25, డిసెంబర్ 2010, శనివారం

పాపం...పూర్ కిరణ్ కుమార్...!

          
          చంద్రబాబునాయుడు గారి  ఎనిమిదిరోజుల నిరాహారదీక్ష
పూర్తయింది.  ఆయన ఏ డిమాండుల సాధనకోసం ఈ దీక్ష చేసారో వాటిని కిరణ్ కుమార్ సర్కారు అంగీకరించలేదు. అయితే బాబు దీక్షకు జాతీయ స్థాయి గుర్తింపు వచ్చింది. ఏదేమయినా కిరణ్ కుమార్ గారి పట్టుదల 
విజయం సాధించిందా లేక చంద్రబాబు లక్ష్యం విజయం సాధించిందా అన్నది జనం ముందు వున్న ప్రశ్న. కిరణ్ దృష్టిలో చంద్రబాబు ఓడి తాను గెలిచాడు..తన పట్టుదల, మొండితనం, గెలిచాయి. కాని రైతుల దృష్టిలో చంద్రబాబు పట్టుదల, ఆశయదీక్ష విజయం సాధించాయి. కిరణ్ మొండితనం దారుణంగా ఓడిపోయింది. రైతులకు ఏదయినా చేద్దామని ఎక్కడో ఒక శాతం కిరణ్ గారికి మనసులో వున్నా....చేస్తే ఆ క్రెడిట్ చంద్రబాబు ఖాతాలో జమ పడుతుందో అనే భయం ఆయన్ను వెంటాడి వుంటుంది. చేయకపోతే తాను రైతు వ్యతిరేకిననే ముద్ర పడుతుందన్న భయం వున్నా సమస్యను ఆయన పూర్తిగా రాజకీయ కోణంలోనే చుసారన్న సంగతి చాలా స్పష్టంగా అర్ధం అవుతోంది. చివరగా రైతుల కంటే తన ఇగో నే గొప్పదన్న అంశాన్ని ఆయన చెప్పకనే చెప్పారు. రైతులకు ప్రకటించిన ప్యాకేజీలో ఎటువంటి మార్పు వుండదన్న కిరణ్....చంద్రబాబు దీక్ష విరమించిన వెంటనే కొత్త ప్యాకేజి ప్రకటించటం ఇందుకు నిదర్శనం. ఈ పరంగా ఆలోచించి బహుశా కిరణ్ కుమార్ గారు తాను గెలిచినట్టు భావిస్తున్నారేమో తెలియదు కాని, అలా భావించి వుంటే ఆయన పొరబడ్డట్టే. రైతుల గుండెల్లో చంద్రబాబు స్థానం 
అలానే తెలుగుదేశం పార్టీ స్థానం బలపడ్డాయి. రైతుల పరంగా రాజశేఖరరెడ్డి గారి తరువాత గట్టిగా ఆలోచన  కాంగ్రెస్ పరంగా జరగటం లేదన్నది వాస్తవం.తరువాత వచ్చిన రోశయ్య గారికి సవాళ్లు ఎదుర్కొనటంలోనే పుణ్యకాలం గడిచిపోయింది. కిరణ్ కుమార్ గారు కుర్చీ ఎక్కగానే ఈ రైతుల సమస్య వచ్చి పడింది. నా ఉద్దేశ్యంలో రైతుల సమస్య తీర్చటం ద్వారా  తాను గొప్ప రైతు పక్షపాతినని నిరూపించుకునేందుకు గాను కిరణ్ కుమార్ కు లభించిన మంచి అవకాశం....ఇగోలు, భేషజాలు పక్కన పెట్టి రైతులకు మాగ్జిమం సహాయం చేయగలిగివుంటే ఆదిలోనే గొప్ప ముఖ్యమంత్రిగా ముద్ర పడి తన ప్రస్థానాన్ని రాష్ట్రంలో ప్రారంభింఛి వుండేవారు. రైతుల విషయంలో చంద్రబాబు ఎక్కడ మార్కులు కొట్టేస్తాడో అన్న భయంతో తాను రైతు వ్యతిరేకిననే ముద్ర వేసుకున్నారు. రైతులకు ఎందుకు అదనంగా సహాయం చేయలేక పోతున్నాము అన్న విషయంలో ప్రజల్ని కన్విన్స్ చేయటంలో కిరణ్ సర్కారు విఫలమయింది. రైతుల దృష్టిలో చంద్రబాబు హీరోగా మారిపోయాడు. రైతుల సెక్టార్లో  కోల్పోయిన గత ప్రాభవం, ఆదరణలను తెలుగుదేశం పార్టీ మళ్లీ ఎంతో కొంత సాధించుకోగలిగింది. ఇదేదో రాజకీయంగా విశ్లేషించటం కాదు. ఆకలయినవాడికి, అవసరంలో ఉన్నవాడికి తక్షణ సహాయం అందించటం వేరు...తాపీగా స్పందించటం వేరు. మన దేశంలో రైతుల గొప్పతనం ఏవిటంటే సహాయం అడుగుతారేగానీ ఎదురుచూడరు. అనుకున్న సహాయం లభించకపొతే ఆత్మహత్యలకయినా పాల్పడతారు తప్ప ఆత్మాభిమానాన్ని వదులుకుని కాళ్ళమీద పడరు. 
సహాయాన్ని ఆశించటం వేరు. దాని కోసం సాగిలపడటం వేరు. 
          చివరగా నేను చెప్పదలచుకున్నది ఏవిటంటే.... సారీ కిరణ్ గారు....!కంగ్రాట్స్ చంద్రబాబు గారు...!కాని చంద్రబాబు ఎనిమిది రోజుల దీక్ష ఫలితం లేకుండా పోయింది...కిరణ్ కుమార్ గారి విపరీతమయిన ఇగో ఓడిపోయింది....తాను ఓడిపోయాడో గెలిచాడో అర్ధంకాని రైతు మాత్రం కన్నీళ్ళు తాగి బాధను దిగమింగుతున్నాడు...లేదా పురుగు మందు తాగి తనువు చాలిస్తున్నాడు. రైతులు ఆత్మాహుతి చేసుకుంటున్నారన్న వార్తలు పత్రికల్లో రాయకుండా సహకరించమని అడుగుతున్న  మన ముఖ్యమంత్రి గారి అంతరంగం అర్ధంకాక యావత్ ఆంద్రదేశం నివ్వెరపోయి చూస్తోంది...ఇకనుంచయినా మన ముఖ్యమంత్రి గారు తన ధోరణి మార్చుకుని సమస్యల్ని రాజకీయంగా, వ్యక్తిగత ప్రతిష్ట దృష్ట్యా కాకుండా ప్రజల దృష్ట్యా, సమస్యల తీవ్రత దృష్ట్యా మానవీయ కోణంలో ఆలోచించటం మొదలుపెడితే ఉత్తమమని  ఒక పౌరుడిగా నా సూచన...!


 

6 కామెంట్‌లు:

  1. dear sri AVS garu,
    i dont belong to any party...i want to make this clear before my comment as i am a very common man without much knowledge or experience in politics.
    the developments in AP over last 14 months is quite disturbing... what ever is the situation a person who was in the top post for 9 long years going for Deeksha is not justifiable.... had the govt yielded to the deeksha you will see ever 2nd person in state will go for deekha making our AP as DEEKSHANDRA PRADESH. What did mr Babu gained from this except showing his despirate attitude to come to power , this is not expected from a person like him...He is still the best administrator of AP....as you are all close to him advice him ( he will never hear you all I know ) to do some good work and highlight issues in the best interest of public, not try to highlight his existence....the margin in last elections is very thin.....good deeds will swing the result in his favour ..provided he doest react...he has to ACT to the situation and show his previous glory....it appears he is loosing ground
    i wish him and you all the best.....vivek

    రిప్లయితొలగించండి
  2. please watch & subscribe
    http://bookofstaterecords.com/
    for the greatness of telugu people.

    రిప్లయితొలగించండి
  3. dear avs garu
    i know you are a man of ideas and can write wonderful articles on CURRENT ISSUES... sri krishna committee, curent situation of telugu film industry are few....mee ku chappala...edo na thuthhi kani

    రిప్లయితొలగించండి