27, మార్చి 2012, మంగళవారం

అవార్డులను ఎంపిక చేయండి.....!


   బ్లాగు ద్వారా అవార్డులు అన్న నా కాన్సెప్ట్ కు వ్యూయర్స్ నుంచి వచ్చిన స్పందన ఆనందంగా వుంది. ఒక కొత్త ఆలోచనకు లభించిన ప్రోత్సాహం ఉత్సాహకరంగా వుంది... నిష్పాక్ష పాతంగా నిజాయితీగా వ్యూయర్స్ అభిప్రాయాలకనుగుణంగా ఈ అవార్డుల ఎంపిక జరపాలన్నది నా ఉద్దేశ్యం.. సినిమా రంగంలో కాస్తో కూస్తో బిజీగానే వున్నా నాలాంటి ఆర్టిస్టు ఇలా సినిమా అవార్డులు నిర్వహించటం పట్ల కొంతమంది ఆశ్చర్య పోవచ్చు..కొంతమంది నొచ్చుకోవచ్చు .. ' వీడికెందుకు  చెప్పండి ' అనే భావాన్ని కూడా వ్యక్తం చేయచ్చు.. కాని ఒక కొత్త ఆలోచన ....కొత్త కాన్సెప్టు ఆరంభించాలంటే కొన్నిటిని ఫేస్ చేయక తప్పదు.... ఈ కాన్సేప్టులో దశల      వారీగా నేను చేద్దామనుకున్న ప్రక్రియను మీ ముందు ఉంచుతున్నాను.. ఒక్కసారి చదవండి....

   ముందు 2011 లో విడుదల అయిన సినిమాల జాబితాను మీ ముందు ఉంచుతున్నాను... అన్ని సినిమాలు అవార్డులకు అర్హం కావు... అవార్డు అర్హతలు వున్న సినిమాలు, క్యాటగిరీలు  కొన్నేవుంటాయి .... వాటినే మనం ఎంపిక చేయాల్సి వుంటుంది.... నేను సినిమాల జాబితాలు ఇచ్చిన తరువాత ఏయే క్యాటగిరిలలో అవార్డులు ఇవ్వదలచుకున్నామో ఆ  జాబితాకూడా  ఇస్తాను... చూడండి.... కొన్ని క్యాటగిరిలలో కొన్ని పేర్లు మీకు తెలిసి ఉండక పోవచ్చు....అలాంటప్పుడు మీరు చేయవలసిందల్లా ఒక్కటే....ఫలానా సినిమాలో ఫలానా పాత్ర...ఫలానా పాట....ఫలానా పాట రచయిత అని కూడా రాయవచ్చు... దానిని మేము కన్వర్ట్ చేసుకుంటాము....ముందు సినిమాల జాబితా చూడండి...మెంటల్ గా అవార్డులు ఎవరికి ఇవ్వాలా  అన్నది ముందు నిర్ణయించుకోండి....ఒక వేళ  మీకు ఈ విధంగా అవార్డులు ఇవ్వటం టెక్నికల్ గా కమాండ్ దొరకక పోతే avsfilm@gmail.com అనే నా ఇ మెయిల్ ఐ డి కి మీ అభిప్రాయాన్ని పంపండి....వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటాము ...జాబితా చూడండి....క్యాటగిరీలు చూడండి.... నిర్ణయం  తీసుకోండి... ఒక కొత్త సాంప్రదాయానికి నాంది  పలికేందుకు మీరు కూడా సహకరించండి...ఈ బ్లాగు ద్వారా అవార్డులు అన్న కాన్సెప్ట్ ను మీ మిత్రులకు సన్నిహితులకు బంధువులకు  కుడా తెలిపి సాధ్యమైనంత ఎక్కువ మంది ఈ అవార్డుల ఎంపికలో భాగస్వాములు అయ్యేలా చూడండి....


2011 లో విడుదల అయిన తెలుగు స్ట్రయిట్ సినిమాల జాబితా.....

