21, జూన్ 2010, సోమవారం
దేవుణ్ణి కాపాడుకుందాం రండి.....!
తిరుపతి కొండమీద రోజుకొకటి గా జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే బాలాజీ మీద జాలేస్తుంది . అందరి కోర్కెలూ తీర్చే ఏడుకొండల వాడికి ఈ దయనీయమైన పరిస్థితి ఏమిటనే బాధకలుగుతోంది . భక్తులకు కల్పతరువుగా భాసిల్లే ఆ దేవదేవుడు పాలకులకు కామధేనువుగా మారాడు . నోరుతెరిచి అడగలేని దేవుడి సొమ్మును నోరారా ఆరగిస్తున్నారు . అవినీతి ... అపవిత్రం ... అరాచకం ... ఆశ్రితపక్షపాతం... అధికార దుర్వినియోగం .. లాంటివాటితో ఏడుకొండలు ఎరుపెక్కుతున్నాయి . కొండలు కదలవు కాబట్టి సరిపోయింది కానీ... లేకపోతే మన పెద్దలు వాటినికూడా లారిల్లోకి ఎక్కించి తరలించేవాళ్ళు. ..ఎంత నిస్సిగ్గుగా దోచుకుంటున్నారు..! ఆధ్యాత్మిక భావనతో , హైందవ ధార్మిక విశ్వాసాలతో ఎంత దారుణంగా ఆడుకుంటున్నారు . అసలు దేవుడిమీదే నమ్మకం లేని వాళ్ళని పాలకులుగా ప్రభుత్వం ఎలా నియమిస్తుంది ?అన్ని అకృత్యాలు జరుగుతున్నా...ఇంత దోపిడీ జరిగిపోతున్నా... భక్తుల మనోభావాలు ఇంతలా దెబ్బతింటున్నా ... సర్కారు దున్నపోతుమీద వర్షం పడ్డట్టు చలనం లేకుండా ఎందుకు ఊరుకుంటోంది...? అంబానీలూ... విజయ మాల్యాలూ...ఆదికేశవులు నాయుడు గారికి ఆబ్లిగేషన్ కావచ్చేమోగానీ గర్భగుడిలో ఉన్న ఆ ఆది కేశవుడికి కాదుగదా . స్వామివారి పేరుపెట్టుకున్నందుకైనా ఆయన మీద చైర్మెన్ గారు జాలి చూపించవచ్చుగదా . ఎంతటి పావన క్షేత్రం...ఎంత పుణ్య స్థలం.. కోట్లాది భక్తుల కొంగు బంగారం ... కొంత మంది పాలిట లంకెల బిందెలుగా మారిపొయాడు . ఉద్యోగుల్లో భయం లేదు..పాలకుల్లో చిత్తశుద్ధి లేదు ...అర్చకుల్లో ఐక్యత లేదు ... ప్రసాదాల్లో నాణ్యత లేదు... భక్తుల్లో భద్రతా భావం లేదు ... కొండమీది అరాచకాలు చూస్తున్న ప్రతి భక్తుడి గుండె రగిలిపోతుంది. ఈ భగవదపచారాలకు అడ్డుకట్టవేయాలి . అవినీతి పరులను జైల్లో తోసి కఠినంగా శిక్షించాలి. ఇప్పటికైనా ప్రభుత్వ పాలకులు తమ చిత్తశుద్ధితో ఏడుకొండలకు సంప్రోక్షణ చేయాలి. పాలక వ్యవస్థతోపాటు కొండ మీది అన్ని శాఖలనూ ప్రక్షాళన చేయాలి. లేకపోతే కొద్ది రోజుల్లోనే వేంకటేశ్వర స్వామిని కింగ్ ఫిషర్ విమానాల్లోకీ... రిలయన్స్ కౌంటర్లలోకీ... తరలించేస్తారు . హిందూ మతం కాబట్టి సరిపోయిందికానీ ఇదే మరో మతం లో జరిగితే... రెండు ప్రపంచ యుద్ధాలు జరిగి ఉండేవి .
సేవ్ బాలాజీ ... సేవ్ హిందూయిజం ... ప్రపంచ బాలాజీ భక్తులారా ఎకం కండి
ధర్మో రక్షతి రక్షితః .... ప్రస్తుతం దైవో రక్షతి రక్షితః ....
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
చిత్తూరు జిల్లా వాసిగా , ఆ యేడుకొండల వాడిని కొలిచిన దాన్నిగా మనస్పూర్తిగా మీతో ఏకిభవిస్తున్నాను. ..ఒక్కసారి కన్నులు తెరిచిచూదు ప్రభూ నీ కు ఎన్ని నిజాలు చెబుతున్నారో ...ఒక్కసారి విను దేవా..ఎంతవినిపిస్తుందో....ఎంత రాసినా మనగోడు పట్టించుకొనేదెవ్వడు????
రిప్లయితొలగించండిLAKSHMI RAGHAVA
lkamakoti.blogspot.com
దేవుడికి దగ్గరగా ఉండే వారికి ఆ దేవుడు ఏమీ చేయడనే విషయం బాగా తెలుసు.అందుకే ఇన్ని స్కాములూ, ఇంత బరితెగించిన తనం.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
రిప్లయితొలగించండిఇది Avs గారి బ్లాగు కాదు అని నా అనుమానం.మీరేమంటారు?
రిప్లయితొలగించండిదేవుణ్ణి కాపాడుకుందాం రండి.....! అన్నారు...బ్లాగు పేరేమో ఉత్తినే...అని ఉంది...కనుక ఈ విషయాలన్నీ సరదాగా వ్రాస్తున్నారని నేననుకోవచ్చా...!? దీనికి మీరు బదులిస్తే నాకు అదో తుత్తి!
రిప్లయితొలగించండిమీ అనుమానం నిజమే అని నాకు కూడా డౌట్ వస్తోంది. సినిమా నటులు సొంత డొమెయిన్ లో బ్లాగ్ పెట్టుకుంటారు. హిందీ సినిమా నటులు, ప్రొడ్యూసర్ల బ్లాగ్ లు కొన్ని చదివాను.
రిప్లయితొలగించండిprathiroju editorial laga pratyekaamsyam focus chesthu vrayatum abhinandaneeyam.blog ilage konasaginchalani na abhilasha. thirupathi vishayam meetho ekeybhavisthunnanu.
రిప్లయితొలగించండినిజం చెప్పమంటారా. తిరుమల గురించి వార్తలు వినాలంటేనే అసహ్యం వేస్తుంది. అంతే కాదు ఎంతో బాధ అనిపిస్తుంది. అందరివాడైన ఆ కలియుగ దేవుడిని కొంధరివాడిని చేస్తున్న తి తి దే అధికారులమీద..బోర్డు సభ్యుల మీద అనంతమైన కోపం వస్తుంది.. అనంత స్వర్ణమయం పేరుతో...విరాళాల పేరుతో ఆ స్వామి ని పారిశ్రామికవేత్తలకు, రాజకీయ నాయకులకు, సినిమా వాళ్ళకు తాకట్టు పెట్టిన ఆదికేశవులు లాంటి వాళ్ళను ఇంకా భరిస్తున్నందుకు ఆ స్వామి మీద కోపం వస్తుంది. ఏమి? స్వర్ణమయం అయిన గోడలు లేకపోతే స్వామి మహిమ తగ్గిపోతుందా? ప్రతి వీధి లో పెద్ద పెద్ద టీవీ లు లేకపోతే తిరుమల కు భక్తులు రారా? హే వెంకటనాధ.. నీ పేరు మీద వ్యాపారం చేసుకుంటూ నీ నిలయాన్ని అక్రమాలకూ నెలవు చేసిన ఈ అక్రమార్కులనుండి నిన్ను,మమ్మల్ని నీవే రక్షించాలి స్వామి.
రిప్లయితొలగించండిthe things happening in TIRUMAL are not new... only thing is the volume increased... looting of devotees is always there in TIRUMALA... now unfortunately it has become open.... when we get difficulties we go to TIRUMALA...where will GOD VENKATESWARA go ?
రిప్లయితొలగించండిits a fact that if we want to write on LORD BALAJI.... we need tons of papers.....even that is not sufficient.... unfortunately the present situation is that the frauds at tirumala need tons of papers.... vivek
రిప్లయితొలగించండిపాపం పండాలి కదా.
రిప్లయితొలగించండిThe TTD officers are becoming dogmatic....and more important is....an accused has been given VIP darshan recently.....
రిప్లయితొలగించండిI think this should be taken to higher level.......lets make a move and get united to save our god......
ఓ సారి ఓ భక్తుడికి ఆ వెంకన్న ప్రత్యక్షమైనప్పుడు ఆ భక్తుడు వెలిబుచ్చిన సందేహం
రిప్లయితొలగించండి"ఓ వెంకన్నా నీ చుట్టూ ఇంత అవినీతి చేస్తూ నిన్నే మోసం చెసున్న అవినీతి పరుల్ని శిక్షించి ఇక్కడి నుండి పారద్రోలచ్చు కదా??? "
అప్పుడు వెంకన్న"భక్తా వీళ్లందరూ తప్పు చేస్తున్న సంగతి నాకెప్పటినుండో తెలుసు.
అలా అని వీళ్లందర్నీ శిక్షించి ఇక్కడి నుండి తరిమేస్తే మొత్తం దెశాన్నే దోచేస్తారు నాయనా అందుకే వాళ్లందర్ని నేనే నా వద్దకు పిలిపించుకుని నా భక్తుల సొమ్ముని కాజేసేట్టుగా చేసి వాళ్లని ఇక్కడే కట్టడి చెశా" అని శెలవిచ్చారు.
"ఏడుకొండల వాడా... వేంకట రమణా గోవిందా గోవిందా!!!"
oka saari swamivaariki vasanthisthavam jaruguthondi.....swami vaari abishekam ayina tharuvatha anthamandi bhakthula madhyana swami vari edurugaaa alamkaram chesina pasupu andariki panchi mohamaatam lekanda donga chatuga money vasuulu chesthunnna t t d sebbandi,,,
రిప్లయితొలగించండిanulo archakaswamulu kuuda undatam bhadakaramina vishyam,,,