15, జూన్ 2010, మంగళవారం

ఏవియస్ ఎక్కిళ్ళు...


బ్లాగ్ మొదలు పెట్టడమంటే ఏదో తెలియని ఫీలింగ్ . గతంలో ఒకసారి మా స్టార్స్ డాట్ కం లో బ్లాగ్ మొదలు పెట్టాను గానీ బిజి వల్ల రెగ్యులర్గా రాయలేకపోయాను. బ్లాగ్లో వాస్తవాలు రాయకపోతే వృధా అని నా అభిప్రాయం. కాని వాస్తవాలు రాస్తే ఎంతమంది దాన్ని పాజిటివ్ గా తిసుకోగలరు ? ఎవరి ముఖస్తుతి కోసమోబ్లాగ్ కన్తిన్యూ చేయలేముకదా

కానీ కొన్ని బ్లాగులు చదువుతుంటే నాకూ రాయాలన్న ఉత్సాహం పెరిగింది. అందుకే మరోసారి ఈ ప్రయత్నానికి నాంది పలికాను.మంచి అయినా చెడు అయినా ఎవరు ఆనందపడినా, ఎవరు బాధ పడినా నిర్మొహమాటంగా నా మనస్సుకు నచ్చింది...నా మనస్సు చెప్పింది

రాసుకునేందుకు ప్రయత్నిస్తాను. నా ప్రయత్నంలో నేను ఎంతవరకు సక్సెస్ అవుతానో నాకు తెలియదు కానీ ప్రయత్నలోపం మాత్రం వుండదు. ఒక్క సినిమా అనే కాదు నన్ను స్పందింపచేసిన ప్రతి అంశాన్ని స్పర్సిస్తాను. రిజల్టు ఎలా వుంటుందో మరి.

25 కామెంట్‌లు:

  1. Congrats Mitrama,
    meeru cheppina ventane mee blog chusanu. Roju kaneesam oka item ayina ivvandi. Mee blog super succes avutundi. All the Best. First item kosam eduru chustoo...
    Ur friend...
    MOHAN GOTETI

    రిప్లయితొలగించండి
  2. HI DAD CONGRATS ,
    MEE BLOG CHAALA BAGUNDI PLEASE KEEP POSTING EXCLUSIVE STUFF . EE BLOG SUPER GAA UNTUNDI
    ALL THE BEST DAD

    రిప్లయితొలగించండి
  3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  4. EEROJA MEE BLOG CHOOSANU.CHALA BAGUNDI,CHIRU GARI VISHAYAM OPENGA CHEPPATAM CHALA NACHINDI. PRATI ROJU MANCHI VISHAYALU PETANDI. MEE BLOG VIJAYAVANTAM KAVALANI AKANKSHA.BOLLIMUNTHA KRISHNA GARU KUDA NATHOPATE BLOG CHOOSARU. H RAO YERRAMSETTY.

    రిప్లయితొలగించండి
  5. నల్ల బ్యాక్ గ్రౌండ్ లో తెల్ల ఫాంటు వల్ల కళ్ళు బైర్లు కమ్మేస్తున్నాయండి.

    రిప్లయితొలగించండి
  6. సుస్వాగతం . ఏవీ ఎస్ గారూ .

    రిప్లయితొలగించండి
  7. బ్లాగు ప్రపంచం కి స్వాగతం ఏవీయెస్ గారు.

    ఇన్డస్ట్రి గురిన్చి నాలుగు విశయాలు క్రమం తప్పకుండా రాస్తారు అని భావిస్తు

    - మీ శ్ర్రేయొభలాశి

    రిప్లయితొలగించండి
  8. hello sir bagunnaaraaa... naa peru suresh jai andi... adey mee ROOMMATES cinemaki designs chesanu dhani aelay gari asst ni....

    రిప్లయితొలగించండి
  9. నాకు తెలిసి రెండవ తెలుగు సినిమా ప్రముఖుడి బ్లాగు ఇది. మన తారలు ట్వీట్ చేస్తున్నారు కాని బ్లాగ్ తెరవరేమిటి అనుకుంటున్న తరుణంలో వెలువడుతున్న మీ బ్లాగుకు హార్దికస్వాగతం. గ్లామర్ ప్రపంచంలోని వెలుగు నీడలు మీ బ్లాగు ద్వారా ఆవిష్కారం కాగలవని ఆశిస్తాను.

    రిప్లయితొలగించండి
  10. ఏ.వీ.ఎస్ గారు బ్లాగ్లోకానికి సుస్వాగతం..మీరు ఇక్కడ మాకు కూడా మార్గదర్శకులు కాగలరని ఆశిస్తున్నాను...

    రిప్లయితొలగించండి
  11. మీ బ్లాగును నేను చదువుతాను, కుమ్మేయండి ఏ వి ఎస్ గారు.

