్ని సినిమాలను మరో విధంగా పక్షపాత దోరణితో  మండలి చూస్తోందనేది  ఆయన ఆరోపణ . తమకలాంటి తేడాలు లేవనీ , అందరూ సమానమేననీ , మండలి సెక్రెటరీ  జవాబు ఇచ్చారు.  మండలి గురించి మోహన్ బాబు గారి ఆరోపణల్లో ఎంతవరకు పస ఉందనేది పక్కన పెడితే  ఆయన ఆవేదనలో అర్ధం ఉంది . కోట్లు కర్చు పెట్టిన ఓ నిర్మాత కడుపుమంట  కనిపిస్తోంది .... వినిపిస్తోంది ....  కొన్ని సినిమాలకు సంబంధించి మాత్రమే మండలి  ఎక్కువగా రియాక్ట్ అవతుందనే విమర్శ బలంగానే ఉంది . దాన్ని పాజిటివ్ గా తీసుకొని అన్ని సినిమాల పట్ల తాము సమదృష్టితోనే వ్యవహరిస్తున్నామన్న  నమ్మకాన్ని మండలి పెంచుకోవాలని నా ఆభిప్రాయం . ఎప్పుడో ఒక సారి హడావిడి చేయడం అప్పటికప్పుడు అందరూ ఓ మీటింగు వేసుకొని వినతి పత్రాన్ని తయారు చేసి ముఖ్య మంత్రి గారికో .. మంత్రి గారికో ఇచ్చేయటం , కఠిన చర్యలు గైకొంటామన్న వాళ్ళ తేలికపాటి హామీతో మనం చంకలు గుద్దేసుకోవటం పరిశ్రమకు మ్యానరిజం గా మారింది .  అయితే దీనిని సమర్ధవంతంగా ఫాలో అప్ చేసే పరిస్థితి ఇండస్ట్రీలో లేదనేది వాస్తవం . ఎవరి సినిమాకు నష్టం జరుగుతుంటే వాళ్ళు మాత్రమే రియక్ట్ అవుతున్నారు తప్పితే మిగతా వాళ్ళందరూ సినిమా చూస్తున్నారు . భారీ చిత్రాలకు నష్టం జరుగుతుంటే మాత్రమే పరిశ్రమలోని  కొంతమంది పెద్దలు ,  కొన్ని సంస్థలు ప్రతిస్పందిస్తున్నాయి . సదరు భారీ నిర్మాతలు కూడా తమ సినిమాలేనప్పుడు ఏమీ పట్టనట్టు ఊరుకుంటున్నారు పక్కవాడు చంకనాకిపోతే మనకేంటిలే అనే ధోరణి పెరిగిపోయింది . ఇవన్నీ పక్కన పెడితే ,  అసలు ఈ పైరసి దరిద్రం నుంచి సినిమాను రక్షించేది ఎలా ...? ఎవరు ..? ఎప్పటికి ...? పైరసీ సీడీ తయారు చేసేవాడు ఎవడయినా వాడు మనిషి కాదు అయితే , చూసేవాళ్ళు మాత్రం మనుషుల్లాగా ... మానవత్వంతో ఆలోచించాలి . ఒక్కొక్క సినిమాకు సంబంధించి ఎన్ని వందల మంది కష్టాన్ని ఈ పైరసీ రాకాసి కబళిస్తోందనేది ... సినిమా మీద ఆధారపడి బతుకుతున్న ఎన్ని లక్షలమంది నోటి దగ్గర అన్నాన్ని ఈ పైరసీ దోచుకుంటొందనేది  పైరసీ సీడీలు చూస్తున్నవారందరూ గమనించాలని నా విన్నపం . పైరసీ సీడీలు చూడటం అంటే కాశీలో గోవును చంపినంత పాపం .
 సినిమాని బతికించండి ...  ధియేటర్లోనే సినిమాను లైవ్లీగా చూడండి ... ఎవడైనా పైరసీ సీడీని తెస్తే చెప్పుతీసుకుని కొట్టండి  .....        

22 కామెంట్‌లు:

 1. నమస్కారం AVS గారు.. మిమ్మల్నిలా బ్లాగు ద్వారా కలవడం సంతోషంగా ఉంది..

  ఆఖరున చక్కగా రాసారు.. నిజమైన మార్పు చూసే వాళ్ళలో రావాలి. ఎప్పుడైతే చూసే వాళ్ళు ఉండరో అప్పుడు పైరసీ అమ్మే వాళ్ళూ కనుమరుగవుతారు..కదా.. నేను ఇదే వాదన ఒకరితో చేసినప్పుడు నాకు విన పడ్డ మాటలిలా ఉన్నాయి..

  "ఈ సినిమాల్లో క్వాలిటీ లేదురా.. వీటికి హాళ్ళ దాకా వెళ్ళడం వేస్టు.." అని ..
  వాళ్ళ మాటల్లో నిజం లేకపోలేదనిపిస్తుంది.. కేవలం కొన్ని సినిమాలే బాగుంటున్నై.. వారి వాదన ప్రకారం.. అన్నీ సినిమాలు బాగుండడం లేదు.. .. మరి అలాంటప్పుడు బాగోని సిమాలకు పైరసీ చూడ్డం ఎందుకు ?

  మరొక నష్టం ఏంటంటే..ఎక్కువమంది ఈ పైరసిలో చూడ్డం మూలాన..సినిమాలు హాళ్ళలో ఎక్కువ కాలం ఆడడం లేదు. అలా వచ్చి.. ఇలా వెళ్లిపోతున్నై..

  అయినా .. సినిమా టికెట్టు రేట్లు తగ్గిస్తే ఎక్కువమంది హాళ్ళ దాకా వస్తారేమో..?

  రిప్లయితొలగించండి
 2. మీరు(మీ సినిమా వాళ్ళూ),
  కధని కాపీ కొట్టోచ్చు, సన్నివేశాల్ని కాపీ కొట్టొచ్చు, సంగీతం కాపీ కొట్టొచ్చు,
  ఒరిజినల్ మక్కీ కి మక్కీ స్ఫూర్తి పొందొచ్చు, ఆ ఉడ్ నుండి, ఈ ఉడ్ నుండి సన్నివేశాల్ని యధాతధంగా లేపెయ్యొచ్చు, నటించే బాబులకి, బేబీలకి ’నల్ల’ ధనం గుమ్మరించొచ్చు, గవర్నమెంటు దగ్గర ప్రజలందరికి చెందిన స్థలాల్ని పరిశ్రమ పేరుతో లాగేయ్యొచ్చు, మళ్ళీ గవర్నమెంటు మనొళ్ళదైతే ఆ స్థలాల్నే అమ్మెయ్యొచ్చు, టాక్స్ ఎగ్గొట్టడానికి ఎన్ని రకాల మార్గాలున్నాయో వెతికి, వేటాడి మరీ ఉపయోగించుకోవచ్చు.
  ముందు మీరు పెట్టే ప్రతిపైసా తెల్లధనం ఐతే, అప్పుడు మాట్లాడదాం పైరసీ గురించి.

  రిప్లయితొలగించండి
 3. excellent vasu................
  AVS ji,vasu comment mee maa office lo display pettandi meeru kooda avedana chendithe.:),,
  mohan babu gari avedana lo pasa undo ledo annaaru ga,,vasu comment lo pasa kasi rendoo unnayi,,
  nenoo artist ne,,meetho act chesina vadine
  telugu lo,,
  i cant reveal,,i'll send my pic if u need avs ji,,
  but be a honest player..
  good luck.

  రిప్లయితొలగించండి
 4. ఇప్పుడు ఎవరైనా ధియేటర్కు కుటుంబంతో వెళితే బొమ్మ కనిపిస్తుంది .. పెళ్ళాం పిల్లల పోరు భరించలేక ... బాసుకు అబద్దాలు చెప్పి బయలు దేరింది మొదలు సినిమా కష్టాలు మొదలవుతాయి . కొత్త సినిమా ఐతే బ్లాక్ . బండి పార్కింగ్కు ఓ పది. పిల్లల గోల భరిచలేక స్నాక్స్ కోసం వెళితే వాడు అమ్మిందే రేటు, పెట్టిందే సరుకు. ఒక్క రోజులోనే వీరిని దోచుకోవలన్నంత ఆసతో యాజమాన్యాలున్నై. ఇన్ని సినీమా కష్టాల మద్య ఎ బాబు ఇగో దెబ్బతినకుండా తీసిన చిత్రరాజం బుర్రను తొలిచేసి సినిమాకు వెళ్ళాలంటేనే భయపడుతున్నారు.

  రిప్లయితొలగించండి
 5. AVS jee
  Being a Cinima Person Iam supporting Mr.Vasus' views. But Mr. Vasu should realise that first we have to clean our house then go and throw something on others. Jesus said it so.

  Goodluck Vasu garu...
  Dont Ever try to help your cause with wrong argument. That spoils the real cause. The point you have raised is genuine and let MR AVS write
  something sincerely about it and srart an agitation on that issue.
  And AVS garu Pease keep writing regularly

  MGK

  రిప్లయితొలగించండి
 6. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 7. నేను వాసు గారితో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఆయన అడిగినవన్నీ నేనూ అడుగుతున్నాను. అసలీ రోజుల్లో మంచి సినిమాలెక్కడొస్తున్నాయండీ....బూతు మాటలు, బూతు పాటలు, complete exposing తప్ప. ఈమధ్య వచ్చిన ఒకే ఒక మంచి మార్పు నేను గమనించిందేమిటంటే సినిమాలలో బూతు హాస్యం బాగానే తగ్గింది. మరియు అడపాదడపా వచ్చే కొన్ని మంచి సినిమాలు తప్ప చెప్పుకోవడానికేముంది తెలుగు సినిమాలలో.

