12, ఫిబ్రవరి 2012, ఆదివారం

ఎందుకీ ద్రోహం.....?


              జియ్యర్ స్వామి తిరుపతి దేవస్థానం గురించి చేస్తున్న వ్యాఖ్యలు, సృష్టిస్తున్న వివాదాలు నాకే కాదు...యావత్ హిందువుల మనోభావాలు దెబ్బ తీసేవిధంగా వున్నాయి.. అసలే హైందవ ధార్మిక వ్యవస్థ భవిష్యత్తు అగమ్య గోచరంగాను, ప్రశ్నార్ధకంగాను మారిపోతున్న ప్రస్తుత తరుణంలో జియ్యర్ స్వామి చేస్తున్న పని హిందూ మతానికి ఏవిధమైన మేలు చేయకపోగా మరింత కీడు చేసేదిగా ఉందనటం నిర్వివాదాంశం. పైగా ఆయన తిరుపతి దేవస్థానాన్ని వాటికన్ సిటి తో పోల్చి తక్కువ చేసి మాట్లాడటం, చర్చిలతో పోల్చి దేవాలయాలను పలుచన చేసేలా వ్యాఖ్యలు చేయటం దారుణం. అన్ని మతాలు గొప్పవే.. ఏ మతంలో వుండే గొప్పతనం ఆ మతంలో వుంటుంది..అలాగే హిందూ మతం గొప్పతనం హిందూమతానిదే. పొరుగింటి పుల్లకూర రుచి అన్న చందాన పక్క మతాలను గొప్పవిగా చేస్తూ హిందూ మతాన్ని తక్కువ చేయటం జియ్యర్ స్వామి లాంటి వారికి తగదు. 
తిరుపతి దేవస్థాన నిర్వహణలో ఏమయినా లోపాలు వుంటే వాటిని సరైన రీతిలో సదరు కమిటి కి తెలియపరచ వచ్చు... లేదా ప్రభుత్వం దృష్టికి తేవచ్చు. అలా కాకుండా తిరుపతి దేవస్థానం మీద యుద్ధం ప్రకటించటం, కొండ మీదకు ధర్మ యాత్ర పేరుతో దాడి చేయటం ఏమాత్రం క్షమార్హం కాదు.
పైగా వెంకటేశ్వర స్వామిని వేశ్యతో పోల్చటం, తిరుపతిని క్లబ్ తో సరిపోల్చటం
దారుణం..దుర్మార్గం.. ఈమాత్రం దానికి  శ్రీనివాస హోమాలేందుకు.. భాగవత సప్తాహాలు ఎందుకు...? జియ్యర్ స్వామి ఏదేదో మాట్లాడటం, దానికి ప్రతిగా  మరో  స్వామిజి  ఇంకేదో మాట్లాడటం, ఈ నేపధ్యంలో టివి చానెళ్ళ వాళ్ళు చర్చా వేదికలు పెట్టి నానా యాగి చేయటం...ఏమిటిదంతా...? ఎందుకు ఈ సిద్ధాంత రహిత రాద్ధాంతాలు...?  '' దేవుడా...రక్షించు నా హిందూ ధర్మాన్ని...మత ప్రచారకుల నుంచి...ప్రచార ఆర్భాటకుల నుంచి...."


 


11 కామెంట్‌లు:

  1. నాకు తెలిసి ప్రేతి హిందువు ఆలోచించాల్సిన విషయం ఇది ....... తమ ఉనికి , గొప్ప , దర్పం , చాటటం కోసం భగవంతుడిని కోడ మద్యలోకి లాగి వాడుకునే ఆలోచన సామాన్యులకు రాదు ,దానికి వారికీ ఉన్నంత గొప్ప తెలివి , భాష పరిజ్ఞానం , విద్వత్తు ఉండాలి మరి .... ఎలాంటి వాళ్ళు చేసే పనులకు హిందు ధర్మం పాటించే అందరు సిగ్గుపడే రోజులోచాయ్ ... , కలియుగ ప్రత్యక్ష దైవం అయిన శ్రీ వేంకటేశ్వరుని గని , శ్రీ వారి నివాస మయిని తిరుపతి జోలుగని వచ్చిన వారు పొందిన శిక్ష , గతి , పాపం జీయర్ గారికి గుర్తు లేవేమో ,లేక ... పెద్దలు చెప్పారుగా " వినాశ కలే విపరీత భుద్ధి " అని .... ధర్మో రక్షితి రక్షితః .... వేచి చూడాలి .... దైవ నిర్ణయం ........

