మురళీమోహన్ గారి పుట్టిన రోజు సెలిబ్రేషన్ అయినప్పటి నుంచి నా బ్లాగ్ లో ఆయన గురించి రాద్దామని ప్రయత్నిస్తున్నా, కోతిమూక సినిమా ఫినిషింగ్ లో ఉండటం వల్ల కుదర్లేదు . ఇవ్వాల్టికి వీలుపడింది మంచి విషయం చెప్పుకోవడానికి ఆలస్యం అనే అంశం పరిగణలోకి రాదు.
మురళీమోహన్ గారిని చూస్తుంటే ఆనందం...ఈర్ష్య ...ప్రేరణ...కలుగుతాయి . ఆయన 72లోకి ఏంటరయ్యారు . ఆయన్ను చూసినవాళ్ళెవరయినా ఆయన వయస్సు 72 అంటే నమ్మరు .ఒక మంచి మనిషి ఈ వయస్సులోకూడా ఇంత ఆరోగ్యంగా ... ఉత్సాహంగా .. ఉన్నారంటే అదో ఆనందం. ఆయనకంటే ఇరవై యెళ్ళు పైగా చిన్నవాళ్ళమైన నా లాంటి వాళ్ళకంటే ఆయన హుషారుగా ఉన్నారన్న ఈర్ష్య .మానసిక యవ్వనానికి వయసుతో సంబంధం లేదనేందుకు ఉదాహరణగా కనిపించే ఆయన అందరికీ ఓ ప్రేరణ . ఆయన ఎంత మంచి వాడో అంత నిర్మొహమాటి . ఏ విషయమైనా సరే కుండబద్దలు కొట్టేస్తారు .ఎవరు ఏ అకేషన్ కు పిలిచినా ఓపిగ్గా వెళతారు . నిర్మాత గానో , నటుడి గానో , రియల్ ఎస్టేట్ వ్యాపారి గానో , ఆయన సాధించిన విజయాలు అందరికీ తెలుసు , కానీ ఓ విద్యా దాతగా ఆయన సేవలు అజరామరం . ఈ రోజున షుమారు వెయ్యి మంది పేద విద్యార్దులు ఆయన డబ్బు తో మెడిసిన్ , ఇంజినీరింగ్ చదువుతున్నరంటే మన గుండె తడవక మానదు . వాళ్ళల్లో షుమారు 120మంది పైగా గత రెండు మాసాల కాలంలో ఉన్నత ఉద్యోగాలు సంపాదించారంటే అది మురళీమోహన్ గారి గొప్పతనం . వాళ్ళ ఆశీర్వచనం చాలు మురళీమోహన్ గారికి వెయ్యేళ్ళ ఆయుష్షు . అలాగే మూవీ అర్టిస్టు ల సంఘానికి ఆయన సారధ్యం ఆదర్శప్రాయం. సమస్యలను ఆయన పరిష్కరించే తీరు, మా కార్య కలాపాల ఉధౄతికి ఆయన పాలనా దక్షతా అందరూ అనుసరించదగ్గవి . మురళీమోహన్.... ఒక గొప్ప మానవతా వాది . కన్నీళ్ళు ఇంకిపోని మనిషి... కన్నీటి విలువ తెలిసిన మనిషి . నాకు జరిగిన ఆపరేషన్ సమయం లో ఆయన ఒక అన్న కంటే ఎక్కువగా నిలబడి నన్ను ఆదుకున్నారు . ఇవ్వళ ఇలా కూర్చొని బ్లాగు రాస్తున్నా ,మరేం చేస్తున్నా ఆ పుణ్యం అంతా మా అమ్మాయి తరువాత , మురళీమోహన్ గారిదే . ఆయన పట్ల అభిమానం ఉన్న వాళ్ళందరూ ఏకగ్రీవంగా కోరుకునే కోర్కె ఒక్కటే " మురళీమోహన్ బావుండాలి " అని . అఫ్ కోర్స్ మంచివాళ్ళందరూ బావుంటారు ..... మురళీమోహన్ లాంటి అతి మంచి మనిషి మరీ బావుంటాడు . అందుకే అందరం మంచిగా ఉందాం . అప్పుడే అందరూ బవుంటాం . ..... మంచో జనా సుఖినో భవంతు .....
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమురళీమోహన్ గారికి జన్మదిన సుభాకాంక్షలు!
రిప్లయితొలగించండిఆయన మంచితనం గురించి చాలా సార్లు విని ఉన్నాను. మంచి వారికి ఎప్పుడు మంచే జరగాలి అని ఆ భగవంతుడు ని కోరుకుంటున్నాను.
నేను కూడా మురళీమోహన్ గారు చదివించే 1000 మంది స్టూడెంట్స్ లో ఒకడిని.మురళీమోహన్ నాకు ఒక మంచి జీవితాన్నిఇచ్చాడు.మురళీమోహన్ గారు మాకు దేవుడు లాంటి వారు.
రిప్లయితొలగించండి1)మురళీమోహన్ గారు 1000 స్టూడెంట్స్ ను తమ సొంత బిడ్డల్లా గా ఆదరిస్తాడు.
2)Marks రాకపోతే ఒక తండ్రి గా దండిస్తాడు.
3)మంచి గురువు లాగా Discipline నీర్పుతాడు.
మా తల్లితండ్రులు,బందువులు కుడా ఇంత శ్రద్ద తీసుకోరు మాపైన.
నేను ఒకసారి మురళీమోహన్ గారిని అడిగాను , Sir మాకు మీరు ఇంత చేస్తున్నారు మేము మీ ఋణం ఎలా తీర్చుకోవాలి.అప్పుడు మురళీమోహన్ గారు చెప్పారు " మీరూ కూడా జీవితంలో స్తిరపడిన తరువాత మీలాంటి వారికి కనీసం ముగ్గురికి HELP చేయమని.
అప్పుడు అనుకున్నాను "బతికితే మురళీమోహన్ లా బతకాలి ...... ".
Dasaratha
Muralimohan Student | Software Engineer | Bangalore
sir i my your real fan please email to me sandya.mahe@gmail.com plz sir
రిప్లయితొలగించండిSir,
రిప్లయితొలగించండిYou are right. He is really a great man I too agree with your opinion, but is not possible and not so easy to be like him or to live him.
Parody Guruswamy
A well disciplined humanist. Simple people look simple but their personality makes the difference.
రిప్లయితొలగించండి