  సంవత్సరానికి ఒకటో రెండో మంచి సినిమాలు తప్పించి ఎక్కడొస్తున్నాయి గొప్ప సినిమాలు? తెలుగు సినిమాలేమిటి ఇలా ఉన్నాయి అని పరభాష ప్రజలు అడుగుతూ ఉంటే మొహం ఎత్తుకోలేకపోతున్నాం. హీరో బట్టి కథ గానీ కథాని హీరోగా చేసిందెవరు? అగాంగ ప్రదర్శన తప్పించి హీరోయిన్ కి విలువిచ్చే కథేది? సినిమాకి సంబంధం లేని హాస్యం,కాపీ కొట్టిన ట్యూన్లు, అర్థపర్థం లేని సాహిత్యం. హావభావాలు లేని సహాయ నటులు. మూస పద్ధతిలో ఉండే విలన్లు...వీటికోసమేనా మీరు పైరసీ అరికట్టమనేది?

  పోనీ ఒకటి అరా మంచి సినిమాలొస్తున్నయనుకుందాం. ఆ సినిమాలకి డబ్బు పెట్టి చూడగలిగే థియేటర్లు ఏవి? చిన్న చిన్న హాల్స్ అన్నీ పోయి మల్టిప్లెక్సులు కట్టి వాటిల్లోనే రిలీజ్ చేస్తున్నారుగా. అంతడబ్బు ఎవరికుంది? ఒక కుటుంబం సినిమా కెళ్ళాలంటే 500 పైచిలుకవుతుంది. అదేమీ చిన్న మొత్తం కాదు.

  దేని కోసం పైరసీ అరికట్టమంటున్నారో చెప్పండి.

  రిప్లయితొలగించండి
 8. నవతరంగం అనే తెలుగు సినిమా ఔత్సాహికుల సైట్‌లో గతంలో దీని గురించి విస్తృతంగా జరిగిన చర్చ చూడండి:http://navatarangam.com/2010/03/piracy/

  రిప్లయితొలగించండి
 9. ప్రేరణ పేరుతో గ్లోరిఫైడ్ కాపీలు కొడితేగానీ తయారుకాని కథలు,సీన్లు, సంభాషణలు, ఫైట్ల మధ్య కాపీరైట్ చట్టాల్ని దర్జాగా ఉల్లంఘిస్తున్న సినీపరిశ్రమ పైరసీ గురించి మాట్లాడితే కొంచెం చిరాగ్గా ఉంటుంది.

  ఒకసారి మీ పరిశ్రమ పెద్దల ఇళ్ళలో తొంగిచూడండి. ప్రతి ఇంట్లోంచీ కనీసం వెయ్యి హాలీవుడ్ పైరస్ DVD లు బయటికి తియ్యచ్చు. ఇలా "ఎదుటి మనిషికీ చెప్పేటందుకె నీతులు ఉన్నాయి" అనుకునే ముందు పరిశ్రమ తమ గురివింద ఛందాన్ని కొంత తెలుసుకుని సంస్కరించుకున్న తరువాత ప్రేక్షకుల్ని అంటే బాగుంటుంది.

  పైరసీ నేరమే దాన్ని నేను సమస్థించడం లేదు. కానీ పరిశ్రమ దివాలా కోరు భావదారిధ్ర్యం ముందు ఈ నేరం నాకు చిన్నగా అనిపించడం ఎవరి బాధ్యతో ఒకసారి ఆలోచించమంటున్నాను. Just think.

  రిప్లయితొలగించండి
 10. - "పైరసీ సీడీలు చూడటం అంటే కాశీలో గోవును చంపినంత పాపం ."

  ఎందుకండీ అంత లావు శాపనార్థాలు? ఈ మధ్య "వేదం" అన్న సినిమా వచ్చింది. నాకున్న చిన్న పరిధిలో తెలిసిన చాలా మంది మిత్రులు (సీడీలలో సినిమాలు చూసి వదిలించుకునే వాళ్ళు) ఈ సినిమాను థియేటర్ కు వెళ్ళి చూడటం నాకు తెలుసు.

  యేడాదికి కనీసం "ఐదు" మరపురాని సినిమాలు తీయండి. కనీసం ప్రయత్నం చేయండి. తక్కువ బడ్జెట్ లో అయినా సరే. ఆ తర్వాత పైరసీ గురించి గుండెల మీద చేతులు వేసుకుని చెప్పండి.

  ఎంచేతో సినిమా ఇండస్ట్రీ వారి ఆలోచన ఆ ఇండస్ట్రీ చుట్టే తిరుగుతుంటుందని నా ఊహ.

