8, ఏప్రిల్ 2012, ఆదివారం

చిన్న సినిమా జిందాబాద్....



     ఎన్నయినా చెప్పండి.... చిన్న సినిమా  చిన్న సినిమానే.... సినిమా విడుదల అయేంత వరకే చిన్న సినిమానా లేక పెద్ద సినిమానా అన్న ప్రసక్తి.... బడ్జెట్ పరంగా మాత్రమే చిన్నా పెద్దా అన్న కొలమానం.... సినిమా హిట్ అయింతరువాత చిన్న సినిమానే పెద్ద సినిమా..... నలభై కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసి హిట్ కొట్టి
నలభై అయిదు కోట్లు ఆదాయం సంపాదించే సినిమా పెద్దదా..... లేక రెండు మూడు
కోట్లు వ్యయం చేసి హిట్ కొట్టి పదికోట్లు సంపాదించే సినిమా పెద్దదా.... అన్నది మన ఆలోచనకు అందనిది ఏమీ కాదు.... విభిన్నంగా సినిమా తీస్తే ఎప్పుడూ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారనేందుకు  గతంలో ఎన్నొ ఉదాహరణలు వున్నాయి... ఇప్పుడూ వున్నాయి.... ఇటీవల విడుదల అయిన " ఈ రోజుల్లో " సినిమా ప్రత్యక్ష తార్కాణం. కేవలం నలభై లక్షలతో సినిమా థీసి పెద్ద హిట్ కొట్టేశారు ఆ సినిమా యూనిట్...పెద్ద హీరోలు గానీ పెద్ద సాంకెతిక నిపుణులు గానీ లేరు... దాదాపు అందరూ కొత్త వాళ్ళే.... కథా పరంగా సింపుల్ పాయింటు.... జనానికి ఎలా చెప్పాలో అలా చెప్పారు....అంతే.... ఇవాళ ఆ సినిమా ఎంత  కలెక్ట్ చేస్తుందో అనూహ్యం.... అదీ చిన్న సినిమా శక్తి.... సరైన ప్లానింగు , కథ ఎంపిక, చిత్రీకరణ లాంటివి పక్కాగా చూసుకుని వళ్ళు దగ్గర పెట్టుకుని సినిమా తీస్తే ఈ రోజుల్లో లాంటి సినిమాలు వస్తుంటాయి..... ప్రస్తుతం చిన్న సినిమా కున్న అడ్డంకులూ, అవరోధాలు కనుక తొలగిపోతే భవిష్యత్తులో అన్నీ " ఈ రోజుల్లో " సినిమాలే....  







1 కామెంట్‌:

  1. మీరు చెప్పింది నూటికి నూరు శాతం నిజం. ఈనాడు తెలుగు సినిమా రూపురేఖలు మారిపోయి, తెలుగు చలన చిత్రరంగం పతనం వైపు పయనిస్తున్న సమయంలో 'ఈ రోజుల్లో' అనే చిన్న సినిమా పెద్ద విజయం సాధించి, తెలుగు చలనచిత్ర రంగానికి ఊపిరి పోసింది. ఇప్పటికయినా దర్శక నిర్మాతలు మేలుకొని కోట్ల రూపాయలను హీరోలకు పారితోషికంగా ఇవ్వడం కంటే ఆ పారితోషికంతో నాలుగు
    మంచి చిన్న సినిమాలను నిర్మించి, తెలుగు చిత్రరంగానికి పూర్వపు వైభవాన్ని తీసుకు రావాలి.

    రిప్లయితొలగించండి