9, మార్చి 2012, శుక్రవారం

మళ్లీ మరోసారి...సారీ....!!

    


         ఈ ఏడాది తెలుగు సినిమాలకు వేటికీ జాతీయ అవార్డులు రాలేదన్న బాధ అందరితో పాటు నాకూ అమితంగానే వుంది....ఏదో ఒక సినిమాకు నేషనల్ అవార్డు రాకపోతుందా... తెలుగు సినిమా పరువు నిలవక పోతుందా అని నేను కూడా ఎంతగానో ఎదురు చూసాను... నిరాశ తప్పలేదు...అసలు జాతీయ అవార్డులు మన వైపు కన్నెత్తి కూడా చూడలేదు... ఎందుకు అవార్డులు రాలేదు అంటే... రాలేదు...అంతే....అక్కడ ప్రశ్నాలేదు...సమాధానమూ లేదు..నార్తు వాళ్ళు ...తమిళ  మళయాళ  సినిమాల వాళ్ళకున్న లాబీలు మనకు లేవు అనో...మన పార్లమెంట్ సభ్యులు అసలు పట్టించుకోవటం లేదనో ఈ సందర్భంగా వినిపిస్తున్న వ్యాఖ్యలు నా దృష్టిలో పస లేని వాదనలు... అవార్డు రాకపోవటం బాధాకరమే...కాని అందుకు గల కారణాలను ఆత్మ విమర్శతో ఆలోచించాలే గాని...సంకుచిద్తంగా కాదన్నది నా ఉద్దేశ్యం...లాబీలు లేవనో, ఎంపిలు లేరానో కారణాలు హాస్యాస్పదం... అలా వచ్చేవి అవార్డులా... అవి మనకు అవసరమా... అన్నది ప్రశ్న... ఈ వాదన మనల్ని మనమే అవమానించుకోవటం కాదా...? సహజత్వ పరంగా, సాంకేతికంగా, ఇతివృత్త పరంగా మనమూ, మన సినిమాలూ ఎక్కడ వున్నామన్నది ఆత్మ పరిశీలన చేసుకోవలసిన అవసరం లేదా...? గత ఏడాది అవార్డుల ఎంపికకు వెళ్ళిన మన సినిమాలు తక్కువన్నది నా ఉద్దేశ్యం కాదు...ఒక శ్రీ రామ రాజ్యం, రాజన్న లాంటి మంచి సినిమాలు వెళ్ళాయి. 
అయితే మన సినిమాల గొప్పతనం గురించి మనకు తెలుసు...అవతల అవార్డులు వచ్చిన వాటి గురించి మనకు తెలియదు కదా.....మనకు రానప్పుడు ఏదో అన్యాయం...మోసం జరిగిందని అనుకోవటం సహజం...కాని క్రియేటివ్ రంగంలో వున్న సినిమా అలా ఆలోచించ కూడదన్నది  నా అంతరంగం...నా ఉద్దేశ్యంలో విద్యా బాలన్ కంటే రామ రాజ్యంలో నయనతార బాగా నటించింది.. శ్రీ రామ రాజ్యం లాంటి ఇతిహాసాన్ని బాపు గారు తప్ప భారత దేశంలో మరే దర్శకుడు అలా రూపొందించలేరు. .కాని న్యాయ నిర్ణేతలు నాలాగా ఆలోచించాలని లేదు కదా...వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వేరుగా వుంటుంది. మనం అలా స్పోర్టివ్ గా  ఆలోచించగలిగితేనే మంచిది... అన్ని విధాలా తెలుగు సినిమా రేంజ్ గతంతో పోలిస్తే పెరిగింది...అందులో సందేహం లేదు....అయితే కదల ఎంపిక విషయంలో మనం మరింత జాగరూకత వహిస్తే  జాతీయ అవార్డులు ప్రకటించిన  ప్రతిసారీ ఇలా బాధపడాల్సిన అవసరం వుండదు....!






