13, మే 2012, ఆదివారం

అమ్మకు ఒక రోజు ఏవిటి ?

 
 ఇవాళ ప్రపంచ అమ్మల దినోత్సవం అని చెప్పారు....  దినాల సంస్కృతికి అమ్మ కూడా మినహాయింపు ఏమి కాదు.
దోమలకు , సిగరెట్లకు , మలేరియాకు ఎలా అయితే ఏడాదికి  రోజు కేటాయించారో అలాగే సానుభూతితో ఏడాదికి ఒక 
రోజు కేటాయించి దానికి అమ్మల దినం అని ఓ పేరు కూడా పెట్టేసారు. ఊపిరి పీలుస్తున్నంతవరకు, నరాల్లో కదలిక ఉన్నంతవరకు , ఎముకలలో గట్టిదనం ఉన్నంతవరకు మనకు కాళ్ళు చేతులు 
సక్రమంగా ఆడుతున్నంతవరకు ప్రతి క్షణం అమ్మ కోసమే...అమ్మ తోనే....అలాంటప్పుడు సంవత్సరానికి ఒక రోజు 
అమ్మకు కేటాయించటం లో అంతరార్ధం ఏమిటో అర్ధం కాదు....  మనం తిన్నామో  తినలేదో అమ్మే కనుక్కుంటుంది.
మనకు ఆకలవుతోందన్న విషయం మనకంటే అమ్మకు ముందు తెలుస్తుంది.... అలాగే మనకు నిద్ర వస్తుందని, 
జ్వరం వచ్చిందని , అమ్మకు ముందు తెలుస్తుంది. ఇంతెందుకు ..... మనం కన్ను తెరిచినప్పటినుంచి కన్ను 
మూసిన్దాకా ప్రతి దశలోనూ అమ్మే....ప్రతి కదలికా అమ్మతోనే... మరి అమ్మకు ఒక రోజేమిటి ....ఏమిటి ఈ ఖర్మ ....
ఎంత పాశ్చాత్య సంస్కృతి మన మిద ప్రభావం చూపిస్తే మాత్రం ఇంత దౌర్భాగ్యమా....????????





5 కామెంట్‌లు:

  1. నిన్నటినుండీ ఎన్నో చదువుతున్నా అండీ! కానీ మీరొక్కరే నా మదిలోని భావాలకి అక్షర రూపం ఇచ్చారు. అసలు మనం ఈ ప్రపంచంలో ఒక భాగం అంటేనే అమ్మ అటువంటికి అమ్మకి కూడా ఒక రోజు పెట్టడం నిజంగా శోచనీయం!

    రిప్లయితొలగించండి
  2. మీరన్నది నిజమే నండీ!
    మీరు వ్రాసింది కూడా నూటికి నూరు పాళ్ళు కరక్టేనండి...

    కాని, ప్రత్యేకంగా సంవత్సరంలో ఒక రోజు
    అభినందించి పూజిస్తే అందులో తప్పేమిటో నాకు అర్థం కావట్లేదు...
    భగవంతునికి జయంతి చేస్తున్నాం...
    అలాంటిది ఒక రోజు అమ్మ జయంతి అనుకొని సృష్టిలోని అమ్మలందర్నీ పూజిస్తే
    తప్పేముందండీ?
    రోజూ అమ్మని పూజించండి...
    ఈ ఒక రోజు కొంచెం ఘనంగా ఆవిడకు నచ్చే కానుక ఇచ్చో,
    ఆవిడకి నచ్చిన పని చేసో ...
    రోజు మన పనులతో అలిసే అమ్మకి ఆ రోజు పూర్తీ విశ్రాంతి నిచ్చో...

    విదేశాల్లో జరుపుకునే బోలెడు పండుగలు మనం కారణం వెతక్కుండా జరిపేసుకుంటున్నాము.
    అమ్మ గురించి కారణాలు వెతకటం...????
    మీ అభిప్రాయానికి భిన్నంగా ఉన్నందుకు మన్నించాలి....
    @శ్రీ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అమ్మ వేరు...దేవుడు వేరు... నా ద్రుష్టిలో దెవుది కంతె అమ్మ గొప్పది.... మనస్సుతో
      విడదీయలేని గొప్ప బంధం అమ్మది. దేవుడు వున్నాడో లేడో తెలియదు. అమ్మ మనతో వుంది... మనలో వుంది.... అమ్మలోనే మనం వున్నాం. అలాంటప్పుడు అమ్మ కు
      ఒక రోజేవిటి సర్... కమెడి కాకపొతేను....

      తొలగించండి
  3. నా జన్మ కు మూలమై
    నను నడిపిన నేలవై
    నా బ్రతుకున దివ్వేవై
    ధరిచేర్చిన నావవై
    నవ మాసాలు మోసి, కొలిమి కష్టాలకోర్చి తుది శ్వాశ బిగపట్టి ఆది ఊపిరి ఊదినావు
    ఏమిస్తే తీరునమ్మ.... నీ ఋణము
    ఎన్నటికి మరువమమ్మ నీ త్యాగము
    నీ వొడిలో పెంచినావ్
    వేలు పట్టి నడిపినావ్
    ఓనమాలు నేర్పినావ్
    ఓర్పెంతో చూపినావ్
    నీ ఎర్రని రక్తాన్ని, తెల్లని పాలుగా మలచి, నా కడుపుని నింపాలని నీ కడుపుని మాడ్చినావు
    ఏమిస్తే తీరునమ్మ.... నీ ఋణము
    ఎన్నటికి మరువమమ్మ నీ త్యాగము

    గుడిలెన్నో చూపినావు
    బడిలోనా చేర్చినావు
    చదువుతుంటే మురిసినావు
    నను గొప్పగా మలిచినావ్
    చదువు రాక నేనుంటే, బడికొద్దని బెట్టుచేస్తే , నా చెంపలు వాయించి నువ్వు చెమ్మ గిల్లినావు

    ఏమిస్తే తీరునమ్మ.... నీ ఋణము
    ఎన్నటికి మరువమమ్మ నీ త్యాగము

    అల్లరెంత చేసినా...
    మారేమెంత చేసినా..
    సుతి మెత్తగా మందలించి
    సుతులెన్నో చెప్పినావు

    ఆరుబయట ఆటకెళ్ళి, పక్కోడితో తో పోరుపడితే ,నాతప్పని తెలిసికూడా తగువాడి గెలిచినావు
    ఏమిస్తే తీరునమ్మ.... నీ ఋణము
    ఎన్నటికి మరువమమ్మ నీ త్యాగము


    అబద్ధాలు ఆడినా..
    అనర్థాలు చేసినా..
    గతి తప్పి తిరిగిన
    పెడదారిన నడిచిన

    నా మీద కోపమొచ్చి, అయ్య కన్నేరచేస్తే పతి దైవం అని మరచి చురకత్తులు దూసినావు

    ఏమిస్తే తీరునమ్మ.... నీ ఋణము
    ఎన్నటికి మరువమమ్మ నీ త్యాగము

    రిప్లయితొలగించండి
  4. NIJANGA MEERU ILANTIVI PETTATAM VALANA MAKU ANNO GOPPA VISHAYALU TELUSTHUNNAY AVS GARU.

    రిప్లయితొలగించండి