3, జూన్ 2011, శుక్రవారం

అరిచే కుక్కలు కరుస్తున్నాయ్....!!!

     అదేం విచిత్రమో తెలీదుకాని రాష్ట్రం మొత్తం మీద ఒక్కసారిగా పిచ్చి కుక్కలు రెచ్చిపోతున్నాయి. విశ్వాసానికి మారు పేరొందిన శునకరాజాలు ప్రస్తుతం మనుషుల పాలిట శత్రువులుగా మారటం బాధగా వుంది. కుక్కకు కరిచే గుణం దాని జన్మతః గానే వుంది. ఈ మధ్యన వచ్చింది కాదు. కాని ఈ మధ్యన ఎక్కువగా కరుస్తున్నాయి. నా చిన్నప్పుడు కుక్క కరిస్తే బొడ్డు చుట్టూ పద్నాలుగు ఇంజెక్షన్లు చేయించమనేవాళ్ళు..కరిచింది మంచి కుక్కయితే పరవాలేదు కాని పిచ్చి కుక్కయితే ప్రాణాపాయం అనేవాళ్ళు.  మనిషిని కరిచిన పదిహేను రోజులలోపల ఆ కుక్క చనిపోతే మరి ప్రమాదం అనేవాళ్ళు..అందుకే అప్పట్లో మనిషిని కరిచింతర్వాత పదిహేను రోజుల పాటు ఆ కుక్క చచ్చిందా...బతికే ఉందా..అని దానినే కనిపెట్టుకుని వుండేవాళ్ళు...అయితే గత పాతికేళ్ళుగా ఇంట్లో కుక్కల్ని పెంచుకోవటం బాగా అలవాటయింది.. కుక్కలంటే భయం పోయి వాటితో స్నేహ వాతావరణం ఏర్పడింది..రకరకాల జాతుల కుక్కల్ని పెంచుకోవటం , వాటిపట్ల మన పిల్లల కంటే ఎక్కువ శ్రద్ధ కనపరచటం, వాటి పెంపకం కోసం బోలెడంత డబ్బు ఖర్చు చేయటం మనం చూస్తూనే వున్నాం...
      కుక్కల్ని పెంచుకునే చాలామందికి కుక్కల్ని కుక్కలు అంటే కోపం...కొంతమందయితే కుక్క జాతి ముసుగులో వున్న చిన్న సైజ్ గేదె పిల్లల్ని పెంచుకుంటారు..కుక్క ఎంత పెద్ద సైజ్ లో వుంటే తమ స్థాయి  అంత పెద్దదనుకునే అమాయకపు జాతి మనుషులు కుడా లేకపోలేదు...మళ్లీ  ఈ కుక్కలకు ఎగ్జిబిషన్లు ఒకటి..పైగా వాటికి బహుమతి ప్రదాన ప్రహసనం...తెల్లారేసరికి ప్రధమంగా గెలుపొందిన పెద్దకుక్కతో దాని ఓనర్ గారి ఫోటో పేపర్లో ప్రత్యక్షం..కొంతమందికి కుక్కలు ఆప్యాయంగా నాకుతుంటే ఎంతో గొప్ప అనుభూతి...ఆనందం...! సరే..ఎవరి టేస్ట్ వారిది..మనం కామెంట్ చేయకూడదు..ఇక అసలు విషయానికొస్తే...గత కొద్దిరోజులుగా దాదాపు ప్రతిరోజు ఎక్కడో ఒక చోట , ఎవరో ఒకరిని కుక్క కరవటం, మనుషులు చనిపోవటం మీడియా లో చూస్తూనే వున్నాం...