  రిప్లయితొలగించండి
 11. its is very interesting to see the way the discussion is going on ... on a given topic... thanks to MR Ravi,for his possitive comments and mr sathya prasad R for his reference... mr chammn for his practical difficulty...THIS IS THE PURPOSE OF A BLOG ( who ever may be the writer) Share your problem and try for a solution.... not throwing garbage on the issue.... this is what the others like vasu, krish and UNLUCKY Krishnasri are trying to do ...lets not cry on on others luck.... and lets not care for the comments diverting the topic and bringing personal issues.....focus on the issue and try to do good...i once again appreciate mr ravi for his excellent response by chiding the writer and at the same time suggesting a SOLUTION.....

  రిప్లయితొలగించండి
 12. MAHESH GARU ENGLISH MOVIES DVD S GURINCHI HOLLYWOOD PRODUCERS EPPUDU PIRACY NI APANDI ANI CHEPPALEDHU MANAM TELUGU CINEMA GURINCHI MATLADADHAM.ADHI KAKUNDA ENGLICH MOVIES DVD S INDIA KI RAAVU ONLINE LO DOWN LOAD CHESTHARU DHANI MEERU NENU EVVARU APALERU.ADHI PIRACY ANI NENU ANUKONU. TELUGU PIRACY NI ARIKATTANDI ANNARANDI MEE BUSINESS NI KADHU HA HA HA TRY TO KILL PIRACY. E BLOG CHADIVE VALLU CHOODADAM APANDI SIR CHALU.

  రిప్లయితొలగించండి
 13. వాసు గారి వాదనతో ఏకీభవిస్తున్నాను.

  ఇంకోటి, పైరసీ చేసే వాళ్ళు చేస్తుంటే దాన్ని ఎలా అడ్డ్కోవాలో సీడీలు బయటికి రాకుండా ఎలా చేయాలో చూడకుండా చూసే వాళ్ళమీద పడటం ఏం న్యాయం! మీరు ఆ సీడీలు రాకుండా చూస్తే వీళ్ళు ఎలా చూస్తారు? పైగా కాశీలో గోవును చంపినంత పాపమని శాపమొకటా చెప్పండి?  అరుంధతి పైరసీ సీడీలు బయటికి రాకుండా శ్యాం ప్రసాద్ ఏం చేశారో కనుక్కోండి.

  రిప్లయితొలగించండి
 14. KADEDEE PIRASE KANARHAM BHARATHADESAMLO.MUNDU SAMAJAM MARALI.MANAAALOCHANA VIDHANALU MARALI.GONGATLO TINTU VENTRUKALUNNAY ANUKOVATAM AVIVEKAM.SAMAJAM MARALANTE MUNDU MANAM MARALI. VYAKTHI NUNDI MARPU PRARAMBAM KAVALI. NENU MARALI ANUKONTU MARPUKU SREEKARAM CHUTTALI.NENAPRAYATNAMLOUNNANU. MEERU SIDHAMENA? H R YERRAMSETTY

  రిప్లయితొలగించండి
 15. i like the free world. instead of complaining about piracy, be happy about the new income channels that opened up because of free information flow. years ago you did not have overseas market, dvd market, satellite rights, music rights etc also release the dvd after 50 days so people dont go for pirated stuff. suresh productions still doesnt release the dvds of its movies. if it were up to you guys you would give internet in quota system . submit a query, we will verify that it is valid and give the result after a week! look at people trying to control stuff! and please stop the crap about tea stalls and rickshaw stands. nobody is doing charity here. why dont u distribute ur property among tea stall owners if you are so worried about them

  రిప్లయితొలగించండి
 16. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 17. AVS ji, well said.

  ఒక్కటే మార్గం. పైరసీని అరికట్టాలంటే ప్రభుత్వం కటినమైన చర్యలు తీసుకోవాలి. నిర్మాతలందరూ ఏకం కావాలి.

  రిప్లయితొలగించండి
 18. అయినా ఆ పైరసీ చేసే వాడెవడో ..మీకు తెలియదా..వాడిని ఎదుర్కొనే దమ్ము మీ ఇండస్త్రీలో ఎవ్వరికీ లేదా..?

  రిప్లయితొలగించండి
 19. ఇది పైరసీ సమస్యో...తెలుగు సినిమా బతుకుపోరాటమోకాదు... నాణ్యత. ఎక్కడైనా ఐఎస్ఐ మార్క్‌ ఉంటేనే కొంటాం...డిమాండ్ చేస్తాం. మరి వందలు ఖర్చుపెట్టి చెత్తిసినిమా చూసినప్పుడు... ఎవరికి చెప్పుకోవాలి? అందుకే పైరసీ. కాదనేది ఎవరు? ఏమంటారు?

  రిప్లయితొలగించండి