 01 . ఇలా చూడు ఒకసారి                  59 . కీ
 02 . గ్రాడ్యుయేట్                               60 . కోడిపుంజు
 03 . అయ్యప్ప సాక్షి                           61. అమాయకుడు
 04 . పరమ వీరచక్ర                            62 . కిల్లర్ 
 05 . మిరపకాయ్                               63 . కిరీటం
 06 . స్పందన                                    64 . సంచలనం
 07 . అనగనగా ఒక ధీరుడు                 65 . దడ
 08 . గోల్కొండ  హైస్కూల్                   66 . కందిరీగ
 09 . అలా మొదలైంది...                     67 . ముగ్గురు
 10 . వాంటెడ్                                     68 . కెరటం 
 11 . వారెవ్వా                                     69 . మనీ మనీ మోర్ మనీ
 12 . లిటిల్ బుద్దా                                70 . దగ్గరగా దూరంగా
 13 . జై బోలో తెలంగాణా                      71 . పరవశమై
 14 . గగనం                                        72 . మిస్టర్ రాస్కెల్
 15 . వస్తాడు నా రాజు                          73 . నాకూ  ఓ లవరుంది
 16 . కధ, స్క్రీన్ ప్లే, దర్సకత్వం అప్పలరాజు           74 . తాతా మనవడు
 17 . ఎల్. బి. డబ్ల్యు .                           75 . ఆకాశమే హద్దు
 18 . కుదిరితే కప్పు కాఫీ                        76 . ఝలక్
 19 . ప్రేమ కావాలి...                             77 . మాతృ దేవోభవ
 20 . భలే మొగుడు ..భలే పెళ్ళాం          78 . నేను నాన్న అబద్ధం       
 21 . మంగళ                                       79 . ఏమైంది నాలో
 22 . అహ నా పెళ్ళంట..                        80 . పోరు తెలంగాణా
 23 . తిమ్మరాజు                                   81 . వరప్రసాద్ పొట్టి ప్రసాద్
 24 . నిత్య పెళ్లి కొడుకు                          82 . తొలిసారిగా
 25 . నిశ్శబ్ద విప్లవం                              83 . దూకుడు
 26 . దొంగల ముఠా                               84 . క్రికెట్ గర్ల్స్ అండ్ బీర్
 27 . రాజ్                                             85 . వంకాయ్ ఫ్రై
 28 . ప్రేమలేఖ రాశా.                              86 . మడత కాజా
 29 . కారాలు మిరియాలు                       87 . సంక్రాంతి అల్లుడు 
 30 . చట్టం                                            88 . థ్రిల్లింగ్
 31 . గంగ పుత్రులు                                89 . ఊసరవెల్లి
 32 . శక్తి                                                90 . తెలుగమ్మాయి
 33 . మంచివాడు                                   91 . పిల్ల జమిందార్ 
 34 . లోకమే కొత్తగా                                92 . జయమ్ము నిశ్చయమ్మురా
 35 . తీన్ మార్                                      93 . గందరగోళం
 36 . మిస్టర్ పర్ఫెక్ట్                                 94 . పాపి
 37 . గల్లీ కుర్రాళ్ళు                                  95 . నువ్విలా
 38 . బి 4 మ్యారేజ్                                  96 . మొగుడు
 39 . నేను నా రాక్షసి                              97 . పిల్ల దొరికితే పెళ్లి
 40 . నిన్ను చేరాలని...                           98 . ఓ మై ఫ్రెండ్
 41 . గీతాకృష్ణ కాఫీబార్                          99 . ఇట్స్ మై లవ్ స్టోరి
 42 . పాయిజన్                                   100 . శ్రీ రామ రాజ్యం  
 43 . 100 % లవ్                                 101 . వీడు తేడా 
 44 . సీమ టపాకాయ్                           102 . సోలో 
 45 . వీర                                             103 . షిర్డీ జై సాయిరాం 
 46 . వైకుంఠ పాళీ                                104 . బెజవాడ
 47 . దుశ్శాసన                                   105 . ప్రియుడు
 48 . బబ్లూ                                          106 . పంజా
 49 . చందమామ కథ                           107 . దునియా
 50 . మారో                                          108 . రాజన్న 
 51 . బద్రినాథ్                                      109 . రాజేంద్ర
 52 . సైతాన్                                         110 . ఉసురు
 53 . నగరం నిద్ర పోతున్న వేళ               111 . క్షేత్రం
 54 . 180                                             112 . వనకన్య వండర్ వీరుడు
 55 . విరోధి                                           113 . ప్రయోగం
 56 . బ్రమ్మిగాడి కథ                              114 . ఇంకెన్నాళ్ళు
 57 . జాతర 

     ఈ జాబితా నాకు లభించిన సమాచారాన్ని బట్టి పొందుపరచింది. ఏమయినా లోపాలు వున్నాయేమో నాకు తెలియదు... ఒక వేళ ఎవరయినా అలాంటి లోపాలను గమనిస్తే నాకు తెలియచేస్తే పొరబాటు సరిదిద్దుకుంటాను. 

ఇక క్యాటగిరీల  విషయానికొస్తే పది క్యాటగిరీలలో అవార్డులు ఇద్దామని నేను 
సంకల్పించాను... కొన్ని ముఖ్యమైన శాఖలకు మాత్రమే ఈ ఏడాది ఈ అవార్డులను ప్రకటించి అన్ని బావుంటే వచ్చే ఏడాది మరిన్ని శాఖలకు విస్తరింప చేయాలని ఆలోచన....

క్యాటగిరీలు.....

01 . ఉత్తమ చిత్రం
02 . ఉత్తమ దర్శకుడు 
03 . ఉత్తమ నటుడు 
04 . ఉత్తమ నటి 
05 . ఉత్తమ గేయ రచయిత  
06 . ఉత్తమ మాటల  రచయిత  
07 . ఉత్తమ హాస్య నటుడు 
08 . ఉత్తమ గాయకుడు 
09 . ఉత్తమ గాయని 
10 . ఉత్తమ ఛాయాగ్రాహకుడు

  ఈ క్యాట గిరీలలో మీరు వోటు  చేయండి. మీ పరిధిలో మీరు ఈ కాన్సేప్టును
ప్రచారం  చేయవలసిందిగా మరోసారి విన్నవిస్తున్నాను.....  



  

     
 
 

        
 

14 కామెంట్‌లు:

  1. 01 . ఉత్తమ చిత్రం --- గోల్కొండ హైస్కూల్
    02 . ఉత్తమ దర్శకుడు --- శ్రీ రామ రాజ్యం
    03 . ఉత్తమ నటుడు --- దూకుడు
    04 . ఉత్తమ నటి --- అలా మొదలైంది...
    05 . ఉత్తమ గేయ రచయిత --- రాజన్న
    06 . ఉత్తమ మాటల రచయిత --- దూకుడు
    07 . ఉత్తమ హాస్య నటుడు --- దూకుడు( M S నారాయణ)
    08 . ఉత్తమ గాయకుడు --- తీన్ మార్( గెలుపు తలుపులే తీసె ఆకాశమే)
    09 . ఉత్తమ గాయని --- మిస్టర్ పర్ఫెక్ట్ (చలి చలిగా అల్లింది)
    10 . ఉత్తమ ఛాయాగ్రాహకుడు --- శ్రీ రామ రాజ్యం

    రిప్లయితొలగించండి
  2. 01 . ఉత్తమ చిత్రం - శ్రీ రామ రాజ్యం
    02 . ఉత్తమ దర్శకుడు -శ్రీ రామ రాజ్యం
    03 . ఉత్తమ నటుడు - నాని - అలా మొదలైంది...
    04 . ఉత్తమ నటి - శ్రీ రామ రాజ్యం
    05 . ఉత్తమ గేయ రచయిత -శ్రీ రామ రాజ్యం
    06 . ఉత్తమ మాటల రచయిత - అలా మొదలైంది...
    07 . ఉత్తమ హాస్య నటుడు -దూకుడు( M S నారాయణ)
    08 . ఉత్తమ గాయకుడు - రాజన్న - రేవంత్
    09 . ఉత్తమ గాయని -అమ్మా అవనీ
    10 . ఉత్తమ ఛాయాగ్రాహకుడు - నువ్విలా