    రిప్లయితొలగించండి
  2. మీరన్నది వాస్తవమే గురువుగారు..
    మీ వ్యాసం ఆలోచింపజేసింది..

    రిప్లయితొలగించండి
  3. మీరు ఒకసారి ప్రసంగం పూర్తి పాఠం వినవలిసిందిగా ప్రార్ధన.
    "తిరుపతి దేవస్థాన నిర్వహణలో ఏమయినా లోపాలు వుంటే వాటిని సరైన రీతిలో సదరు కమిటి కి తెలియపరచ వచ్చు... లేదా ప్రభుత్వం దృష్టికి తేవచ్చు."
    ఎన్నో సార్లు చెప్పారండి. మన మీడియా వారు ఎప్పుడు ప్రచారాన్ని ఇవ్వలేదు.
    అప్పుడు అధికారులు, ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలని పాటించకపోవటం వల్లనే ఇప్పుడు ఈ భ్రష్టాచారాలని బయట పెట్టవలసి వచ్చిందని కూడా మొన్న ప్రసంగంలో అన్నారు.
    వెయ్యి కాళ్ళ మండపాన్ని కూల్చిన నాటి నుంచి 7గురు జీయర్ల యాత్ర, శరణాగతి దీక్ష, దేశంలోని ధర్మాచార్యులందరితో (ఉత్తర, దక్షిణ భారతం లోని వారందరు) గోష్టి ఇలా ఎన్నో రకాలుగా అభ్యంతరాలని తెలియజేస్తూనే ఉన్నారు.
    అప్పుడు, ఇప్పుడు సామాన్య భక్తులు తప్ప ఎవరూ ముందుకు రాలేదు. ఒకవేళ భక్తులకి ఇష్టం లేకుంటే ఆయనతో అన్ని వేల మంది కలిసి యాత్ర చేసేవారు కాదు.

    పక్క మతాలని ఎవరూ పొగడలేదు.
    పొరుగింటి పుల్లకూర రుచి. నిజమేనండి. అందుకే ఇది అన్యాయం అని మన ధర్మాన్ని రక్షించడానికి ముందుకు వస్తే విమర్సిస్తారు. అదేంటో వేరే వాళ్ళని మాత్రం సమర్ధిస్తాము. ఇన్నాళ్ళ నుంచి కూడా తిరుపతి లో అక్రమాలు అని పేపర్లో వచ్చినప్పుడు మాత్రం ఆ భగవంతుడు శిక్షిస్తాడులే మనకెందుకు అని ఊరుకున్నాము.
    ఇప్పుడు స్వామి వారు ఎత్తి చూపుతుంటే మాత్రం మనకి తిరుపతి మీద భక్తుల మీద ఎక్కడలేని concern వచ్చాయి.
    ఆ వ్యాఖ్యలు 10 సంవత్సరాల నుంచి ఎదురు చూసిన ఆవేదన నుంచి వచ్చినవే కాని స్వామిని అనాలని కాదు.
    తిరుపతికి వెళ్ళే ఒక సామాన్య భక్తుడిని అడిగి చూడండి ఎన్ని అన్యాయాలు జరుగుతున్నాయో.
    ఇంతకంటే ఏమీ చెప్పలేము.

    రిప్లయితొలగించండి
  4. అన్ని మతాలు గొప్పవి కాదు.. వాటిని పాటించే మనుషులే పెద్ద మనసు చేసుకోవాలి.. మీ లాంటి వారు సడన్ గా వచ్చి మాట్లాడుతుంటే అనుమానించాల్సి ఉంటుంది.. ధైర్యం కల వారైతే ఈ వ్యాఖ్య ప్రచురించండంలో ఆలోచించవద్దు.. గోబెల్స్ ప్రచారం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు.. అలాంటి వారి వల్ల చాప కింద నీరు లా ఇతర మతాలు చేరుతున్నాయి.. ఏం జరగలేదు అని దులిపేసుకునే పరిస్థితి లేదు.. ఆయన మాటల్లో నిజం తెలుస్తుంది.. ఓపిక పట్టండి.. పెద్ద స్థాయి , బాధ్యత కలవారు.. ఊరికే నోరు మెదపరు...

