22, మార్చి 2012, గురువారం

బ్లాగు ద్వారా సినిమా అవార్డులు.......


   నా బ్లాగుకు లభిస్తున్న ఆదరణ నిజంగా నాకు ఆనందం కలిగిస్తోంది..నేను స్పందించాలనుకున్న  అంశాలపై నా అభిప్రాయాలతో ఏకిభవించే వారు ఉండచ్చు...విభేదించే వారు ఉండచ్చు... కొన్ని ఆసక్తికరమైన విషయాలపై చర్చ పెట్టాలన్నది నా అభిప్రాయం....అందులో నేను ఎంతో కొంత సఫలిక్రుతుడిని కాగలిగానన్నది నా ఫీలింగ్...నేను వాస్తవానికి సినిమా రంగానికి చెందినవాడిని... అందుకే  నా బ్లాగులో సినిమా డామినేషన్ ఎక్కువగా వుంటుంది...బ్లాగు చదివే వారు కుడా నా నుంచి అదే ఆశిస్తారు... అది సహజం... అయితే మౌలికంగా నేను జర్నలిస్టును కాబట్టి కొన్ని సామాజిక అంశాలను కుడా అప్పుడప్పుడు నా బ్లాగులో చర్చించాను ... 
నాకు తెలిసి సినిమా ఆర్టిస్టులలో ప్రత్యేకించి తెలుగు సినిమా ఆర్టిస్టులలో 
చాలా తక్కువ మంది బ్లాగులు మెయింటైన్ చేస్తారు.. నాకు తెలిసి ఎవరూ లేరు. ఇప్పటికి షుమారు 18 నెలల నుంచి షుమారు ముప్ఫయి వేల మందికి పైగా నా బ్లాగు చూస్తున్నారు.... అయితే నాకు కొద్ది రోజుల క్రితం ఒక 
ఆలోచన  వచ్చింది.... నేను నా బ్లాగు ద్వారా ఫాలోయర్స్ అభిప్రాయాల ప్రకారం ఫిలిం అవార్డులను ఎందుకు నిర్వహించకూడదు అని అనిపించింది. కేవలం ఎంపిక చేయటమే కాకుండా ఎంపిక పూర్తి అయిన తరువాత ఒక ఈవెన్టు లా ఈ అవార్డుల ప్రోగ్రాం నిర్వహించాలని కుడా అనిపిస్తోంది... చూద్దాం.. ఎలా వుంటుందో.... ఇది కేవలం నా బ్లాగు చూస్తున్న వారికే పరిమితం.... వాళ్ళు మాత్రమే అవార్డు విజేతలను ఎంపిక చేస్తారు... ముందుగా రెండ్రోజుల్లో 2011 లో విడుదల అయిన చిత్రాల జాబితాను బ్లాగులో పెడతాను... అలాగే ఏయే క్యాటగిరిలలో అవార్డులు ఎంపిక చేయాలనేది కుడా వివరిస్తాను....మీరు ఎంపిక చేయండి.... మీరు మాత్రమే కాకుండా మీ స్నేహితులకు కూడా ఈ బ్లాగు గురించి, ఈ అవార్డుల గురించి వీలయితే చెప్పండి... నిష్పాక్షికంగా , నిజాయితిగా వీటిని ఎంపిక చేయాలనే నా సంకల్పానికి బలాన్నివ్వండి...ఒక కొత్త సంప్రదాయాన్ని ప్రోత్సహించండి...సినిమాల జాబితాను తదుపరి సంచికలో చూడండి....మీకు 
మీ కుటుంబ సభ్యులకు హృదయ పూర్వకంగా ఉగాది శుభాకాంక్షలు అందిస్తున్నాను....


బ్లాగు ద్వారా సినిమా అవార్డులు....... 
       

3 కామెంట్‌లు:

  1. మంచిది. అలాగే కానివ్వండి. బ్లాగ్‌స్పాట్ లో పోల్స్ ద్వారా కూడా ఇలాంటి ఎన్నికలు చెయ్యవచ్చును కానీ ఒక్కరే ఎన్నయినా వోట్లు వేసే అవకాశం వుంది.

    ఇంకో విషయం. మీరు వ్యాఖ్యలకి స్పందిస్తున్నట్టు లేదు. మీకు తీరికలేకపోవచ్చునేమో గానీ మీకు నచ్చిన ముఖ్యమయిన వ్యాఖ్యలకయినా మీరు స్పందిస్తూ వుంటే బ్లాగర్లతో సరిగ్గా కనెక్ట్ కాగలుగుతారు.

    రిప్లయితొలగించండి
  2. నందన నామ సంవత్సర శుభాకాంక్షలు ...మీరు మరియు మీ కుటుంబాలు అందరు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను..:)))))

    రిప్లయితొలగించండి
  3. చాలా మంచి ఆలోచన.. మీ తదుపరి టపా కోసం ఎదురు చూస్తాం.

    రిప్లయితొలగించండి