23, ఏప్రిల్ 2012, సోమవారం

వోటింగ్ అధికారికంగా మొదలయింది....


   నేను ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న క్షణం కళ్ళముందు ఆవిష్కృతం అయింది. నాకు తెలిసి ప్రపంచం లోనే మొదటి పర్యాయంగా చెప్పుకోదగ్గ "బ్లాగు ద్వారా సినిమా అవార్డులు " అనే కాన్సెప్ట్ కు సాకారం లభించింది....ఈ కార్యక్రమం సోమవారం ( 23 - 04 - 2012 ) నాడు అంటే ఈ రోజు ఉదయం లాంచనంగా ప్రారంభమయింది... నా వినతి మేరకు దాసరి నారాయణ రావు గారు, లోక్ సత్తా జయ ప్రకాష్ నారాయణ్ గారు, మురళీమోహన్ గారు, ఎస్వీ కృష్ణారెడ్డి గారు, నిర్మాతల మండలి అధ్యక్షులు బూరుగుపల్లి శివరామ కృష్ణ గారు, దర్శకుల సంఘం అధ్యక్షులు సాగర్ గారు, నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్నకుమార్ గారు లాంటి పెద్దల సమక్షంలో ఈ కాన్సెప్ట్ ప్రారంభమయింది. సినిమాల్లో బ్లాక్ బస్టర్ అనే పదం బాగా పాపులర్....సినిమా సూపర్ హిట్ అయితే ఆ సినిమాకు ఈ బ్లాక్ బస్టర్ పదం ఉపయోగిస్తారు... అది దృష్టిలో పెట్టుకుని ఈ అవార్డులకు బ్లాగ్ బస్టర్ అనే పేరు పెట్టటం జరిగింది...ఈ ఆలోచనను అతిధులందరూ అభినందించటం ఆనందం కలిగించింది. మీడియా వాళ్ళు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.... ఈ కొత్త ప్రయత్నం జయప్రదం కావాలని పెద్దలందరూ అభిలషించారు..ఆశీర్వదించారు....ఇక అధికారికంగా వోటింగు మొదలయింది...పారదర్సకత ఈ కాన్సెప్ట్ ప్రత్యేకత... నిజాయితీగా వ్యుయర్స్ నేరుగా అవార్డు విజేతలను ఎంచుకునే అవకాశం ఈ బ్లాగు ద్వారా అవార్డులు కల్పిస్తున్నాయి...ఎటువంటి అవకతవకలకు అవకాశం లేదు....అసలు ఆ ఆలోచనే లేదు.... కొత్త ఆలోచన నా మైండ్ లో అంకురించింది....దానికి రూపాన్ని కల్పించాను....మొదటి సారి కాబట్టి కొన్ని ఊహించని పొరబాట్లు దొర్లవచ్చు...మీ సూచనలు....సలహాలు కావాలి...ఆశీస్సులు కావాలి...ఆదరణ కావాలి...ఈ విషయంలో తెలుగు మీడియా తన సహకారాన్ని అందించటం ఆనంద దాయకం... వెంటనే 
avsfilm.in కు లాగ్ ఇన్ కండి...సినిమా అవార్డుల్లోకి వెళ్ళండి..మీరు మెచ్చిన ఆర్టిస్టులకు, సాంకేతిక నిపుణులకు వోట్ వేయండి...


 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి