5, మార్చి 2011, శనివారం

హవ్వ.....ఎంత తప్పు...?

          నిన్నో మొన్నో ఓ టీవి రిపోర్టర్ మైకు, కెమెరా పట్టుకుని ఏకంగా మా ఇంటికొచ్చేసి ఈ నెల ఎనిమిదో తేదిన ' ఇంటర్నేషనల్ వుమెన్స్ డే '.... ఏదయినా చెప్పండి. అనడిగింది...' ఏం చెప్పమంటారు ?' అని ఎదురడిగా...  .' అదే...మీ ఫీలింగ్ ఏమిటో చెప్పండి...' అన్నదా రిపోర్టర్..నవ్వాలో ఏడవాలో అర్ధం కాలేదు...ఈ దినాల కల్చర్ ఎవడు కనిపెట్టాడో తెలియదు కాని...ఇంతటి భావ దారిద్ర్యమా...అమ్మా నాన్నలకు, పసి పిల్లలకు, దోమలకు, బొద్దిన్కలకు  బావురు పిల్లులకు... అన్నిటికి దినాలేనా...మథర్స్ డే  ఫాదర్స్ డే లు అంటే ...ఏడాది మొత్తం అమ్మా నాన్నల గురించి పట్టించుకోక పోయినా పరవాలేదు...ఆ ఒక్క రోజు వాళ్లకు పూజ చేయండి అనా....అది సరే...ఆకాశంలో సగం అని చెప్పుకుంటున్న ఆడవాళ్ళకు కూడా ఒక రోజా....? స్త్రీ అనే పదంలో అమ్మ వుంది, భార్య వుంది....అక్క చెల్లెళ్ళు వున్నారు...వాళ్లకు ఒక్క రోజేవిటి ?  దాని గురించి ఏమని స్పందించాలి....? పోనీ ఇవేమయినా మన దేశానికీ సంబంధించినవా అంటే అదీ కాదు...పూర్తిగా పాశ్చాత్య సంప్రదాయం....ఆ దేశంలో పుట్టిన వారికి సంబంధించో...అక్కడ జరిగిన సంఘటనలను రిఫరెన్సులుగా పెట్టుకునో  ఈ దినాలను అక్కడి వారు డిసైడ్ చేస్తే వాటిని మనం గుడ్డిగా అనుకరిస్తున్నాం....ఇక్కడ ఎవరిదీ తప్పు అన్న చర్చ లోకి నేను వెళ్ళటంలేదు...ఈ భావదాస్యం ఎందుకన్నదే నా ప్రశ్న...స్త్రీ లేనిదే మనకు జన్మ లేదు...అమ్మ లేదు....మనకు ఆకలయిన సంగతి మనకంటే అమ్మకు ముందు తెలుస్తుంది...బిడ్డలకు సంబంధించి అమ్మ ఒక మెజీషియన్...అలాగే స్త్రీ లేకపోతే రాఖీలు కట్టి ఆత్మీయతను పంచె ఆడబిడ్డలు వుండరు...పొద్దున్న మగాడికంటే ముందు నిద్ర లేచి..అతగాడు పడుకున్న తరువాత నిద్రపోయే భార్య వుండదు....ఇన్నిమాటలు అనవసరం...స్త్రీ లేనిదే పురుషుడు లేడన్నది ఇవాళ నేను కొత్తగా ప్రవచించాల్సిన అవసరం లేదేమో....వాడెవడో...ఏ దేశం వాడో...ఈ దినాలు ఎందుకు ప్రకటించాడో... ఏమీ  తెలియకుండా వేలంవెర్రిగా పాటించేస్తున్నాం....మరి ఆడవాళ్ళకు ఒక దినం ప్రకటించిన వాళ్ళు  అంతర్జాతీయ పురుషుల దినాన్ని ఎందుకు ప్రకటించలేదో నాకు అర్ధం కాదు.....ఒక వేళ అటువంటిది కూడా ఉందేమో నాకు తెలియదు....రఘురాం అనే నా ఫ్రెండ్ వాళ్ళ అమ్మా నాన్నలను ఏడాది మొత్తం వృద్ధాశ్రమంలో వుంచి మథర్స్ డే, ఫాదర్స్  డే  రోజు మాత్రం ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ పాదాలకు పాలాభిషేకం చేస్తుంటాడు...బాగా ఆస్తిపరుడు...
ఈ దినాల సంస్కృతి మన మధ్యన ఉండాల్సిన మానవ సంబంధాలను, ఆత్మియానుబందాలను ఎటు తీసుకుపొతున్నాయి..? అని ప్రశ్నించే వాడూ లేడు...సమాధానం చెప్పే వాడూ లేడు....నేను మరీ ఎక్కువ మాట్లాడితే ఏదో ఒకరోజు ఏవియస్ దినం అని ప్రకటించేస్తారు కూడా.. నా భయం నాది..చివరగా నా సలహా ఒకటే...భారతదేశానికి సంబంధించి పైన చెప్పిన వాటిని పక్కన పెట్టి ....అవినీతికి ఓ దినం....ఫాక్షనిజానికి ఓ దినం....భూ కబ్జాలకు ఓ దినం....యాసిడ్ దాడులకు ఓ దినం....బండులకు, ధర్నాలకు, రాస్తారోకో లకు ఓ దినం....దిష్టిబొమ్మల దహనానికి ఓ దినం పెట్టుకుంటే ఉత్తమం..ఇవి చూసి మిగిలిన దేశాలవాళ్ళు అనుకరిస్తారు...తగులుకుంటే ఈ దౌర్భాగ్యాలన్ని వాళ్లకు తగులుకుంటాయి...లేకపోతే మన దినాలు వాళ్లకు మిగిలిపోతాయి....అప్పుడు ప్రపంచానికి మనం కూడా కొన్ని దినాలు విరాళంగా ఇచ్చిన వాళ్ళం అవుతాము....మనకు దినాల సంస్కృతిని కట్టబెట్టిన వాడికి బుద్ధయినా వస్తుంది....!!!




