18, నవంబర్ 2010, గురువారం

సి.సి.ఎల్..( కాంట్రవర్షియల్ క్రికెట్ లీగ్ ).....!

     ప్రస్తుతం టాలివుడ్ మొత్తం క్రికెట్ కాంట్రవర్సి రాజ్యమేలుతోంది. ఈ అంశంలో కాంట్రవర్సి వుందో లేదో నాకు తెలియదు కాని టీవి చానెళ్ళు మొత్తం దీన్ని భూతద్దంలో చూస్తున్నాయి... చూపిస్తున్నాయి.. ఊపిరాడకుండా ప్రోగ్రాములు ప్రసారం చేస్తున్నాయి.వాస్తవానికి ఇది ఒక ఈవెన్టు మేనేజర్ ' మా ' ( మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ) కు ఇచ్చిన ప్రతిపాదన మాత్రమే., నాకు తెలిసినంతవరకూ ఈ విషయమై ఎటువంటి నిర్ణయం ' మా ' తీసుకోలేదు. ఇది అంత తేలిగ్గా తీసుకునే నిర్ణయం కూడా కాదు. ప్రస్తుత కమిటి అధికారంలో వుండేది రెండేళ్ళు...ఈ క్రికెట్ నిర్ణయం పదేళ్లకు సంబంధించింది....కమిటి ఎలా  నిర్ణయం తీసుకుంటుంది అనేది ప్రశ్న...పైగా ఈ మ్యాచుల్లో ఆడిన ఆర్టిస్టులకు పెద్ద పెద్ద మొత్తాల్లో పారితోషికాలు ఇస్తామంటున్నారు...ఆకర్షవంతమయిన ఆఫర్...' మా ' లో నాకు తెలిసి ఆరువందలమందికి పైన సభ్యులున్నారు. వీళ్ళల్లో పది శాతం అయినా క్రికెట్ ఆడే వాళ్ళుండవచ్చు. అంటే 60 మంది... క్రికెట్ కు కావలసింది పదిహేను మంది. లేదా ఇరవై మంది... మంచి ప్లేయర్ల పరంగా చూస్తే గ్లామర్ ఉండక పోవచ్చు...గ్లామర్ వున్న వాళ్ళు ప్లేయర్లు కాకపోవచ్చు... పైగా ఎంపిక ఎలా అన్నది మిలియన్ డాలర్ ప్రశ్న...గతంలో చాలాసార్లు ఈ ఎంపిక విషయంలో పెద్ద పెద్ద గొడవలు జరిగాయి. ఫ్రీ గా జరిగినప్పుడే అన్నీ గొడవలు జరిగితే ఇంతింత పారితోషికాలు ఇస్తున్నప్పుడు ఇంకెన్ని గొడవలు జరుగుతాయన్నది ఊహకు అందనిది కాదు.... మరో విషయం ఏవిటంటే ప్రతి ఏడాది ' అగ్ర హీరోలు ఆడతారు ' అని ' మా ' కమిట్ అవ్వాలి అన్నది ఒక అగ్రిమెంట్ పాయింట్ అని తెలిసింది. అది నిజమయితే ఏ హీరో పదేళ్ళ పాటు అగ్ర హీరోగా వుంటారు అన్నది ఎవరు చెబుతారు ? లేదా భవిష్యత్తులో రాబోయే...కాబోయే..అగ్ర హీరోలకు సంబంధించి ఇవాళ ఎలా నిర్ణయం గైకొంటారు ? ఈ మ్యాచులను సమన్వయ పరచినందుకు గాను ' మా ' పేద కళాకారుల నిధికి కోటి రూపాయల దాకా ఫండ్ ఇస్తామని ఈవెన్టు వాళ్ళ ప్రతిపాదన అని తెలిసింది. ఇవాళ కోటి రూపాయలు కన్సిడర్ చేయదగ్గ మొత్తమే..కాని రెండేళ్ళ తరువాత...నాలుగేళ్ల తరువాత... పదేళ్లకు...కోటి అంటే ఇవాల్టి పది లక్షలతో సమానం..ఏది ఏమయినా సినిమా వాళ్ళు అప్పుడప్పుడు క్రికెట్ ఆడితే బాగానే వుంటుంది కాని ఏడాదికొకసారి ఏదో తిరునాళ్ళు లాగా ఆడితే గ్లామర్ ఏమీవుండదు.. బోర్ కొడుతుంది...కొరివితో తల గోక్కున్నట్టుగా ఇప్పుడీ క్రికెట్ గోల ' మా ' కు అవసరమా ..?  సినిమా ఆర్టిస్టుగా మాత్రమే కాదు...ఒక జర్నలిస్టుగా కూడా ఇది నా స్పందన...అయినా ' మా ' లో సమర్ధులైన వ్యక్తులున్నారు. అన్నివిధాలా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటారు. ఈ లోపు మీడియా లో ఈ సంబరాలు అవసరం లేదేమో....



 

1 కామెంట్‌:

  1. "...ఈ లోపు మీడియా లో ఈ సంబరాలు అవసరం లేదేమో...." Why they will leave any incident. Media tries to hype anything to fill their 24 hour time. How you can think that media can miss an event related to cinema persons??!!

    రిప్లయితొలగించండి