25, జనవరి 2011, మంగళవారం

అన్నీ బానేవున్నాయి...! కానీ....!!!          కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాలు బానే వున్నాయి.ఎంత మంది అర్హతగలవారికి పురస్కారాలు ఇచ్చారో అని ఆలోచించేకంటే ఇచ్చిన వారిలో ఎంతమందికి అర్హత ఉందన్న కోణంలో ఆలోచించటం ఉత్తమం. ఇప్పటికే దేశంలో వున్న అన్ని అత్యున్నత పురస్కారాలను అందుకున్న డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారికి తాజాగా పద్మవిభూషణ్  పురస్కారం ప్రకటించటం చాలా సబబుగానూ, సముచితంగాను ఉందనటం నిస్సంకోచంగా నిర్వివాదాంశం. తెలుగు వాళ్ళు గర్వంగా చెప్పుకోదగ్గ జాతీయ సంపద డాక్టర్ అక్కినేని...ఎన్ని పురస్కారాలు ఆయన ఖాతాలో జమపడినా మరికొన్ని పురస్కారాలకు ఆయన అక్కౌంట్లో ఖాళి వుంటుంది..బహుశా భారతరత్న పురస్కారంతో ఆ లాంచనం కూడా పూర్తి అవుతుందేమో..లెటజ్ హోప్...ఇక  గంధర్వగాయకుడు బాల సుబ్రహ్మణ్యం గారికి పద్మభూషణ్ పురస్కారం ప్రకటించటం చాలా గొప్ప నిర్ణయం.. బాలు గారికి ఎన్ని పురస్కారాలు ప్రకటించినా అవి తక్కువే..బాలు గారి లాంటి బహుముఖ ప్రజ్ఞాశాలికి కొన్ని పురస్కారాలు ఆలస్యంగా వచ్చినా అభినందనీయమే..


          ఇక వి వి ఎస్ లక్ష్మణ్, డాక్టర్ అంజిరెడ్డి, జి వి కే రెడ్డి, పుల్లెల శ్రీ రామ చంద్రుడు, తదితరులకు లభించిన పురస్కారాలు కూడా చాలా సముచితంగా  సహేతుకంగా వున్నాయి. ఆయా రంగాలలో వారి వారి ప్రతిభా పాటవాలకు అనుగుణంగా ఆ పురస్కారాలు వారికి దక్కాయి. బావుంది. అయితే ఇర్ఫాన్ ఖాన్ , టాబు, కాజోల్  లాంటి వారికి పద్మశ్రీ పురస్కారాలు ఎందుకు ఇచ్చారో నా మట్టి బుర్రకు అందటం లేదు... నా పరిజ్ఞానానికి అందని కారణాలు ఏవో వుండే ఉంటాయి..నా బాధల్లా వాళ్ళేవరికో ఇచ్చారని కానే కాదు...ఎవరి అర్హతలు వారివి..కాని ఇప్పుడిచ్చిన కొంతమందికంటే ఓ బాపు రమణ గారి లాంటి వారిని  ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదో అర్ధం కావట్లేదు...అయినా నాకు  బాపు రమణ గారంటే ఇష్టం కాబట్టి వాళ్ళ పేర్లు ప్రస్తావించాను...నాలాగా చాలామంది చాలామంది గురించి ఇలా ఫీల్ అవుతుండవచ్చు..అయితే దానిని వ్యక్తపరచేందుకు మార్గం ఉండక పోవచ్చు. నాకున్న ఈ బ్లాగ్ అవకాశాన్ని నేను ఉపయోగించుకుంటూన్నా.    అంతే..అంతకు మించి మరేమీలేదు...5 వ్యాఖ్యలు:

 1. అయ్యా! మీకే కాదు. మాకు కూడా కాజోల్, టాబుకు ఈ గురింపు ఎందుకు ఇచ్చారో అర్ధం కావడం లేదు. అవును సర్ మీరే మీ బుర్రను మట్టిది అనుకుంటే మాలాంటి ( మా ఖాళీ బుర్రల ) వారి పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలి.
  THNQ WITH NAMASKARAM.

  THIS IS RAYAPROLU MALLIKARJUNA SHARMA, PRIEST,
  BANJARA HILLS.

  WWW.SAKALAPOOJALU.COM,
  RMSHARMA@SAKALAPOOJALU.COM

  ప్రత్యుత్తరంతొలగించు
 2. ఏవీయస్ గారూ,
  ప్రపంచంలో మనకు తెలియని చాలా వింతలలో పద్మ పురస్కారాల నిర్ణయాలొకటని నాకెప్పటినుంచో నమ్మకం.
  ఎవరికెవరికో రత్నాలూ, భూషణాలూ (అక్కడక్కడ, అప్పుడప్పుడు అక్కినేని గారూ, బాలూ గారి లాంటి వారి కి లేటు గా ఇచ్చినా), అర్హులకి తిరస్కారాలు.
  - మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం

  ప్రత్యుత్తరంతొలగించు
 3. అవును సార్ మీ స్పందన 100% సబబు , ఒక అమ్మయి అందాన్ని వర్ణించాలంటే ఇప్పటికీ బాపు బొమ్మతో పొలుస్తారు , మంచి జోక్ వింటే రమణగాగి జోక్స్ లా ఉన్నాయి అంటారు కొందరు . అలాంటి వారు చాలామంది ఉన్నారు మన దేశంలో మరి అలాంటి వారిని అందరినీ వదిలి , ఈ పురస్కారాలు ఎలా ఇచ్హారో ఎవరికీ అర్ధం కాని విషయం . ప్రశ్న ... కానీ మన సలహా ఎవరికి కావాలి , ఎదో ఉత్తినే గొప్ప వ్యక్తుల మీద ఇలా చిన్నచూపు ఏల అనే .... మన తాపత్రయం తప్పితే .

  ప్రత్యుత్తరంతొలగించు
 4. excellent ga cheppary AVS garu,halage bharataratna NTR ki vachhetatlu chudandi ,nee cinema association antha kalisi kattuga vundi,NTR ki bharatha ratna vachhetatlu cheyandi plzz...

  ప్రత్యుత్తరంతొలగించు