8, నవంబర్ 2012, గురువారం

సినిమాతో వివాదాలా...? వివాదంతో సినిమాలా....??   

        సినిమా పరిశ్రమలో వివాదాలు పెరిగిపోతున్నాయి...తీస్తున్న సినిమాలు వివాదాలకు గురవుతున్నాయా
  లేక వివాదాల కోసమే సినిమాలు తిస్తున్నారా అన్నది అర్ధం కావటం లేదు. ఒక ప్రాంతం, ఒక మతం, ఒక కులం,
  లేదా ఒక వర్గం వారి మనోభావాలు దెబ్బ తింటున్నాయంటూ సినిమా విడుదల అయిన తరువాత ఎవరో
  ఒకరు ఆగ్రహిస్తున్నారు....ఉద్యమిస్తున్నారు....ఆవేశంతో ఊగిపోతున్నారు. సదరు సినిమా తీసిన వారి
  ఇళ్ళ మిద , ఆఫీసుల మీద కూడా దాడి చేస్తున్నారు..... సినిమాను సినిమాగా చూడండి అంటూ సినిమా వారు
  మొరపెట్టుకుంటున్నారు. ఒక పక్క మా మనస్సును గాయపరుస్తూ సినిమాను సినిమాగా చూడమంటారేమిటి
  అంటూ ఆయా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి....ఇటివల కాలంలో వచ్చిన " కెమెరా మెన్ గంగతో రాంబాబు "
  " దేనికైనా రెడి " " ఎ వుమెన్ ఇన్ బ్రాహ్మణిజం " లాంటి సినిమాలకు సంబంధించి ఈ వివాదాలు పరాకాష్టకు
  చేరుకున్నాయి... ఇక్కడ ఎవరు తప్పు...ఎవరు రైటు అని చర్చించుకోవటం పక్కన పెడితే అసలు ఈ పరిస్థితి
  దాపురించటమే దురదృష్టకరం. వివాదం గా ప్రారంభం అవుతున్న సమస్య చివరకు " ఈగో " ల సమస్యగా
  మారుతోంది... సినిమాకు వ్యతిరేకంగా ఒక కులం వారు ఉద్యమిస్తున్నారంటే పరిస్థితి తీవ్రత అర్ధం అవుతోంది.
  ఈ ఉద్యమంలో సహజంగానే ఇతర ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు ప్రవేశిస్తున్నాయి. ఎక్కడో ఒక చోట
  ఈ వివాదానికి స్వస్తివాక్యం పలకాలి. ప్రత్యేకించి " దేనికైనా రెడీ " సినిమాకు సంబంధించిన వివాదం...
  కావాలని చేయకపోయినా ఒక పొరపాటు జరిగిపోయింది. మోహన్ బాబు గారికి బ్రాహ్మణులంటే గౌరవం,
  ప్రేమ ఉన్నమాట వాస్తవమే...అయితే సినిమాలో అనుకోకుండా కొంతమంది మనోభావాలు దెబ్బతినే
  సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. వాస్తవానికి ఇది చాలా సులభంగా పరిష్కారం అయ్యే సమస్య...
  చూస్తుండగానే పెద్దదయిపోయింది. ఈ వివాదం వల్ల సినిమా కలెక్షన్లు పెరిగి ఉండచ్చు ..కాని అది
  అభిలషణియం కాదు ...ఆనందకరం కూడా కాదు...ఇలాంటివన్నీ  పక్కనపెట్టి మోహన్ బాబు లాంటి
  స్థితప్రజ్ఞులు తమ ఈగో ని పక్కన పెట్టి సమస్యను పరిష్కరించుకోవాలి....సినిమా అందరి కోసం...అందరి
  వినోదం కోసం....అందరూ సంతోషంగా వుండాలని సినిమా వాళ్ళు కోరుకుంటారు...కోరుకోవాలి....!! 

 సినిమాతో వివాదాలా...? వివాదంతో సినిమాలా....??

 

8 వ్యాఖ్యలు:

 1. braahmanula meeda enno cinemallo buffoon lu ga choopinchaaru, manobhaavaalu debbathinnappatiki vaati vishayaallo pedda manasutho choosi choodanattugaane vadilesaaru, mari ee vishyam lone enduku ila jarigindi?

  creativity peru cheppi paityam pradarsisthe ilaage untundi.

  1. na intiki vachina vaallu nijamaina braahmanullu ayyundaru, edo chanda kosam vachi untaaru ani vaagina naade athaniki entha gowravam undo thelindi.

  2. city lo thiragadaaniki bhayapadela chestha ani vishnu media tho annappude vaallaki vyakthula patla entha chulakana bhaavam undi thelisindi.

  3. Manchu lakshmi "A women in brahmanisam" vishayam lo pornography anedi ee roju chaala saadhaaranamaina vishayam, bollywood hollywood cinema lu choosinappudu lenidi ee cinema lo unna scenes lo thappem undi annappude asalu vaallakunna viluvalu A dasalo unnaayo thelisindi.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. adi vaallaki vyakthula patla, samajam patla, viluvala patla unna gowravam. dabbu madam tho unnaaru..

  ప్రత్యుత్తరంతొలగించు
 3. >>మోహన్ బాబు గారికి బ్రాహ్మణులంటే గౌరవం, ప్రేమ ఉన్నమాట వాస్తవమే<<
  నిజమా ఏవీయస్ గారూ?

  ప్రత్యుత్తరంతొలగించు
 4. Ayya AVS Gaaru, Mohan Babu ki Brahmanula meeda Gouravam vundi ani Raasinappude mee meeda vunna respect pogottukunnaru.
  I am sorry for you, darmavarapu Subramanyam garu too for participating in humiliating the brahmins.

  Mohan babu ki saati manishi meeda assalu Gouravam ledu...inka Brahmanula meeda elaga vuntundi andi?
  Total his family except his wife(I don't know about her) have attitude problem. they think that they were born to rule to public..!! Vallu maatlidina prati maataloni pogaru kanipistundi.
  Mohan babu gari prati cinema loni..Brahmanulani humiliate/insult chestune vunnaru...ayanaki gudilo poojarulani vetakaram chedam is the comedy scenes in his movie.
  Ayana/ayana pillala career kosam evari career ayina sare nasanam chese manishi - Mohan Babu and his family.
  Ex: Sakshi Shivanand and her sister. with his power/money/madam to vallani valla career ni nasanam cheseru mohan babu and his sons.
  Okappudu Mohan babu gari kooturu..Teluguni sarva Nasanam chestu maatlade Lakshmi Prasanna Garu, emani annaro telsa infront of media?
  Her Dad is most saddistic and real life villan ...ayana anta worst person ikokadu vundadu ani ame anndi..Atuvanti Goppa vyakti Mohan Babu...!
  ayyanni keerthichi..mee respect pogottukunnaru.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. meeru cheppedi vaalla ammaayi modatlo ... appudaa leka tarvaata. mohan babuni chooste, ee jokerlandariki laagulu tadustay

   తొలగించు
 5. /కావాలని చేయకపోయినా ఒక పొరపాటు ... బాబు లాంటి స్థితప్రజ్ఞులు తమ ఈగో ని పక్కన పెట్టి /

  ఈమాట ఆయనతో ఓ సారి చెప్పి చూడండి. ఆ.. జాగ్రత్త, హెల్మెట్ పెట్టుకుని వెళ్ళండి.:)) అక్కినేని, చిరంజీవి సన్మాన సభల్లో ఆయన స్థితప్రజ్ఞత చూసే చెబుతున్నారా?

  ప్రత్యుత్తరంతొలగించు