30, జూన్ 2010, బుధవారం

టెన్షన్ ను ... ధైర్యంగా ఎంజాయ్ చేస్తున్నా.....

                                  నేను సినిమా ఆర్టిస్టునవ్వడానికి  మా అమ్మా నాన్నా ఇచ్చిన జన్మా , బాపూ రమణ గారి  ( వాళ్ళిద్దరూ ఏకవచనం  ) పుణ్యం , నా భార్యా పిల్లల అదృష్టం వెరసి నా పూర్వ జన్మ సుకృతం .  ఇవన్నీ కారణాలని నా ఆభిప్రాయం . జర్నలిస్టుగా కళ్ళతో నా బాధను  దిగమింగుతూ కలంతో జనం కష్టాల్ని రాసేవాణ్ణి . ఆ స్థితి నుంచి  సినిమా యాక్టరునయి 18 యేళ్ళ కాలంలో  ఓ 450 సినిమాలదాకా నటించాను . ఇండస్ట్రీలో  అందరితోనూ మంచి గా ఉండాలని ప్రయత్నిస్తానే గానీ , అందుకోసం ఏనాడూ నా  వ్యక్తిత్వాన్ని చంపుకోలేదు ... చంపుకోను ... ఎవరైనా ఎదైనా పని అడిగితే చేతనైతే చేయడం నా అలవాటు .ఒప్పుకున్న పని సిన్సియర్ గా చేయటం నా వ్యసనం . సినిమా తప్ప నాకు వేరే వ్యాపకాలు లేవూ... తెలియవు ... ఎక్కువ బిజీ గా ఉండటంలో నేను రిలాక్స్ అవుతాను . ఏ చెడు అలవాట్లూ లేని నాకు లివర్ ప్రాబ్లం ఎందుకు వచ్చిందో నాతో పాటు అందరికీ అర్ధం కాని ప్రశ్న . దుకాణం కట్టేయాల్సిన నేను మా ఆమ్మాయి పుణ్యమా అంటూ మళ్ళీ పుట్టాను . ఏదో కారణం ఉండబట్టే భగవంతుడు మళ్ళీ జన్మనిచ్చాడనిపిస్తుంది . డైరెక్షన్ చేయడం నా జీవితాశయం కాదు . అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ప్రయత్నమే నన్ను దర్శకుణ్ణి చేసింది .
                                                 జులై 16 న  రిలీజ్ కాబోయే " కోతిమూక " సినిమా దర్శకుడిగా నాకు నాలుగో సినిమా . ముందు నేను డైరెక్ట్ చేసిన   " సూపర్ హీరోస్ "   " ఓరి నీ ప్రేమ బంగారం కానూ..." " రూమ్మేట్స్ "సినిమాలు దర్శకుడిగా నాకు పేరు తెచ్చాయేగానీ నిర్మాతలకు డబ్బులు తెచ్చిపెట్టలేదు , కారణాలనేకం . కమర్షియల్ సక్సెస్ తీయాలన్న
 కసితో ...ఆశతో ... ఆశయంతో...  చేసిన ప్రాజెక్టు  కోతిమూక . నిర్మాత జగదీష్ మంచివాడు ... గట్టివాడు ... ఆయనలో కొన్ని పద్ధతులు నాకు బాగా ఇష్టం . సర్వ శక్తులూ సమకూర్చుకొని నిజాయితీగా చిత్తశుద్ధితో చేసిన ప్రయత్నం కోతిమూక . సినిమా ఆసాంతం అందరూ ఎంజాయ్ చేస్తారు . క్లైమాక్సు లో మాత్రం కొంతమంది ఉలిక్కి పడతారు .అంత ఉలిక్కిపడే ఏ అంశాన్ని  నేను టచ్ చేశానో సినిమాలో తెలుస్తుంది . కోతిమూకలో మేమందరం నమ్ముకున్న ఓ ఎపిసోడు ప్రేక్షకులకు నచ్చిందంటే  సినిమా మంచి విజయాన్ని సాధిస్తుంది . సినిమా రిలీజ్ డేటు దగ్గర పడుతున్న కొద్దీ పైకి ధైర్యం గా కనిపిస్తున్నా లోపల ఏదో టెన్షన్ . ఆడియన్స్ ఏ జడ్జిమెంటు ఇస్తారోనన్న ఉత్కంఠ . నాతో పాటు పని చేసిన వాళ్ళూ , సినిమా పోస్టు ప్రొడక్షన్లో చూసినవాళ్ళూ ... చాలాబాగుందీ అంటున్నా నేను మాత్రం సైలేంటు గా టెన్షన్ ని  ఎంజాయ్ చేస్తున్నాను . ఇంకో పదహారు రోజులు సినిమా హిట్టయితే నిజంగా ఆరోజు నాకు పదహార్రోజుల పండుగ . ప్రస్తుతం కోతిమూక అంశాలు పబ్లిసిటీ ... ధియేటర్లూ ... ప్రమోషన్ ... అన్నీ జరుగుతున్నాయ్ . ఈ శుక్రవారం కానీ , సోమవారం కానీ సెన్సారు . మా హీరో కృష్ణుడు  యాక్టు చేసీన " పప్పూ " సినిమాకు పాజిటివ్ రెస్పాన్సు క్యారీ అవ్వడం కోతిమూకకు ప్లస్సు . కోతిమూకను జనం ఏం చేస్తారో  ... జనాన్ని ఈ కోతులు ఏం చేస్తాయో ... మరో స్వీట్ 16 డేస్ లో  తెలిసిపోతుంది . ఏది ఏమైనా నా ప్రయత్నం నేను చేశా . రిజల్టు ప్రేక్షకుల ఇష్టం... నా అదృష్టం ...

8 కామెంట్‌లు:

  1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  2. మీ తినిమా ఘన విజయం తాధించి మీకు తుత్తిని కలుగజేయాలని కోరుతూ.. మాస్తారూ.. ఒక్క సారి కృష్ణాత్తమి అంతే ఏంతో చెప్పి మా కళ్ళు తెరిపించండి..!

    రిప్లయితొలగించండి
  3. MEE ADRUSTAM PANDI MOODU PUVVULU AARUKAYALU GA VARDHILLALANI MA AAKANKSHA. ME SREYOBHILASHI H R YERRAM SRTTY.

    రిప్లయితొలగించండి
  4. మీరు కామెడి సినిమాలు బాగా తీస్తారు కాని, యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు అంతకన్నా బాగా తీయగలరు అని నాకు నమ్మకం. ఇది నాకు మీ "ఓరి నీ ప్రేమ బంగారం కాను" అనే సినీమా చూసిన తర్వాత కలిగిన అభిప్రాయం. అందులో మీరు ఇచ్చిన ట్విస్ట్ అద్భుతం. మీరు గమనించారో లేదో కాని నేను మాత్రం గమనిస్తున్నాను, మీ సినిమాల్లో అన్ని బాగానే ఉంటాయి. కాని బ్లాక్ బస్టర్ ఇవ్వలేక పోతున్నారు.(మీరు హర్ట్ అయితే సారి అండీ...). ఖచ్చితంగా "యాక్షన్ బేస్డ్" పిక్చర్ తీయండి. మీ పేరు సినీ ఇండస్ట్రీ చరిత్ర లో కామెడి యాక్టర్ గా కాకుండా "ది బెస్ట్ డైరెక్టర్" గా నిలిచి పోతుంది.

    రిప్లయితొలగించండి
  5. అంత పెద్ద ఆపరేషన్ జరిగిన తరువాత సినిమాలలో నటించడమే కాకుండా దర్శకత్వం కూడా చేస్తున్నారంటే, మీ పట్టుదల, ఓపికని ఎవరైనా ఆదర్శంగా తీసుకోవచ్చు. మీ చిత్రం విజయం సాధించాలని ఆశిస్తున్నాను.

    మరో మాట, మీ ఫాంట్, బాక్ గ్రౌండ్ చాలా ఇబ్బందిగా ఉన్నాయి. మార్చండి.

    రిప్లయితొలగించండి
  6. i wish you all the best sir..... as pointed out by our friend above please change the background which is effecting our EYES.....also the background music ...go for soothing music the present music is irritating....

    రిప్లయితొలగించండి
  7. Best Wishes, Sir.

    btw, i thought 'uncle' was also your work.

    imho, stop trying a satish kaushik or dasari in your moviees. they irritate by walking into the scenes abruptly, with no value add to the end product. my 2 cents.

    రిప్లయితొలగించండి