       కుక్క కరిస్తే అవసరమైన రేబిస్ వ్యాక్సిన్ ప్రభుత్వాసుపత్రులలో అందుబాటులో లేకపోవటం మరీ విషాదకరం. అదేదో వూళ్ళో ఒక మనిషిని కుక్క కరిస్తే అతగాడు తన భార్యను కరిచి మరీ చచ్చిపోయాట్ట....వినటానికి మరీ దారుణంగా వుంది ..అతడికే సరైన సమయంలో రేబిస్ వ్యాక్సిన్ వేసి వుంటే ఈ పరిస్థితి దాపురించేది కాదు. కుక్కలు కరవటం మానేశాయి కదా అని ప్రభుత్వం కుడా సర్కారి ఆసుపత్రులలో వ్యాక్సిన్ వుంచటం మానేసింది..కుక్కలు మనుషుల్ని కరవటం ఒక ఉద్యమంలా మొదలవుతుందని పాపం...వాళ్ళు మాత్రం ఉహిస్తారా చెప్పండి...ప్రభుత్వ కార్యదర్శి రమేష్ గారు చెప్పినట్టు ఈ సమస్య రేబిస్ వ్యాక్సిన్ ది కాదు....కుక్కలది...కుక్కలా ఓవర్ యాక్షన్ ది. ..ఉద్యోగులు చెప్పా పెట్టకుండా మెరుపు సమ్మెకు దిగినట్టు ఈ శునక రాజాలు ముందు నోటిసు ఇవ్వకుండా ఇలా కరుపు సమ్మెకు దిగటం అన్యాయం....ఆశునకస్వామికం...అయినా ఇలా ఎందుకు జరుగుతోంది...ఉన్నట్టుండి మనుషులపై కుక్కలు ఇలా ఎందుకు ఆకస్మికంగా భౌతిక దాడులు చేస్తున్నాయి ?? దీనికి నేపధ్య కారణం ఏవిటి ?  దీనీ వెనుక ఏ శక్తులు పనిచేస్తున్నాయి.???

      ఇదే సందేహాన్ని మా ఫ్రెండ్ సత్తిబాబు ముందుంచాను...వాడు పెద్దగా నవ్వేసి ' కుక్కలకు అంత సీను లేదు...కాని ఈ మధ్యన మన రాజకీయాల్లో కుక్కలా ప్రస్తావన పెరిగింది...పైగా వాటిని అవమానించే సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి...ఇటీవలి కాలంలో మునుపెన్నడూ లేని విధంగా అన్ని పార్టీల వాళ్ళు ఎదుటి పార్టీల వాళ్ళను ఊరకుక్కలతో , వీధి కుక్కలతో , పిచ్చి కుక్కలతో పోలుస్తూ తిట్టుకుంటున్నారు...దాదాపు ఈ నాయకులందరూ తమ ఇంటిముందు సెక్యూరిటి కోసం కుక్కల్నే కాపలాగా పెట్టుకుంటారు...రాత్రిపూట కాసేపు కుక్కలు అరవకపోతే కంగారు పడతారు....భయ పడతారు...పొలిసు శాఖ వారయితే తమ పరిశోధనలో తోటి పోలీసులకంటే కుక్కల్నే ఎక్కువ నమ్ముతారు...కొంతమంది కుక్కల్ని గ్రామ సింహాలుగా అభివర్ణిస్తారు..మరికొంత మంది ఇంకా ముందుకెళ్ళి వీటిని వీరభద్రుడితో పోలుస్తారు... అలాంటి తమను దరిద్రంగా  నీచంగా ఎదుటి ప్రత్యర్ధి తో పోలుస్తూ అవమానిస్తున్న మనుషులకు ఇలా కాక కుక్కలు ఎలా బుద్ధి చెబుతాయి..? మరో ఆనందకరమైన విషయమేమిటంటే రాష్ట్రంలో కుక్కలన్నిటికి రేబిస్ వ్యాక్సిన్ వేసేందుకు ఆరోగ్య శాఖ నిర్ణయం తిసుకుందట...ఇందుకోసం ఒక ప్రత్యేక టిమును ఏర్పరుస్తారేమో...!

