20, జూన్ 2010, ఆదివారం

ఈ కష్టం ఎవరికీ రాకూడదు ....

నిన్న సాయంత్రం నాలుగ్గంటల ప్రాంతంలొ రజోలునుంచి మురళీమొహన్ గారు నాకు ఫోన్ చేసి చెప్పారు. చెప్పలేనంతగా షాక్ అయ్యాను. కోటగారికి ఈ వయసులో ఈ కష్టం రావటం నిజంగా బాధాకరం . నాకుతెలిసి కోటగారు ఎవరికీ చెడు చేసిన మనిషి కాదు. నచ్చకపోతే ఎలా మోసేస్తారో ఇష్టపడితే అలానే ప్రేమిస్తారు. దేవుడూ ..పూజలూ.. భక్తి వున్న మనిషి. మరి ఆయనకు ఇలా జరగటమేవిటి ? ఇలాంటప్పుడే భగవంతుడు ఎందుకిలా శాడిస్టులా ప్రవర్తిస్తాడు అనిపిస్తుంటుంది . దుర్మార్గం.. దారుణం.. ఇలా జరక్కూడదు. బెంగుళూరునుంచి నేరుగా ఆసుపత్రికి వచ్చిన కొటగారి బరస్ట్ అయిన ద్రుశ్యం చూస్తే ఎవరికయినా ఏడుపు రాకమానదు. చెట్టంతకొడుకు కళ్ళముందే రాలిపోతే ఏ తండ్రికయినా తట్టుకోవటం మామూలు విషయం కాదు. అలాగే కళ్ళముందే భర్త కన్ను మూయటం చూసిన ప్రసాద్ భార్య పరిస్థితి మరీ దయనీయం. ఈ మధ్యనే షూటింగుపరంగా నెనూ ప్రసాద్ బ్యంకాక్ లో పదిహేనురోజులు కలిసివున్నాం . మంచి వ్యక్తి, సంస్కారం తెలిసినవాడు . ఇంతటి బాధాకరమయిన వాతావరణంలో ఒక మీడియా మిత్రుడు కోటగారి దగ్గరకొచ్చి " మీ అబ్బాయి చనిపోయాడుకదా . మీరెలా ఫీలవుతున్నారు ? అని అడగటం సిగ్గేసింది . నేనూ జర్నలిస్టునే. వార్తలు సేకరించటంలో భిన్నంగా. వేగంగా వుండాలేగానీ ఇలా కాదేమో. ఇవన్నీ పక్కన పెడితే కోటగారు సాధ్యమయినంత తొందరగా ఈ బాధ నుంచి కోలుకోవాలనీ అందరమూ కోరుకోవాలి.

8 వ్యాఖ్యలు:

 1. Father's day na oka father ki ilanti kashtam ravadam baadhaakaram. Kota garu thondaraga therukovalani korukuntunnanu..

  ప్రత్యుత్తరంతొలగించు
 2. కొడుకు చనిపోతే తండ్రి ఎలా "ఫీల్"అవుతాడో ఊహించుకోలేక, వార్తా సేకరణ కోసం పడి చస్తున్న జర్నలిస్టుల్ని ఏం చెయ్యాలో చెప్పండి ఏవీ ఎస్ గారూ, మీరూ జర్నలిస్టేగా?

  కోట గారికొచ్చిన కష్టం ఇంకెవ్వరికీ రాకూడదు. ఆయన పుత్రశోకం టీవీ లో చూస్తుంటేనే గుండె ద్రవించిపోయింది.

  ప్రసాద్ నటన సిద్ధంలో చాలా అనుభవజ్ఞుడిలా కోల్డ్ బ్లడెడ్ పాత్రలో చాలా బావుంది.

  మంచి భవిష్యత్తు ఉంది అనుకున్నాం ఆ సినిమా చూసి!
  ఇంతలోనే ఇలా! కోట ఎప్పటికి కోలుకుంటారో పాపం!

  ప్రత్యుత్తరంతొలగించు
 3. Kota Garu vaari kutumbam ee gayam nundi kolukovalani aa bhagavanthudu aayanaku mariyu kutumbaniki tagu balam chekoorchalani prardisthunna

  Kota Prasad Amar hein :(

  ప్రత్యుత్తరంతొలగించు
 4. aa Journalist ni aa prasna adagamana vadini kooda chachettu kottali, kottaka ela feel avuthunnaro adagali,

  maro lady journalist fathers day nadu ivvakoodani gift ichadu andhi,


  Avs garu ila pravarthinche vallani emi cheyyalema asalu vellu manushulena? vellaki kutumbam, naithika viluvalu, manushula patla maryada telsa? edho chillara kosam ila ishtam vachinattu vaagi manushula manasulu gayaparusthunnaru, vellaki tagina budhi cheppandi sir industry nundi, sick souls

  ప్రత్యుత్తరంతొలగించు
 5. asalu media antene rotaputtinchestunnaru ee kalam lo,, vallu kota garini odarchakapoina parledu kani ayana gayam meeda karam matram baga challutu valla asalu rupam choopistunnaru---abdul vijayawada

  ప్రత్యుత్తరంతొలగించు
 6. కోట శ్రీనివాసరావుగారికి వారి కుటుంబ సభ్యులకి, భగవంతుడు ఈ కష్టాన్ని తట్టుకునే శక్తినివ్వాలని ప్రార్ధిస్తున్నాను.

  మీడియా వాళ్ళకి బుధ్ధిలేదని వాళ్ళ ప్రశ్నలతో మరొకసారి నిరూపించుకున్నారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. చెట్టంత కొడుకిని పోగొట్టుకున్న తండ్రిని
  తన ప్రశ్నతో బాధ పెట్టానన్నఇంగిత జ్ఞానం లేదతనికి ..
  srichaman

  ప్రత్యుత్తరంతొలగించు
 8. an incident that no one should even think.... very unfortunate to sri kota garu... lets pray god that he should be given the courage and strength to over come this calamity.....

  ప్రత్యుత్తరంతొలగించు