    రిప్లయితొలగించండి
  3. 09 . ఉత్తమ గాయని -అమ్మా అవనీ - రాజన్న

    రిప్లయితొలగించండి
  4. 01. ఉత్తమ చిత్రం - శ్రీ రామ రాజ్యం
    02 . ఉత్తమ దర్శకుడు -శ్రీ రామ రాజ్యం
    03 . ఉత్తమ నటుడు - బాలకృష్ణ -శ్రీ రామ రాజ్యం
    04 . ఉత్తమ నటి -నయనతార- శ్రీ రామ రాజ్యం
    05 . ఉత్తమ గేయ రచయిత -శ్రీ రామ రాజ్యం

    రిప్లయితొలగించండి
  5. 01 . ఉత్తమ చిత్రం - శ్రీ రామ రాజ్యం,విరోధి,ఎల్.బి.డబ్ల్యు.
    02 . ఉత్తమ దర్శకుడు - శ్రీ రామ రాజ్యం
    03 . ఉత్తమ నటుడు - నాని-అలామొదలైంది.
    04 . ఉత్తమ నటి - అలామొదలైంది...
    05 . ఉత్తమ గేయ రచయిత - శ్రీరామరాజ్యం
    06 . ఉత్తమ మాటల రచయిత - దూకుడు
    07 . ఉత్తమ హాస్య నటుడు - m.s
    08 . ఉత్తమ గాయకుడు - రేవంత్
    09 . ఉత్తమ గాయని -అలామొదలైంది(nitya)
    10 . ఉత్తమ ఛాయాగ్రాహకుడు- శ్రీరామరాజ్యం

    రిప్లయితొలగించండి
  6. 01 . ఉత్తమ చిత్రం - శ్రీ రామ రాజ్యం
    02 . ఉత్తమ దర్శకుడు - శ్రీ రామ రాజ్యం
    03 . ఉత్తమ నటుడు - నాని-అలామొదలైంది.
    04 . ఉత్తమ నటి - అలామొదలైంది...
    05 . ఉత్తమ గేయ రచయిత - శ్రీరామరాజ్యం
    06 . ఉత్తమ మాటల రచయిత - దూకుడు
    07 . ఉత్తమ హాస్య నటుడు -
    08 . ఉత్తమ గాయకుడు - రేవంత్
    09 . ఉత్తమ గాయని --- మిస్టర్ పర్ఫెక్ట్ (చలి చలిగా అల్లింది)
    10 . ఉత్తమ ఛాయాగ్రాహకుడు --- శ్రీ రామ రాజ్యం

    రిప్లయితొలగించండి
  7. 01 . ఉత్తమ చిత్రం - శ్రీ రామ రాజ్యం
    02 . ఉత్తమ దర్శకుడు -Bapu
    03 . ఉత్తమ నటుడు -Bala Krishna ( Sree Rama Rajayam)
    04 . ఉత్తమ నటి - Nayana tara ( Sree Rama Rajayam)
    05 . ఉత్తమ గేయ రచయిత - శ్రీరామరాజ్యం
    06 . ఉత్తమ మాటల రచయిత - Mullapudi Venkata Ramana ( Sree Rama Rajayam)
    07 . ఉత్తమ హాస్య నటుడు - BRahmanandam - Dukudu
    08 . ఉత్తమ గాయకుడు - S.P.BalaSubrah manyam ( Sree Rama Rajayam)
    09 . ఉత్తమ గాయని --- Shreya Ghoshal ( Sree Rama Rajayam)
    10 . ఉత్తమ ఛాయాగ్రాహకుడు --- శ్రీ రామ రాజ్యం

