1, మే 2013, బుధవారం

ఇంత అశ్లీలమా.....?


 
     గత కొంతకాలంగా ఈటీవీ లో జబర్దస్త్ అనే పేరుతో ఒక కామెడి షో వస్తోంది. చూస్తున్నాను.
  కొన్ని జోకులు విన్న తరువాత ఇది ఈ టీ వీ యేనా లేక మరో చానెలా ? అనే సందేహం వచ్చింది.
  నిస్సందేహంగా ఈటీవీ నే .... ఆశ్చర్యం కలిగింది. ఈ చానెల్ లో ఇలాంటి అభ్యంతరకర, అశ్లీలకర
  హాస్యం రావటం నిజంగా షాక్ కు గురి చేసింది. ద్వందార్ధాలు, బూతులతో నిండిపోయిన ఈ
  కార్యక్రమాన్ని చానెల్ యాజమాన్యం ఎలా ప్రసారం చేస్తోంది. ఎంత రేటింగు బావుంటే మాత్రం
  ఇలాంటి బూతును ప్రసారం చేస్తారా ? పైగా ఆ యాంకర్ డ్రెస్సింగ్ చూస్తుంటే కూడా జుగుప్స గా
  ఉంటోంది. తొడల పైదాకా మిడ్డి వేసుకుని కాలు మీద కాలు వేసుకుని కూర్చున్న ఆ అమ్మాయిని
  లో యాంగిల్ కెమెరా తో షూట్ చేయటం..... ఇదసలు రామోజీరావు గారి చానెల్ యేనా అనే
  సందేహం తలెత్తుతోంది. సభ్యతకు, సంస్కారానికి ఈ చానెల్ పెట్టింది పేరు. కుటుంబ సభ్యులందరూ
  ధైర్యంగా చూడగల సినిమాలు, టీవీ కార్యక్రమాలకు ఈ చానెల్ పెట్టింది పేరు. అలాంటిది ఇలాంటి
  కార్యక్రమాలకు ఎలా అనుమతి ఇచ్చారో అర్ధం కాదు. ఇక ముందయినా మంచి ప్రోగ్రాములు ప్రసారం
  చేస్తారని ఆశించటం తప్ప " అలా కాదు...ఇలా ప్రసారం చేయండి " అని ఎవరినీ మనం శాసించలేము
  కదా.....మారతారేమో  చూద్దాం.... లేకపోతే చూడ్డం మానేద్దాం....   

2 కామెంట్‌లు:

  1. ఒక చిన్న విషయాన్ని తీసుకుని కూడా హాస్యాన్ని సృష్టించగల దిట్టలం మనం.అలాంటిది ఈ టీవీ లో వస్తున్న ఈ కార్యక్రమం లో తెచ్చిపెట్టుకున్న హాస్యముఖాలు(డబ్బులిస్తున్నారు కాబట్టి నవ్వాలి)తప్ప ఒక చెత్త నింపి మన ముఖాన పులుముతున్నారు.ఇది రామోజీ వారి చానెల్ విలువను సభ్య సమాజం లో దిగజార్చే కార్యక్రమం."తెలుగు వెలుగు" లో సంపాదకత్వం వక్కానించే రామోజీ వారి చానలేనా ఇది? ఆలోచించండి ఆ ఎపిసోడ్ చేస్తున్న ప్రముఖులారా!!
    రామ్ ద్రోణంరాజు

    రిప్లయితొలగించండి
  2. అవును నిజం చెప్పారు..! ఇది సోని టి.వి. లో వస్తున్నా ఒక కామెడి షో కి పూర్తీ స్తాయి కాపి. కాని అక్కడ ఉన్నంత మంచి స్క్రిప్ట్ లు ఇక్కడ లేకపోవడం పెద్ద మైనస్. అక్కడ కూడా అడల్ట్ జోకులు ఉన్నా, అవి మాత్రమె పూర్తిగా లేవు. ఇక్కడ వాటిని మాత్రమె కాపి చేసి, కామెడి స్థాయి ని బూతు స్తాయికి ప్రతి రోజు లాగే ప్రయత్నం, అందులో మాత్రమె మునిగి తేలడం అస్సలు బాగాలేదు. కామెడి నటులు ఎక్కువగా ఉన్నడి ఇక్కడే అని చెపుతారు. ఎవరికీ వారు మంచి టాలెంట్ ఉన్నవారే.. అయితే అందుకు తగ్గ కథలు, స్కిట్స్, డైలాగ్స్, స్క్ర్పిట్ లు లేకపోవడం చుసిన కామెడి నే చూడాల్సి రావడం, విన్న డైలాగ్స్ నే వినడం, స్కూప్ లతో కాలక్షెపమ్ మన దురద్రుష్టం. మీలాంటి వాళ్ళు ఇందులో మార్పుకి పని గట్టుకొని ప్రయత్నిచాలి...

    రిప్లయితొలగించండి