1, మే 2013, బుధవారం
 

    జనం గొప్పవాళ్ళు ....!    అంతా గందరగోళంగా వుంది. అందరూ తెగ తిరిగేస్తున్నారు. ఎవడిగోలవాడిది. ఏడాది ముందుగానే
   ఎన్నికల జ్వరం ఆంద్ర దేశాన్ని ఆవహించింది. చంద్రబాబు ఒక పక్క,...  షర్మిల ఒక పక్క,.....
   ముఖ్యమంత్రి   మరోపక్క రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. తన పాదయాత్ర కేవలం ప్రజల సమస్యలు
   తెలుసుకునేందుకేనని చంద్రబాబు చెబుతుండగా, షర్మిల పూర్తిగా చంద్రబాబును తిట్టేందుకే తన
   పాదయాత్ర ను పరిమితం చేసుకున్నారు. ఇక కిరణ్ కుమార్ రెడ్డి గారయితే తన ఒంటరి పోరాటంలో
   గెలుపొంది తన సత్తా ఏమిటో పార్టీ లోని అంతర్గత శత్రువులకు తెలియచెప్పాలని ఆశయంగా
   పెట్టుకున్నారు. ముగ్గురూ తెలివైన వారే. కాని జనం వీరి కంటే తెలివైనవారు. అందరి సభలకూ
   పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. అందరికీ చప్పట్లు కొడుతున్నారు. ఈ చప్పట్లు ఎంతవరకు
   ఎవరికీ వోట్లుగా మారతాయో ఎన్నికల దాకా వేచి చూడాలి.     

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి