20, జనవరి 2012, శుక్రవారం

నవ్వుల కార్మికుడు ఈవివి.....!

డైరెక్టర్ ఇ.వి.వి. గారు చనిపోయి అప్పుడే ఏడాది అయిపోయింది. కాలం ఇంత వేగంగా గడిచి పోతుందా  అనిపిస్తోంది... ఆయన లేకపోయినా ఆయన పండించిన నవ్వులు, ఆయన అందించిన ఆణిముత్యాల్లాంటి సినిమాలు తెలుగు ప్రేక్షకులు ఎవరూ మరచిపోలేరు...తన గురువు జంధ్యాల గారి లాగానే ఈ వి వి కూడా అన్ని రకాల సినిమాలను రూపొందించి తన బహుముఖ ప్రజ్ఞాశాలిత్వాన్ని నిరూపించుకున్నారు. జంబలకిడిపంబ,
కితకితలు, ఎవడి గోల వాడిది, లాంటి పక్కా కామెడి సినిమాలు               మాత్రమే   కాక ఆమె, అమ్మో ఒకటో తారీఖు లాంటి సందేశాత్మక  సినిమాలకు   కూడా దర్శకత్వం నెరపారు.. హాస్యానికి తన చిత్రాలలో  పెద్ద పీట వేసే ఈ దర్శక శ్రేష్టుడు తెలుగు  సినిమా చరిత్రలో  తనకంటూ చాలా పేజీలు కేటాయించుకున్నారు..ఆయన లేకపోవటం తెలుగు కామెడి సినిమాలకు మాత్రమే కాక కామెడి కుటుంబానికి కూడా  తీరని  లోటు.. జంధ్యాల గారి తరువాత చాలా వరకు ఆ స్థానాన్ని భర్తీ చేసిన
ఈ వి వి  గారు సినిమా తెర మిద నవ్వులున్నంత కాలం గుర్తుంటారు.
డైరెక్టర్ గారూ... మీరు మళ్లీ పుట్టండి సర్.... మీరు పండించాల్సిన నవ్వులు ఇంకా మిగిలివున్నాయి...



 నవ్వుల కార్మికుడు ఈవివి.....!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి