ఈ ఏడాది తెలుగు సినిమాకు కొంచెం బానే వున్నట్టు అనిపిస్తోంది.
బిజినెస్ మెన్ తో మొదలయిన ఈ ఏడాది తెలుగు సినిమా విజయ ప్రస్తానం
కొనసాగుతోంది. అంటే విడుదల అవుతున్న ప్రతి సినిమా సక్సెస్ అవుతోందని
కాదు గానీ గతంతో పోలిస్తే విజయం శాతం పెరిగింది. చిన్న సినిమాల నిర్మాణ
సంఖ్య పెరిగింది. హీరోలు ఎక్కువ సినిమాలలో నటిస్తున్నారు. ఇదొక సంతోష
కరమైన పరిణామం.... రచ్చ సినిమా కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టిస్తే దమ్ము
సినిమా ఎన్.టి.ఆర్. నటనా పటిమకు నిదర్సనంగా నిలిచింది. ఇక గబ్బర్ సింగ్
సినిమా అయితే అనూహ్య విజయం స్వంతం చేసుకుంది. ఈ విజయం నూటికి
నూరు శాతం పవన్ కళ్యాన్ ఖాతా లోకి చేరుతుందనేది నిర్వివాదాంశం .
అధినాయకుడు సినిమా కూడా మంచి సినిమానే.... కాని కథను డీల్ చేయటంలో
దర్శకుడు ఫెయిల్ అయ్యాడన్న విమర్శలు సర్వత్రా వినిపించాయి. ఫలితంగా
అధినాయకుడు బాలయ్య అభిమానుల్ని నిరాశ పరచింది. ఈ ఏడాది పెద్ద హీరోల
సినిమాలు చాలా రాబోతున్నాయి. అన్నీ ఆశా జనకంగానే వున్నాయి ..ఏ విధంగా
చూసుకున్నా ఈ ఏడాది తెలుగు సినిమా పరిస్థితి బెటర్ గా వుంది..శాడిజం
అనుకోకపోతే ఈ ఏడాది డబ్బింగ్ సినిమాల హవా బాగా తగ్గింది. అన్నీ పరాజయం
పాలవుతున్నాయి. ఇవాళ విడుదల అయిన శకుని సినిమా టాక్ కూడా గొప్పగా
లేదు. కామెడి ఏవిటంటే శకుని సినిమా రిలీజు కాబోతోందని చాలా స్ట్రైట్ సినిమాలు
వాయిదా వేసుకున్నారు మన నిర్మాతలు ....తెలుగు సినిమాకు సంబంధించి ఈ
సక్సెస్ టూర్ కొనసాగుతుందని ఆశిద్దాం...అయితే పైరసీ సి డి లు, థియేటర్లు లాంటి
సమస్యలు పూర్తిగా తొలగిపోతే చిన్న సినిమాలు కూడా బతికి బట్ట కడతాయి. ఆ
దిశలో సినిమా పెద్దలు కృషి చేస్తారని ఆశిద్దాం ......
తెలుగు సినిమా రూటు బావుంది......
మీరు రాసింది పూర్తిగా పూర్తిగా కలెక్షన్ల పరంగా ఉంది. Good-to-all లాగా ఉంది.
రిప్లయితొలగించండిఇప్పుడు మీరు ఆలోచించండి (ఎవ్వరితోనూ మీ అభిప్రాయాన్ని పంచుకోకండి) మీరుదహరించిన సినిమాల్లో ఎన్ని "వాసి"పరంగా మంచివి? ఇందులో ఎన్నిసినిమాల్ని "మాయాబజార్"లాగా యాభైఏళ్ళ తరువాత కూడా celebrateచేసుకుంటారు?
అయ్యా... అంగీకరించండి. సృజనాత్మకత పరంగా తెలుగు సినిమాలు ఎప్పుడో చఛ్ఛాయి (కుంజర:). వీటివల్ల ఆయా నిర్మాతలకేగానీ ఇంకెవ్వరికీ అణాకాణీ లాభంలేదు.
"నిర్మాతలకేగానీ..."ని "డబ్బుపరంగానేకానీ, విలువలపరంగానూ, సృజనాత్మకతపరంగానూ కాద"ని అర్ధం చేసుకోగలరు.
రిప్లయితొలగించండి/ఈ ఏడాది తెలుగు సినిమాకు కొంచెం బానే వున్నట్టు అనిపిస్తోంది./
రిప్లయితొలగించండిఅబద్దాలను ఇంత అందగా కూడా చెప్పొచ్చా! :D