18, డిసెంబర్ 2010, శనివారం

ఈ బిహేవియర్ కు కారణమెవరు ?



        మొన్నీమధ్యన రామానాయుడు గారికి సినిమా పరిశ్రమ మొత్తం కలిసి చాలా గ్రాండ్ గా సన్మానం చేసింది. ఈ ప్రోగ్రాం మొత్తాన్ని మా టివి వాళ్ళు 
స్పాన్సర్ చేశారు. సినిమాలోని అన్ని శాఖలవారు మనస్ఫూర్తిగా ఈ ప్రోగ్రాం లో పార్టిసిపేట్ చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది నాయుడు గారి సన్మానానికి వచ్చారు. నిర్మాతలు, దర్శకులు, నటినటులు ఆనందంగా ఈ ఫంక్షన్ లో పాలు పంచుకున్నారు. అంతా బానే ఉంది. కాని ఈ ఫంక్షన్లో డాన్సులు చేయటానికి వచ్చిన కొంతమంది హీరోయిన్ల బిహేవియర్ మాత్రం 
దారుణం. విలువలు, గౌరవాల్లాంటివి ఏవీ లేకుండా వాళ్ళు ప్రవర్తించిన   తీరు దుర్మార్గం.... నాయుడు గారు సినిమా పరిశ్రమకు సంబంధించి జాతీయ
సంపద.... కేవలం తెలుగు సినిమాకు మాత్రమే పరిమితం కాదు. 
         ఈ ప్రోగ్రాముకు నేను కొఆర్డినెటర్ గా వున్నాను కాబట్టి కొన్ని విషయాలు నాకు తెలుసు. ఇందులో రహస్యాలు ఏమీ లేవు. ఉండాల్సిన అవసరం కూడా లేదు....టాలివుడ్ లో తప్పితే మిగతా భాషల్లో ఈ సోకాల్డ్ హీరొయిన్లకు ఎంత సీను వుందో మనకు తెలియదు. వాళ్ళ అదృష్టమో ఏమో నాకు తెలియదు గాని వాళ్లిక్కడ కొద్దిపాటి రాజ్యమేలుతున్నారు. ఇక్కడ పెద్ద పెద్ద మొత్తాల్లో పారితోషికాలు తీసుకుంటున్నారు. వీళ్ళను  వాళ్ళ స్వంత భాషల్లో అసలు గుర్తు పట్టరని, అక్కడ వీళ్లకు ఇక్కడున్నంత సీను లేదని నా ఉద్దేశ్యం కాదు. నాయుడు గారి సినిమాల్లో నటించినా నటించకపోయినా
ఆయనకు జరుగుతున్న సన్మానంలో వచ్చి పార్టిసిపేట్ చేయటం సదరు హీరోయిన్ల కనీస బాధ్యత... పరిశ్రమ వీళ్ల చేత ఈ ఫంక్షన్లో  పెర్ఫార్మెన్స్ లు
ఉచితంగా కాకుండా కనీస పారితోషికాలను ఆఫర్ చేసింది. వాస్తవంగా ఇలాంటి గొప్ప అకేషన్ లో పరిశ్రమను స్వంతం చేసుకున్న ఏ హిరోయిన్ అయినా ఆ పారితోషికాన్ని తిరస్కరించి ఉచితంగా పెర్ఫార్మెన్స్ చేసేందుకు ముందుకు రావాలి...లేదా నామినల్ గా అయినా పారితోషికం తిఇసుకోవచ్చు. తప్పు లేదు. కాని కమర్షియల్ ప్రోగ్రాం కంటే ఎక్కువగా రెమ్యునరేషన్ డిమాండ్ చేయటమే కాక మరెన్నో డిమాండ్లు చేయటం బాధ కలిగించే అంశం...మామూలుగా పరిశ్రమ కార్యక్రమం అంటే అందరూ ఉచితంగా పాల్గొనటం ఆనవాయితికి భిన్నంగా పరిశ్రమ ఎంతో కొంత పారితోషికాలను కూడా ఆఫర్ చేస్తే సంతోషించి రావలసింది పోయి ఇలా ప్రవర్తించటం ఎంత వరకు భావ్యం అన్నది ఆ హీరోయిన్లే కొద్దిపాటి సంస్కారంతో ఆలోచించుకోవాలి. మరీ దారుణం ఏవిటంటే ముంబాయి హీరోయిన్లు ఇలా బిహేవ్ చేసారంటే ' సరేలే ' అనుకుని వదిలేయచ్చు. 
అచ్చ తెలుగు, పదహారణాల హీరోయిన్లు కూడా ముంబాయి భామల కంటే దారుణంగా, హీనంగా ప్రవర్తించారంటే అంతకంటే సిగ్గుచేటు ఇంకొకటి వుండదేమో... నాయుడు గారి సినిమాల్లో నటించిన ఒక హిరోయిన్ ' అది వేరు..ఇది వేరు..దేనికి అదే...నాకు ఇంత ఇస్తేనే పెర్ఫార్మెన్స్ చేస్తాను. లేకపొతే చేయను..నాకు ఫోన్ కూడా చేయకండి..' అని చెప్పిందంటే మనం ఎలా ఆలోచించుకోవాలి..ఎంత సిగ్గు పడాలి...?  డబ్బు అడగటం తప్పని నేను అనను.. కొన్ని సందర్భాలలో ఎవరయినా డబ్బుకు అతీతంగా. పరిశ్రమలో భాగస్వాములుగా ఆలోచించి స్పందించాలి. అది బాధ్యత...వాళ్ళు హిరోయిన్లయినా కావచ్చు...హిరోలయినా కావచ్చు...మరెవరయినా కావచ్చు...ఇది ఒకళ్ళు ఒకళ్ళకు చెప్పేది కాదు....ఎవరికి వాళ్ళు సంస్కారంతో ఆలోచించుకోవాలి...ఇది కొంతమందికి చిన్న అంశంగా అనిపించవచ్చు...సిల్లి అంశంగా కూడా అనిపించవచ్చు... కాని నాకు అలా అనిపించలేదు. అందుకే ఇలా స్పందించాను...ఈ అంశంపయిన ఇంకా లోతుగా స్పందించవచ్చు...కాని అనవసరమేమో..ఒక్కటి మాత్రం నిజం..
ఈ సంఘటనను బట్టి ఈ కొద్దిమంది హీరోయిన్లకు వాళ్ళను బతికిస్తున్న 
ఇండస్ట్రి పట్ల వాళ్లకు భయం గాని, భక్తీ గాని, గౌరవం గాని లేవు అన్నది స్పష్టం అవుతోంది...ఆర్టిస్టుల సంఘం కొద్దిమంది విషయంలో తన మేతక వైఖరిని పక్కన పెట్టి, కొంచెం గట్టిగా వ్యవహరిస్తేనే కనీసం భయంతో కూడిన భక్తీ, గౌరవం ఏర్పడతాయేమో అనిపిస్తోంది... మరో విషయం....ఇంత గౌరవం లేని వాళ్ళతో పెర్ఫార్మెన్సులు ఇప్పించకపోతే నష్టం ఏమిటి అనే ప్రశ్న కూడా చాలా మందికి ఉత్పన్నం కావచ్చు....సహజం....కాని ఆ లోతుల్లోకి వెళితే చాలా మేటర్ రాయాల్సి వుంటుంది...ఇంతవరకే స్పందించ దలచుకున్నాను. స్పందించాను..అది కూడా కడుపులో సొద ఆపుకోలేకనే..
ఇలా రియాక్ట్ కాకుండా వుంటే బావుండేదని కొంతమందికి అనిపించవచ్చు..అందుకు నేనేమి చేయలేను. నాక్కూడా సలహా చెప్పే వాళ్ళు లేరు. చెప్పినా ఈ మూర్ఖుడు వినడని వాళ్లకు అనిపించి ఉండచ్చు.






 

4 కామెంట్‌లు:

  1. సన్మానం అంటే స్టేజిమీద పిలిచి గౌరవించుకుని నాలుగు మంచిమాటలు చెప్పి అభిమానాన్నీ అభినందనల్నీ తెలపడం. హీరోయిన్లచేత అర్థనగ్నంగా బట్టలేయించి అటూఇటూ గెంతించడం కాదు. ముందుగా ఆలోచనే తప్పు...ఆ తప్పులో తప్పు జరిగిందని వాపోవడం మరో పెద్దతప్పు.

    రిప్లయితొలగించండి
  2. hahaha...alanti vaallani vadileyyadame best kadandee....talachukunte boldu mandi nijjam kalaakaarulu line lo nilabadataaru ilanti chotla pradarshanalu ivvadaaniki....mee baadha artham chesukotaggade

    రిప్లయితొలగించండి
  3. please watch & subscribe
    http://bookofstaterecords.com/
    for the greatness of telugu people.

    రిప్లయితొలగించండి
  4. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

    రిప్లయితొలగించండి