9 కామెంట్‌లు:

  1. హ హ ...
    "అంతర్జాతీయ పురుషుల దినాన్ని ఎందుకు ప్రకటించలేదో నాకు అర్ధం కాదు.....ఒక వేళ అటువంటిది కూడా ఉందేమో నాకు తెలియదు"
    మన దౌర్భాగ్యం కొద్దీ ఆ ముచ్చటా ఉంది http://en.wikipedia.org/wiki/International_Men's_Day

    కొన్నాళ్ళకి మన దేశం లో రాఖీకి కూడా "సిస్టర్స్ డే " అనుకుంటే గానీ జనాలు తృప్తి పడరేమో:(

    రిప్లయితొలగించండి
  2. ఇంచుమించుగా యిదే విషయం మీద నా గోల కాస్తంత యిక్కడ: http://nachaki.wordpress.com/2010/05/09/mothersday/ (ముఖ్యంగా అక్కడ ఉన్న మొదటి, మూడవ లంకెలు నొక్కితే...)

    రిప్లయితొలగించండి
  3. తప్పయింది. "మూడవ" కాదు "నాలుగవ" లంకె అని ఉండవలసింది.
    **
    ఇంచుమించుగా యిదే విషయం మీద నా గోల కాస్తంత యిక్కడ: http://nachaki.wordpress.com/2010/05/09/mothersday/ (ముఖ్యంగా అక్కడ ఉన్న మొదటి, నాల్గవ లంకెలు నొక్కితే...)

    రిప్లయితొలగించండి
  4. ఏవీయస్ గారూ, మీరు కూడా "క్షీరాభిషేకం" అనకుండా వ్యాకరణరీత్యా తప్పుడు మాటైన "పాలాభిషేకం" అని వ్రాయటమేంటండీ?! :-(

    రిప్లయితొలగించండి
  5. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మొదట కార్మికవర్గ మహిళా దినోత్సవం (proletarian women's day)గా జరుపుకునేవాళ్లు. మగ కార్మికులు కంటే మహిళా కార్మికులే ఎక్కువగా శ్రమ దోపిడీకి గురవుతుంటారు. మహిళా కార్మికులకి వాళ్లకి ఇంటి పనీ, బయట పనీ రెండూ భారంగా ఉంటాయి. పెట్టుబడిదారీ దేశాలలో proletarian women's day నుంచి proletarian అనే పదాన్ని సవరించడం జరిగింది. పేరు మార్చినంతమాత్రాన శ్రమ సంబంధాలు మారవు కదా. మార్క్సిస్ట్ ఫెమినిస్ట్‌లు ఇప్పటికీ proletarian women's dayగానే అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటారు.

    రిప్లయితొలగించండి
  6. తప్పు తప్పు! దినాల సంస్కృతి మన మధ్యన ఉండాల్సిన మానవ సంబంధాలను, ఆత్మియానుబందాలను ఏటూ తీసుకపొవడం లేదు. ఏడాదికి ఒకసారైన తల్లిదండ్రులకి పాలాభిషెకం చేస్తేమంచిదే కదా. మథర్స్ డే ఫాథర్స్ డే లేకపోతే సెలబ్రేషన్స్ ఎలా? ఎడాదికి ఓసారి చెసేయ్ ఫంక్షన్ వాళ్ళు లేనపుడు తలచుకుంటారో లేదో మరి! ప్రాతఃకాలంలో దైవంతొ పాటు తల్లిదండ్రులను కూడా తలచుకుని పూజించాలని మన వాళ్ళకి చాలామందికి తెలియదు.ఏనాడైనా శ్రవణ కుమారుని కధ గానీ,సత్యవంతుని కధ గాని పోనీ రముడి గురించి అయినా పూర్తిగా తెలుసుకుంటెగా?
    రోజూ ఆచరించేవీ, ఏడాదికి ఒకసారి ఆచరించే కర్మల గురించి తెలుస్తుంది.ముందు మనవాళ్ళకి బుద్ది రావాలి.

    రిప్లయితొలగించండి
  7. ee madhya media lo advertisementlalo bharateeyulu lanti vaarae karuvayyaru. oka inti advertisement vuntae danilo oka paschtya pisachi vuntundi. oka cool drink tagaedi kooda mana laaga vundaru. mana dinam kooda pettesinatlu vunnarandi veellu.

    రిప్లయితొలగించండి
  8. సర్ మీ అభిప్రాయం తప్పు, నవంబర్ 19 అంతర్జాతీయ పురుషుల దినొత్సవం గా 1999 నుంచి జరుపుకుంటున్నారు, మన దేశం లో 2007 నుంచి జరుపుకుంటున్నారు,

    రిప్లయితొలగించండి