    రిప్లయితొలగించండి
  12. గ్లామర్ ప్రపంచంలోని వెలుగు నీడలు చెప్పడానికి,గాసిప్స్ ప్రచారం చేయడానికి సినిమా పత్రికలు,దినపత్రికలు ఉన్నాయిలెండి!


    మంచి అయినా చెడు అయినా ఎవరు ఆనందపడినా, ఎవరు బాధ పడినా నిర్మొహమాటంగా నా మనస్సుకు నచ్చింది...నా మనస్సు చెప్పింది
    రాసుకునేందుకు ప్రయత్నిస్తా

    ఇది బావుంది! ఇక రాసేయండి సార్, మేమున్నాం చదవడానికి!

    రిప్లయితొలగించండి
  13. ఏవియస్ గారు. చిన్నప్పుడు మీ సినిమాలు చూసేవాడిని. నేను ఎక్కువగా చూసేవి కామెడీ సినిమాలే. పెద్దైన తరువాత బిజినెస్ పనుల్లో పడి సినిమాలు చూడడం మానేశాను. సినిమాలు చూడడం మానేసినా చిన్నప్పుడు చూసిన మీరు నటించిన సన్నివేశాలు బాగా గుర్తున్నాయి.

    రిప్లయితొలగించండి
  14. ఏ వీ యస్ గారూ!
    ఇపుడే తెలిసింది మీ బ్లాగ్ గురించి.
    ఇక రెగ్యులర్ గా చూస్తాను.

    రిప్లయితొలగించండి
  15. ఏ.వి.ఎస్. గారు, బ్లాగులోకానికి స్వాగతం.
    ఉత్తినే అని పెట్టారా! అరరే మేము మీరు అనగానే అదోతుత్తి అంటారేమో అనుకుంటాం మరి. ఆ ఉత్తినేని తెలుగులో వ్రాయండి సార్ అందంగా ఉంటుంది. ప్రజలు కూడా నిర్మొహమాటమయిన నిజాలకోసమే బ్లాగులు చూస్తారు. దంచెయ్యండి సార్.

    రిప్లయితొలగించండి
  16. AVS గారు,
    మీకో మనవి మీ లాంటి రచయితలు సాధ్యమైనత వరకు తెలుగు పదాలు వాడాలి. ఉదా|| ఇందులో "ఎంత వరకు సక్సెస్ అవుతానో" బదులుగా "ఎంత వరకు విజయ వంతమౌతానో " అని, "రిజల్టు" బదులుగా "ఫలితం" అని తెలుగు పదాలు వాడేది . ఈ మధ్య తెలుగు సినేమా లో ఎక్కడా ఆనందం అనే పదం వినపడటం లేదు. "హాపి" గా ఫీలయ్యావా అని అంట్టున్నారు. ఎలాగు టి.వి. వాళ్ళు ఇటువంటి సూచనలను పట్టించు కోవటం ఎప్పుడొ మానేశారు కాని మీలాంటి వారు ఈ తెలుగు పదాలు సాధ్యమైనత వరకు ఉపయోగిస్తు మా బోటి పాటకులకు తెలుగు ని మరచి పోకుండా చేయాలని నా విజ్ఞప్తి.

    రిప్లయితొలగించండి
  17. ఓహో.. మీ బ్లాగు చూస్తుంటే 'గాలి కనబడినంత' (శుభలగ్నం సినిమాలో మీరు బ్రహ్మానందంని అడిగే ప్రశ్న) ఆశ్చర్యంగా ఉంది. మీ పోస్టుల కోసం ఎదురు చూస్తూ ఉంటాం...ఊ... అనండి...:-)

    రిప్లయితొలగించండి
  18. ఏవియస్ గారు: ఉత్తినే బ్లాగు వ్రాయడం ఎందుకు అదో తుత్తి గాకపోతే!:)
    మన్నించాలి. మీ డైలాగ్ గుర్తు చేద్దామని అలా వ్రాసాను. మీ నటనతో ప్రేక్షకులని అలరించినట్లు, మీ బ్లాగు టపాలతో పాఠకులను అలరిస్తారని ఆశిస్తూ... స్వాగతం!

    రిప్లయితొలగించండి
  19. స్వాగతం ఏవీయస్ గారు. మీ బ్లాగులో సినిమా ప్రేమికులకు పనికొచ్చే ఎన్నోవిషయాలు తెలుపుతారని ఆశిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  20. మీ బ్లాగుని మీరు తుత్తిగా ఏలాలని,హృదయ పూర్వకంగా కోరుకుంటూ.

    రిప్లయితొలగించండి
  21. మీవంటి సీనియర్ నటులు అందునా హాస్యరస పోషకులు బ్లాగులోకానికి రావడం చాలా ఆనందాన్ని కలిగించింది.

    రిప్లయితొలగించండి
  22. A V S garu
    Your blog is nice and simple. KEEP IT UP..
    Naaku ikkada Telugulo ela type cheyalo teliyaledu anduke ekkuva vrayaleka poyanu..
    -------- V V Raju

    రిప్లయితొలగించండి