    రిప్లయితొలగించండి
  5. మీరు చెప్పింది చాలా నిజం. ఇద్దరు పీఠాధిపతులు అలా వీధిన పడి కొట్టుకోవడం ఎందుకో చాలా ఇబ్బంది గా ఉంది, వాళ్ళకే మాత్రం సం యమనం లేదు. జియ్యర్ మొన్నటి వరకు శివుడి తిట్టేయడం, ఆ తరువాత వేంకటేశ్వరుడిని వేశ్య తో పోల్చడం ఎంటో ఈ గోల, అసలు సన్యాసి అనే వాడికి ఈ గోలంతా ఎందుకు, ఈ రాజకీయాలు ఎందుకు. ఇలా చెయ్యడం వల్లనే హిందు మతం పరువు పోతోంది

    రిప్లయితొలగించండి
  6. తితి దేవస్థానంలో జరుగున్న తప్పులను ఎత్తిచూపి వాటిని సరిదిద్దాల్సిన బాధ్యత జగద్గురు రామానుజాచార్యుల పరంపరలో వస్తున్న శ్రీశ్రీశ్రీ శ్రీమన్నారాయణ చిన్న జియర్‍ స్వామివారిపైన ఉంది.అందులో భాగంగానే జియ్యర్‍స్వామివారు చాలా సంవత్సరాలుగా తితిదేవస్థానం వారికి అక్కడ జరుగుతున్న లోటుపాట్ల గురించి తెలియజేస్తూనే ఉన్నారు వాటిని సరిదిద్దాల్సిన బాధ్యత తితిదేవస్థానంవారిపై ఉంది.అలాంటి లోపాలు సరిదిద్దబడుతూ ఉంటే ఈ సమస్య రాదుకదా!ఇలా తప్పుల మీద తప్పులు చేస్తూ జియ్యర్ స్వామివారిని రాజకీయాలు చేస్తున్నారనడం భావ్యంకాదు.అయినా ఇప్పుడు ఆ రామానుజ జగద్గురువే వచ్చితప్పులెత్తి చూపినా దాన్ని కూడా రాజకీయమే అనేవాళ్ళకు కొదవేమీ లేదు,వారి మాటను ఆయన కాలంలో మన్నించినట్లు ఇప్పుడు మన్నిస్తారనే నమ్మకమూలేదు.

    రిప్లయితొలగించండి
  7. ఏ దేవాయలంలోనైనా జరిగేది వ్యాపారమే. అది తిరుపతైతే ఏమిటి, శ్రీశైలం అయితే ఏమిటి? చిన్న జీయర్ స్వామి అన్న మాటలు కూడా తప్పు అనుకోను. దీనికి వేరే అర్థాలు తియ్యడం అవసరమా? చిన్న జీయర్ స్వామి ఏమన్నారో యథాతథంగా పేస్ట్ చేస్తున్నాను. "ఒక అనాథ మహిళ నాలుగు రోడ్లు కలిసే చోట్ల ఒంటరిగా నిలబడితే ఆమెని ఏ మగవాడైనా వాడుకోవాలనుకుంటాడు. వాళ్ళు దేవుణ్ణి కూడా అలాగే వాడుకుంటున్నారు" అని. జీయర్ స్వామి చెప్పినది నిజమే కదా. ఇందులో వేరే అర్థమ్ తియ్యడానికి ఏముంది?

    రిప్లయితొలగించండి
  8. ఈ లింక్ చదవండి: https://plus.google.com/111113261980146074416/posts/f8z6N5LyaW7

    రిప్లయితొలగించండి
  9. దేవునికీ, వేశ్యకీ మధ్య పోలిక లేకపోవచ్చు కానీ దేవాలయాలలో వ్యాపారం జరుగుతోంది అనేది నిజమే కదా.

    రిప్లయితొలగించండి
  10. chinna jeeyar swami ramanuja parampara..Tirupathi devudu venkateswara swami ani nirupinchi ee pashandula bari nundi nijanni kapadina bhagavad ramanuja parampara.Aeinake tirupathi gurinchi matlade hakku undi.Tirupathi ni devuni gudi la kakunda vyapara kendram ga chustunnarani aeina avedana.
    AVS NUVVU HINDU MATHAM KOSAM CHESINDEMI LEDU,OKA ACHARYA PARAMPARA 25 YELLA SANYASAASHRAMAM NIRVAHISTUNNA OKA VEDA SHASTRAGNUDINI PRASHNINCHE ANTHA STHAYI NIKU LEDU ANI NA ABHIPRAYAM

    రిప్లయితొలగించండి