 
 

6 కామెంట్‌లు:

  1. In other states there are limited heros and limited directors to make a films but in our tollywood there are huge amount of heros they are trying to make so many films but not try to make a good film which is useful to people thats why our tollywood doesn't get any nationl awards we have so many great actors in our tollywood but y they are changed their thinking about making films

    రిప్లయితొలగించండి
  2. బాగా చెప్పారు. ఐనా సెలెక్షన్ కమిటీలో ఒక్క తెలుగువాడు వుంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఈ రోజు నా బ్లాగులో ఈ విషయమై నా
    ఆలోచన వ్రాశాను. (surekhacartoons.blogspot.com). బాపుగారి శ్రీరామరాజ్యం చిత్రానికి ఏ ఒక్క అవార్డూ రాకపోవడం మనసుకు చివుక్కు
    మనిపించింది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మన సినిమాలకు అవార్డులు రావటం లేదు, నిజమే. కాని ఆ సినిమాలు మన ప్రజానీకానికి వినోదాన్ని ఇస్తున్నాయా లేదా, ఆ పరిశ్రమ మీద ఆధారపడి ఎన్ని వేల మంది (ఒక్క నటులే కాదు) బతుకుతున్నారా లేదా. ఇది ప్రస్తుత ఆలోచన విధానం. అవార్డుకోసం సినిమా తీసే స్థితిలో మన తెలుగు పరిశ్రమ లేదు. ఒకప్పుడు ఉండేది"ట". మన సినిమాలకు అవార్డు రావాలంటే అభిరుచి గల నిర్మాతలు, నటులు కావాలి. మనకి ఇప్పుడు లేరు. ఎంతసేపూ, సంక్రాంతికి ఏ సినిమా, వేసవి శెలవలకు ఏ సినిమా, ఎవరు నంబరు వన్, ఎవరి ఇమేజికి తగ్గ సినిమా వాళ్ళు తీసుకోవటంలో పడి కొట్టుకుంటున్న వాళ్ళకి అవార్డులు ఇస్తే ఆ అవార్డులు తీసేయటం మంచిది. ఇది కూడ మరొక నిజం.

      మన సినిమాలు మనకి బాగుంటాయి. కాకి పిల్ల కాకికి ముద్దన్నట్టుగా. ఒక్కసారి నిస్పక్షపాతంగా, అవార్డు వచ్చిన సినిమాలతో, మనం తెలుగులో ఈ సంవత్సరం వచ్చిన అద్భుతమైన సినిమా అని మనం అనుకున్న సినిమాలను పోల్చి చూసుకుంటె, మనకు ఎందుకు అవార్డు రాలేదో అర్ధం అవుతుంది. అవార్డుల కమిటీలను విమర్శించటం కన్నా సినిమా పరిశ్రమ తనకు తానుగా విమర్శ చేసుకోవాలి. ప్రేక్షకులు చూస్తున్నరు కదా, చెత్త సినిమాలను విజయవంతం చేస్తున్నరుకదా అని, అవే గొప్ప సినిమాలు అనేసుకుంటూ, వాటికి అవార్డులు రాలేదని బాధపడటం వల్ల మన సినిమా మరింత దిగజారుతుంది తప్ప అవార్డులు ఎప్పటికీ రావు అని నా అభిప్రాయం.

      అవార్డుల కమిటీలో తెలుగు వాళ్ళుంటే అని కొంతమంది అంటున్నారు. ఉంటే ఎమవుతుంది? ఈ అవార్డులు ఆ కమిటీలో ఉన్నవాళ్ళు ఎవరి భాషకువాళ్ళు ఇచ్చేసుకోవాలా. అలా జరుగుతున్నదా? జరుగుతుంటే ఆ జాడ్యాన్ని నివారించాలి. నిస్పక్షపాతంగా జూరీ, సినిమాలను బేరీజు వేసేట్టుగా చెయ్యగల నైతిక బలం మన తెలుగు సినిమాకు ఉన్నదా? ఆ నైతిక బలం సంపాయించుకోవాలి.

      తొలగించండి
  3. తెలుగు సినిమాల పైనా, అవార్డుల పైనా శివరామ ప్రసాద్ గారి కామెంట్ బాగుంది.

    అవార్డులు రానపుడు కమిటీలను విమర్శించ కూడదు.అవార్డు అందుకునే స్థాయిలో తెలుగు సినిమా ఉందా? లేదా? అనేది చూడాలి. లోపాలను సరిచేసుకోవాలి.

    నిజంగానే అవార్డులు ఇచ్చే విధానం లో లోపాలున్నా విమర్శించాల్సిందే.పోరాడాల్సిందే.కానీ ప్రస్తుతం తెలుగు సినిమా పరిస్థితి ప్రసాద్ గారు చెప్పినట్లే ఉంది కదా !?

    నాటి సినిమాలకు , నేటి సినిమాలకు తేడా వివరిస్తూ అప్పారావు గారి బ్లాగులో పోస్టు కూడా బాగుంది.

    రిప్లయితొలగించండి
  4. బాగా చెప్పారు ఏవీ యెస్ గారూ! ఎంత సేపూ అవార్డులురాలేదు రాలేదు అని ఆవేదన వెళ్లగక్కడం తప్ప అవార్డు స్థాయిలో సినిమాలు ఉంటున్నాయా లేవా అని ఆలోచించుకోవడం ఉత్తమం!

    ఆడలేక సామెత లాగా ఎవరి లాబీయింగ్ బాగుంటే వాళ్ళకే అవార్డులనే వాదనలో పస లేదు. జ్యూరీ సభ్యుల్లో ఒకరైన తెలుగు దర్శకులు సతీష్ కాసెట్టి కూడా ఇదే చెప్తున్నారు ఫేస్ బుక్లోనూ, వెబ్ సైట్లోనూ! అవార్డు కు పోటీ పడ్డ చిత్రాల నాణ్యత ఎంత,స్థాయి ఎంత అని ఆలోచించకుండా కోటా ప్రకారం ఇచ్చే వాటిలాగా బాధపడ్డం బాగుండదు.

    శ్రీరాం రాజ్యం సినిమాకు మిగతా శాఖల విషయానికెలా ఉన్నా, సగీతం, రీ రికార్డింగ్ విభాగాల్లో అవార్డు వస్తే బాగుండేదని మామూలు సినిమా ప్రేమికురాలిగా అనిపించింది నాకూనూ! కానీ ఈ సినిమా కంటే కూడా ఉత్తమంగా ఉన్నవి ఏమైనా పరిశీలనకు వచ్చాయేమో మనకు తెలీదు కదా!

    రిప్లయితొలగించండి
  5. సర్ , దురదృష్టం ఏమిటంటే ..ఈ సారి..జ్యూరి లో మన తెలుగాయన వున్నాడు. సతీష్ కాసెట్టి అనే ఆ మహానుభావుడు..ఎంత ఆభిజాత్య స్వభావుడంటే..మొన్న పేస్ బుక్ లో ఒక పోస్టింగ్లో..'శ్రీ రామ రాజ్యం' సినిమా కి ఎందుకు రాలేదనే ఒక పేస్ బుక్ స్నేహితుడికికి జవాబు చెప్తూ..: WE DONT SEE THE PULSE OF THE PEOPLE..THESE ARE NOT FILM FARE AWARDS..." అని..చాల గొప్పగా.ప్రకటించారు. అంటే. ఈ అవార్డులు, నిర్ణయించే ..సో కాల్డ్ జ్యూరీ సభ్యులు, ప్రజల గురించి, వాళ్ళ ఇష్టా ఇష్టాలు పట్టించుకోరన్న మాట. పైగా...ఇవేమీ ఫిలింఫేర్ అవార్డులు కావు ..అన్న అహంకారం వేరొకటి. అవార్డులు రాలేదని ఎవరో బాద పడుతుంటే " అందని ద్రాక్ష పళ్ళు పుల్లన" అని..వాళ్ళ మీద ఇంకో కామెంట్ కూడా వేరే పెట్టాడు ..ఆ మహానుభావుడు. ఆయనే చెప్పాడు..శ్రీ రామ రాజ్యం కి ఎందుకు రాలేదంటే..అవార్డుల రూల్ ప్రకారం హీరోయిన్ తన స్వంత డబ్బింగ్గు చెప్పుకోవాలంట. ఎప్పుడో..యాభయ్యేళ్ళ క్రితం..పెట్టిన రూల్స్ తో..ప్రపంచం అంతా.. ఒక్క గ్రామం అవుతున్న ఈ సమయం లో..బూజు పట్టిన వాటినే పాటిస్తూ...ప్రజలు ఇంకోన్నాల్లకు..అసహ్యించుకొని ..థూ..!! ఇవి అవార్డులా..అనే స్టేజీ కి తీసుకెళ్తున్నారు

    రిప్లయితొలగించండి