3, అక్టోబర్ 2010, ఆదివారం

రోబో మెషిన్ కాదు ..మెజీషియన్...


       రాత్రి రోబో సినిమా చూశాను. సిల్వర్ స్క్రీన్ మీద శంకర్ సృష్టించిన అద్భుతం. ఒక ప్రాంతీయ భాషా చిత్రం దేశీయ పరిధులు దాటి అంతర్జాతీయ వేదికపై భారతీయ సాంకేతిక మేధో సత్తాను, సంపత్తిని నగారా మోగించి చాటి చెప్పిన చిత్రం రోబో. ఈ సినిమా బడ్జెట్ ఎంతో నాకు తెలియదు. నా ఉద్దేశ్యంలో ఈ సినిమా బడ్జెట్ శంకర్ ప్రతిభ ప్లస్ రజని ఇమేజ్....కధగా రోబోలో ఏమిఉందన్న ప్రశ్నకు సమాధానం నా దగ్గర లేదు. అయితే వెండితెర మీద గతంలో ఎన్నడూ కనివినీ ఎరుగని రీతిలో శంకర్ ఆవిష్కరించిన అత్యద్భుతం రోబో.. ప్రత్యేకించి చివరి ఇరవై నిముషాలు ఊపిరి ఆడని మాట వాస్తవం. శంకర్ లాంటి దర్శకుడు ఉన్నందుకు దక్షిణభారత సినిమా మాత్రమే కాదు...ఇండియన్ సినిమా కూడా గర్వించాలి. వరల్డ్ మొత్తం ఈ సినిమాకు బ్రహ్మరధం పడుతున్నారని వార్తలు వింటున్నాం. ఆనందం...రెండువేల కోట్లతో హాలివుడ్ సినిమాలు తీస్తుంటే ఆ సినిమాతో పోలిస్తే తక్కువ బడ్జెట్తో రోబో సినిమా తీసిన శంకర్ అభినందనీయుడు.
     నాకు రోబో సినిమా చూస్తుంటే నా చిన్నప్పుడు చుసిన విటలాచార్య గారి సినిమాలు గుర్తొచ్చాయి. అందుబాటులో వున్న సాంకేతిక నైపుణ్యాన్ని ఉపయోగించుకుంటూ రోబో లాంటి సినిమా తీసిన శంకర్.. డబ్బింగ్ సినిమాల రేంజ్ ను అనూహ్యంగా పెంచాడు. తెలుగు సినిమా డబ్బింగ్ రేటు డైరెక్ట్ తెలుగు సినిమా బడ్జెట్తో సమానంగా ౩౦ కోట్లు పలికిందంటే మాటలు కాదు. అదీ శంకర్ స్టామినా.  రోబో సినిమాలో లాజిక్కులకు అందని మ్యాజిక్కు ఉంది. మెషిన్ మేషినులా కాకుండా ఒక మాంత్రికుడిలా పని చేస్తుంటే ..అదెలా సాధ్యం అన్న ప్రశ్న మనకు కలిగినా దాని గురించి అస్సలు ఆలోచించం..ఆలోచించే అవకాశం సినిమాలోని స్పీడ్ మనకుఇవ్వదు..చిప్ తోనూ..  రీడింగులతోను పనిచేసే రోబో పాతాళ భైరవి లో మాంత్రికుడి లాగా ప్రవర్తిస్తుంది ఏమిటన్న సందేహం కూడా మనకు కలిగినా దాని గురించి పెద్దగా ఆలోచించం. అదీ శంకర్ గొప్పతనం. సినిమాలో రజనికాంత్ పుణ్యమా అంటూ రోబోకు కలిగిన ఫీలింగులు మనకు కలగటం లేదేమిటన్న ఫీలింగు మనకు కలిగినా పెద్దగా మనం ఫిల్ కాకపొవటం శంకర్ దర్శక నైపుణ్యం. ఏది ఏమయినా ఇంత గొప్ప చిత్రాన్ని భారతీయ సినిమాకు అందించిన గ్రేట్ టేక్నిషియన్ శంకర్ కు సినిమా మాధ్యమం రుణపడి వుంటుంది. కనుచూపు మేరలో మళ్లీ ఇంత గొప్ప సినిమా  వస్తుందా అన్న ప్రశ్న అందరిలోనూ ఉత్పన్నం కావటం సహజం..సందేహం లేదు....రోబో లాంటి మెషిన్ ను సృష్టించిన శంకర్ గొప్ప మెజీషియన్..    
      
    
    

9 కామెంట్‌లు:

  1. నిజమే నండి మనసున్న మరమనిషి నిజం గా అందరు తప్పక చూడవలసిన చిత్రం .
    విట్టాలాచార్య టైం లో యి సాంకేతికత అందుబాటులో వుండి వుంటే కాంతారావు గారు
    పాత కాలం రజని గా వుండే వారేమో?అయితే డానీ విలనిజం చూపకుండానే అర్దాంతరం గా
    చంపేసినట్టు గా వుంది .అలాగే రోబో ప్రేమలో (హీరోయిన్ )ఆఖర్న మార్పు ఎలా వస్తుందో అర్ధం కాదు ?
    రెడ్ చిప్ తీసేస్తే దుష్ట ఆలోచనలే పోవాలి గాని హీరోయిన్ మీద ప్రేమ ఎలా పోతుందో శంకర్ కే తెలియాలి .
    పోనీ భావాలూ లేవా అంటే నీ పిల్లాణ్ణి బాగా చదివిన్చమ్మ అంటూ తన పార్ట్స్ తీసేస్తూ రోబో అంటుంది మరి .

    రిప్లయితొలగించండి
  2. chala baga chepparu movie bugundhi anthe goppa cinema kadhu graphics are awesom last 20 mins movie is good

    రిప్లయితొలగించండి
  3. Every Shankar movie will have some message but in this movie it's not there...
    But we can't implement those things in REAL life.That can happen in REEL life only....
    But here we can say that TECHNOLOGY is used very much...HATS OFF to SHANKAR for this.
    Rajni and Ash looked extra ordinary...
    Praveen G

    రిప్లయితొలగించండి
  4. yes sir shankar has already proved he is an xtraordinary director.... ROBO is wonderful n gr8 movie.meeru chepinattlu naku vitalacharyulu gurnchi telidhu kaani.ippati generation ki shanker is VITTALACHARYA ankuntunanu... wat do u say ........ waiting for more gud movies from shankar.e saari mana chiru tho tisthe bavuntundhi.....any way hatsoff 2 shankar,rajani,aish....!!!!!! by swetharao.....

    రిప్లయితొలగించండి
  5. "@రవిగారు" గారూ,
    మీ ప్రశ్న అర్ధవంతమైనదే. అన్ని సినిమాలలో విలన్లు చివరికి మంచివాళ్ళుగా మారిపోయినట్లు "చిట్టి" కూడ మంచిగా మారిందని ఎందుకు అనుకోకూడదు?

    @Praveen గారూ,
    ఈ సినిమాలో కూడా "మెసేజ్" ఉంది. చివరికి "చిట్టి"ని ఎందుకు dismantle చేసారనుకున్నారు?

    రిప్లయితొలగించండి
  6. sir, well said... ROBO is a wonder on the silver screen. Ever movie lover irrespective of bollywood, tollywood or any other wood should feel proud of the GOLDEN WOOD... vivek

    రిప్లయితొలగించండి
  7. Manam chese oka comment kshanam lo puduthundhi.
    Mari director nd producer nd hero,heroins tech's etc theese cinima ki months , years paduthundi. So valueable comments asisthunnanu.

    రిప్లయితొలగించండి