    రిప్లయితొలగించండి
  8. 01 . ఉత్తమ చిత్రం - శ్రీ రామ రాజ్యం
    02 . ఉత్తమ దర్శకుడు - జి. అశోక్ (పిల్ల జమిందార్)
    03 . ఉత్తమ నటుడు - నాని (పిల్ల జమిందార్)
    04 . ఉత్తమ నటి - నయనతార (శ్రీ రామ రాజ్యం)
    05 . ఉత్తమ గేయ రచయిత - జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు (దాదాపు అన్ని పాటలు,శ్రీ రామ రాజ్యం)
    06 . ఉత్తమ మాటల రచయిత - చంద్రశేఖర్ గుందిమెడ (పిల్ల జమిందార్)
    07 . ఉత్తమ హాస్య నటుడు - బ్రంహానందం (దూకుడు)
    08 . ఉత్తమ గాయకుడు - ఎస్.పి.బాలసుబ్రమణ్యం (గాలి నింగి నీరు,శ్రీ రామ రాజ్యం)
    09 . ఉత్తమ గాయని - శ్రేయ ఘోషల్ (శ్రీరామ లేర ఓ రామ,శ్రీ రామ రాజ్యం)
    10 . ఉత్తమ ఛాయాగ్రాహకుడు - పి.ఆర్.కె.రాజు (శ్రీ రామ రాజ్యం)
    11 . ఉత్తమ సంగీత దర్శకుడు - ఇళయరాజ ((దాదాపు అన్ని పాటలు,శ్రీ రామ రాజ్యం)

    రిప్లయితొలగించండి
  9. 01 . ఉత్తమ చిత్రం - Dookudu
    02 . ఉత్తమ దర్శకుడు - Sree Rama Rajyam
    03 . ఉత్తమ నటుడు - Dookudu
    04 . ఉత్తమ నటి - Dookudu
    05 . ఉత్తమ గేయ రచయిత - Shakthi
    06 . ఉత్తమ మాటల రచయిత - Mullapudi Venkata Ramana(Sree Rama Rajyam)
    07 . ఉత్తమ హాస్య నటుడు - M.S. Narayan (Dookudu)
    08 . ఉత్తమ గాయకుడు - S.P.Balasubramanyam (Sree Raama Rajyam)
    09 . ఉత్తమ గాయని - Sree Valli(Shakthi)
    10 . ఉత్తమ ఛాయాగ్రాహకుడు - P.R.K.Raju (Sree Rama Rajyam)

    రిప్లయితొలగించండి
  10. 01 . ఉత్తమ చిత్రం - Dookudu
    02 . ఉత్తమ దర్శకుడు - Sukumar (100% Love)
    03 . ఉత్తమ నటుడు - Naani (Pilla Zamindar)
    04 . ఉత్తమ నటి - (Tamanna ) 100% Love
    05 . ఉత్తమ గేయ రచయిత - -Veturi-Omkareswari (Badrinath)
    06 . ఉత్తమ మాటల రచయిత - Parusharam (Solo)
    07 . ఉత్తమ హాస్య నటుడు - MM Narayana (Dookudu)
    08 . ఉత్తమ గాయకుడు - Ranjith - Nenuu Thaanani (Oh my friend)
    09 . ఉత్తమ గాయని - Chali Chali ga from Mr Perfect
    10 . ఉత్తమ ఛాయాగ్రాహకుడు - C Ram Prasad(Mirapakai)

    రిప్లయితొలగించండి
  11. http://www.tupaki.com/news/view/AVS-Blogbuster-awards---A-Big-Joke-/10072

    రిప్లయితొలగించండి
  12. 01 . ఉత్తమ చిత్రం -పరమ వీరచక్ర
    02 . ఉత్తమ దర్శకుడు -కధ, స్క్రీన్ ప్లే, దర్సకత్వం అప్పలరాజు
    03 . ఉత్తమ నటుడు - balakrishna-పరమ వీరచక్ర.
    04 . ఉత్తమ నటి - PRIYAMANI_క్షేత్రం

    రిప్లయితొలగించండి
  13. best film- sriramarajyam
    best actor- balakrishna
    best actress- nayanatara
    best director- bapu$ramana
    best comedian- raghubabu(oosaravelli)
    best singer- balasubrhamanyam
    best fimale singer- chitra(sriramarajyam)
    best photographer- chota k naidu (brindavanam)

    రిప్లయితొలగించండి