చాలా సినిమాలు విడుదల అవుతుంటాయి..కొన్ని అవి థియేటర్లలో ఆడుతున్నంత కాలం గుర్తుంటాయి...మరి కొన్ని మనం ఉన్నంత కాలం గుర్తుంటాయి..ఇంకొన్ని సినిమా ఉన్నంతకాలం బతికే వుంటాయి. ఆ కోవలోకి వచ్చే సినిమా " జగదేకవీరుని కథ ". నాకు తెలిసి మాయాబజార్ సినిమా తరువాత తెలుగు వాడి గుండెల్లో అజరామరంగా నిలిచిపోయిన చిత్రం జగదేకవీరుని కథ...నందమూరి తారక రామారావు నట విశ్వ రూపానికి నిలువెత్తు నిదర్శనంగా పేర్కొనదగ్గ ఈ చిత్రం అపురూప అభినయాలకు, సాంకేతిక నైపుణ్యానికి, నిర్మాణ విలువలకు తిరుగులేని ఉదాహరణంగా చెప్పుకోవచ్చు. యాభై ఏళ్ళ క్రితం రిలీజైన ఈ సినిమాకు ఇప్పుడు కొత్తగా రంగులద్ది విడుదల చేసే ప్రయత్నం చేస్తున్నారట. సంతోషం..కాని యాభై ఏళ్ళేకాదు మరో వందేళ్ళు పోయినా రంగు చెరగని సినిమా జగదేకవీరుని కథ. ఆ రోజుల్లోనే ఈ సినిమా నిర్మాణానికి 6 లక్షలు బడ్జెట్ అయిందట.అదే ఈ రోజుల్లో అయితే అరవై డెబ్భై కోట్లవుతుంది...ఈ సినిమాలో మిగిలివి అన్ని ఒక ఎత్తయితే ఎన్టిఆర్ నటనా వైదుష్యం ఒక ఎత్తు..ప్రత్యేకించి ఆయన చేసిన అండర్ ప్లే..... ఏ సన్నివేశంలో ఎంత నటించాలి..అన్న ప్రాధమిక అంశం తెలుసుకోవాలనుకునే వారికి ఈ సినిమాలో రామారావు యాక్టింగ్ ఓ పెద్ద బాల శిక్ష..సిలబస్...ఎంతో గ్లామరస్ గా, మ్యాన్లిగా , హిరోయిక్ గా ఎన్టిఆర్ కనిపిస్తారు...ఇంతటి హీరోయిజం వున్న హిరో బహుశా భారత దేశంలోనే లేరు అన్నప్రశంసా వాక్యాలు అప్పట్లో వినిపించాయి కుడా..ఆ సినిమాలో ప్రతిది ఒక ప్రత్యేకతే...హిరో పాత్ర రూపకల్పన, హీరోయిన్ల పరిచయం, విలన్ పాత్ర, రోమాన్స్, కామెడి, యాక్షన్ పార్ట్, త్రిల్ల్స్, గ్రాఫిక్స్, భక్తి, దేవుళ్ళు, ఇలా ఒకటేమిటి...ప్రేక్షకుడికి కావలసిన ప్రతి ఒక్కటి అందంగా అద్భుతంగా కే వి రెడ్డి లాంటి గ్రేట్ టేక్నిశియన్ మలచిన మహాద్భుత సుందర సుమధుర కావ్యం ఈ చిత్రం...ముఖ్యంగా ఘంటసాల గారి సంగీతం..ప్రతి పాట ఒక ఆణిముత్యం.. ప్రతి పాటలోని సాహిత్యం స్వాతి ముత్యం..శివశంకరి పాట సంగిత సాహిత్యాల పరంగానే కాకుండా పెర్ఫార్మెన్స్ పరంగా అల్టిమేట్..భారత దేశంలోని మరే ఇతర హిరోలెవ్వరు చెయ్యలేని విధంగా రామారావు ఈ పాటలో నటించారు.
మార్కస్ బార్ట్లే కెమెరా అనితర సాధ్యం..ఇలా ప్రతి అంశం ఒక హైలైట్ గా రూపొందిన రమణీయ కమనీయ దృశ్య కావ్యం జగదేకవీరుని కథ..అది తెలుగు సినిమా కావటం, ఎన్టిఆర్ తెలుగు హిరో కావటం, మనం తెలుగు
వాళ్ళం కావటం మన పూర్వ జన్మ సుకృతం...
థాంక్స్ ఏవీఎస్
రిప్లయితొలగించండిchalaa bagundandi
రిప్లయితొలగించండి