24, ఆగస్టు 2011, బుధవారం

గ్యాంగ్ లీడర్ రింగ్ లీడర్ అవుతాడా...!!!        ఎట్టకేలకు కాంగ్రెస్ లో ప్రజారాజ్యం విలీనం పూర్తయింది. మెగాస్టార్ భుజాన మూడు రంగుల జెండా పడింది. సాధారణంగా కార్యకర్త కొన్నాళ్ళకు నాయకుడు అవుతాడు.. కాని ఇక్కడ నాయకుడు కార్యకర్తగా మారాడు. తాను ఇకనుంచి కాంగ్రెస్ కార్యకర్తను అని చిరంజీవి ఎటువంటి భేషజం లేకుండా చెప్పారు. ఆయన గట్స్ కు హేట్స్ ఆఫ్. చిరంజీవి రావటం వల్ల   కాంగ్రెస్ పార్టీ  ఎంతగానో బలపడుతుందని భావించే వాళ్ళు ఎంతమంది వున్నారో, ఆయన రాక వల్ల పార్టీలో తామెంత బలహీన పడతామేమోనని భయపడే వాళ్ళు అంతకంటే ఎక్కువ మంది వుంటారు. ఎందుకంటే అది కాంగ్రెస్ పార్టీ.... పోలీసు డిపార్ట్ మెంటు లాంటిది..ఇక్కడ అధికారులు ఎక్కువ, కానిస్టేబుళ్లు తక్కువ...కాంగ్రెస్ లో నాయకులు ఎక్కువ..కార్యకర్తలు తక్కువ. చిరంజీవి చేసింది తప్పా..ఒప్పా..అనే చర్చకు కాలం ముగిసింది..అది పాత  ముచ్చట..తిట్టిన నోటితోనే పొగడాల్సి రావటం చిరంజీవి గారికి ఇబ్బందే..కాని తప్పదు..ఇది రాజకీయం..ఇక్కడ శాశ్వత మిత్రులు వుండరు..శాశ్వత శత్రువులు వుండరు. కాని అధినాయకుడిగా అలవాటుపడిన చిరంజీవి గారికి కాంగ్రెస్ ప్రస్థానం నల్లేరు మీద బండి కాదు... తను నోరు తెరిచిన ప్రతిసారి పార్టిలో కొంతమంది నోరేసుకుపడతారు. కాంగ్రెస్ లో ఫ్రెష్ థాట్స్ తక్కువ...ప్రెస్ మిట్స్  ఎక్కువ...ఇప్పటివరకు మోనార్క్ గా వున్న మెగా స్టార్ ఈ డార్క్ లో
అడ్జస్ట్ కాగలరా ...! ఇప్పటి వరకు వేలు చూపిస్తే శిరసావహించే  క్యాడర్ కు
అలవాటు పడ్డారాయన. కాని వేలు చూపిస్తే చెయ్యి ( హస్తం ) చూపించే పార్టీ లోకి వచ్చిన మన మెగాస్టార్ ఇక్కడ రింగ్ లీడర్ కాగలరా అన్నది ప్రశ్న. కాంగ్రెస్ పార్టీ ఈయనను ప్రేమతో తమ పార్టీ లోకి పిలవలేదు..అవసరం..జగన్ ను ధీటుగా ఎదుర్కొనగల జనాకర్షణ గల నాయకుడు ప్రస్తుతం ఆ పార్టీకి కావాలి..సమయానికి లడ్డులాగా చిరంజీవి దొరికాడు..అలాగే చిరంజీవి గారికి
కూడా ఓ బలమైన జాతీయ పార్టీ అవసరం..రైట్ టైం లో కాంగ్రెస్ కనిపించింది. అవసరం రెండు వైపులా వుంది..అయితే ఎవరు ఎవరిని ఎక్కువగా ఉపయోగించుకుంటారో అన్నది భవిష్యత్ రాష్ట్ర రాజకీయాలు నిర్ణయిస్తాయి.
వేచి చూడటం మినహా మనం చేయగలిగింది ఏమీ లేదు. బోడి గుండంత సుఖం లేదు....వెయిట్ చేసినంత ఉత్తమం లేదు...సుఖ పడుతూ వెయిట్ చేద్దాం....!!!6 కామెంట్‌లు:

 1. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

  రిప్లయితొలగించు
 2. Panchaloodadeese Pavan ekkadellado? Thana pancha voodi poyindi, Papam...

  రిప్లయితొలగించు
 3. వావ్... ఎప్పుడూ చూస్తుంటానుకానీ ఈ సారే పరీక్షగా (ప్రొఫైల్ కూడా) చూశాను మీరు ఏవీయెస్సే!!!!

  ఫ్రెష్ థాట్స్ - ప్రెస్ మీట్స్ బాగా తళుక్కుమంది. చిరంజీవి గురించి నేను 2008లో కాపుకులోధ్ధరణతప్ప ఇంకేమీ జరగదని నా అభిప్రాయం వెలిబుచ్చానండీ. చూడబోతే అదికూడా జరిగినట్లు లేదు. మొన్నొకరోజు ఠాగూర్ సినిమాలో "నాయకుల్ని మోసం చేసిన ప్రజలులేరు, ప్రజల్ని మోసం చేసిన నాయకులే వున్నారు" అన్న డైలాగ్ విని how prophetic!! అనుకున్నాను. :-)

  రిప్లయితొలగించు
 4. velu choopiste cheyyi choopinche vaaru nijam gaane vunnaaru gaanee . . . koncham harsh gaa vundi adi ;)

  రిప్లయితొలగించు
 5. oka velitho point out chesthe avathala ayidu vellatho point out chesenduku siddhamgaa vuntaarani cheppatame naa uddesyam...indulo harsh ane prasakthi raadu.

  రిప్లయితొలగించు