20, జూన్ 2010, ఆదివారం
ఉయ్యాలా... జంపాల... ఇయ్యాల... నవ్వాల... వేయేల... జంధ్యాల ....
జంధ్యాల గారి వర్ధంతి అని చెప్పి ఏదైనా ఆర్టికల్ రాయచ్చుగా అని ఓ జర్నలిస్ట్ మిత్రుడు అడిగాడు . నాకు నవ్వొచ్చింది> నవ్వెవాళ్ళు ఉన్నంతకాలం నవ్వించేవాళ్ళు ఉన్నంతకాలం సినిమాలో కామెడీ ఊన్నంతకాలం జంధ్యాల మన మధ్యనే వుంటారు . పడి చచ్చేంతగా మనల్ని నవ్వించి తన దారి తను చూసుకొటానికి అంతా ఆయన ఇష్టమేనా ఏంటి ? ఎక్కడికెళతాడాయన ? నవ్వులు మన ముఖాన కొట్టి ఆయన ముఖం చాటేస్తె మనం ఉరుకుంటామా ఏంటి ? నెవర్ . ఒక దశలో కేరాఫ్ అడ్రస్ కూడా లేకుండా విలవిల్లాడుతున్న తెలుగు సినిమా కామెడీకి ఓ అధునాతన భవంతిని కట్టించి ఇచ్చాడు . నవ్వలేని వాళ్ళకు నవ్వులు నేర్పించాడు . నవ్వెవాళ్ళను పగలబడి నవ్వించాడు . గుర్తొచ్చి గుర్తొచ్చి మరీ నవ్వుకునేలా చేశాడు . ఒకటా ... రెండా... ఎన్ని సినిమాలు ... ఎన్ని పాత్రలు ...ఎన్ని రకాల మ్యానరిజమ్స్ ... మరెవరివల్లా కాని పని ... ఇంకెవరూ సాహసించలేని ప్రయత్నం.జంధ్యాల గారిలో డైరెక్టర్ కంటే రైటర్ గొప్పవాడు ... రైటర్ కంటే డైరెక్టర్ తెలివైనవాడు. జంధ్యాల గారి స్మైల్ చాలా బాగుంటుంది . ఆయన సిగిరెట్ కాలుస్తుంటే నేనూ అలవాటు చేసుకుందామా అని చాలా సార్లు టెంప్ట్ అయ్యాను .అంత స్టైలిష్ గా ఉంటుంది. ఆయన వాయిస్ మైండ్ బ్లోయింగ్ . ఆ కంఠం ఆయనకు భగవదత్తం . నాకు తెలిసినంతవరకూ జంధ్యాల గారు తీసినన్ని కామెడీ సినిమాలు ఆయన సౄష్టించినన్ని పాత్రలు , మరెవరూ చేయలేదేమో . ఒక సభలో జంధ్యాల గారి ఇంటి అడ్రస్ చెప్పమని నన్నడిగారు . చెప్పాను . శ్రీ జంధ్యాల ., హాస్యనివాస్ .., నవ్వులోరివీధి .., హ్యూమర్ కాలనీ స్మైల్ పేట ., ఆనందపురం పోస్ట్ ., కామెడీ మండలం ., మందహాసం జిల్లా ., ఆరోగ్యప్రదేశ్..,..,..,
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఇప్పుడే నేనూ మా ఫ్రెండు వివాహ భోజనం సినిమా గురించి, అందులో సుత్తి వీరభద్రరావుగారు కామెడీ గురించి మట్లాడుకుంటున్నామండీ. ఇంత్లో మీ పోస్ట్ చూసాను. మీరన్నట్టు అయన మనల్ని విడిచి ఎక్కడికెళ్ళారండి. మన నవ్వుల్లో ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. ఈరోజుకి వివాహభోజనంబు గురించి తలుచుకుని పడీ పడీ నవ్వుతున్నామంటే ఆయనకి ఆయనే సాటి. బై ద వే నా బ్లాగు పేరు "వివాహభోజనంబు" :)
రిప్లయితొలగించండిమీరు బ్లాగు పెట్టడం చాలా బాగుందండీ. మాకు ఇంకా ఎక్కువ నవ్వులు పంచుతారని ఆశిస్తున్నాం.
జంధ్యాల గారి వర్ధంతి అని కూడా చూడకుండా నవ్వుల పందిట్లోనే ఊరేగేస్తున్నాం -- ఆయన మనల్ని వదిలిపోయే ప్రసక్తి ఎక్కడండీ! అందుకే వర్ధంతికి మరో పేరు వెతకండి. ఏ వీ ఎస్ గారూ అభివందనాలు!
రిప్లయితొలగించండిరాజా.