        ఈ టీం రాష్ట్రంలోని కుక్కలన్నింటిని ముందుగా పట్టుకుని వాటిలో పెంపుడు కుక్కల్ని విడదీయాలి. ఆ తరువాత వీధి కుక్కల్ని, పిచ్చి కుక్కల్ని, మంచి కుక్కల్ని వేరు వేరుగా వేటికి సరిపడే వ్యాక్సిన్ ను వాటికి ఇవ్వాలి.గర్భిణి కుక్కలకు ఎక్కువ డోసు ఇవ్వాలి..అలాగే పంచాయితి స్థాయి కుక్కలకు ఒక రకంగాను, మండల స్థాయి కుక్కలకు మరో రకంగాను, జిల్లా స్థాయి కుక్కలకు ఇంకో రకంగాను వ్యాక్సిన్ ఇవ్వాల్సి వుంటుంది...నా అభిప్రాయం ఏమిటంటే ఇంత కష్టపడి ఇన్ని స్తాయిల కుక్కల్ని పట్టుకునే కంటే ప్రాంతాలకతీతంగా ప్రజలందరికి ఈ వ్యాక్సిన్ ఇచ్చేస్తే మంచిది .. అప్పుడు స్టేట్ లో ఎవరిని ఏ కుక్క కరిచినా ప్రాబ్లెం వుండదు...మరో కామెడి ఏమిటంటే రాష్ట్రం మొత్తం మీద పదకొండు లక్షల కుక్కలున్నాయని కుక్కలజనాభా సేకరణ అధికారులు లెక్కలు తేల్చేసారు. అంటే సగటున ప్రతి 77 మంది మనుషులకు ఒక కుక్క వున్నట్టన్నమాట... కేవలం ఒక్క కిందటి వారంలోనే కుక్కలు పదివేలమందిని కరిచాయట....ఇవి కాకి లెక్కలు కాదు....కుక్క లెక్కలు...ఇది పక్కన పెడితే సర్కారు యుద్ధ ప్రాతిపదికన కుక్కల సంఖ్యను పెంచాల్సి వుందని మా సత్తిబాబు అభిప్రాయం....

        కుక్కల సంఖ్యను ఎందుకు పెంచాలని అడిగితే '  మనుషుల్ద్తో సమానంగా కుక్కల సంఖ్య వున్నప్పుడు వాటికంటూ ఒక స్వతంత్ర ప్రతిపత్తి ఏర్పడుతుంది...ఒక సర్కారు ఏర్పడుతుంది...ఒక  వ్యవస్థ ఏర్పడుతుంది...అప్పుడు వాటికి మనుషుల మీద కాన్సంట్రేషన్ తగ్గుతుంది...వాటిల్లో అవే పోట్లాడుకుంటాయి...పోరాడుకుంటాయి...ప్రెస్ మీట్లు పెట్టుకుంటాయి...వాటిల్లో అవి ' నువ్వు పిచ్చి మనిషివి...నువ్వు ఊర మనిషివి....నువ్వు వీధి మనిషివి...' అంటూ పరస్పరం చెడామడా తిట్టుకుంటాయి...వాటి ఇగో కుడా సాటిస్ఫై అవుతుంది...ఇక మనుషులకు కుక్క చావులూ, రేబిస్ కొరతల గొడవలు వుండవు...అంతా ప్రశాంతం...ప్రపంచ పిచ్చి కుక్కల్లారా ఏకం కండి....ఇక మీరు అరవాల్సిన పనిలేదు...ఏకంగా కరవటమే....... కంగ్రాట్స్.....!    






  


5 కామెంట్‌లు:

  1. బాగా రాసారు AVS గారూ . కుక్కలు మనుషులను తిట్టుకునేది చాలా బాగున్నది :)

    రిప్లయితొలగించండి
  2. dear avs garu
    the topic is very good and ur note is as usual very good... in india we should understand that PEOPLE ...HUMAN BEINGS are neglected and so called dogs are given high importance....we as INDIANS canot afford this .... INSTEAD of spending on dog ...people should understand that feeding a poor man is good ...but we indians expect return in the name of VISWASAM.. why should you expect in return just feed a poor if u can and leave the rest to god....dont waste ur time to pamper DOGS.... our people are living a life of dogs..so take care of people first ..hope AMMALA HEARS THIS

    రిప్లయితొలగించండి
  3. అరిచే కుక్కలు కరుస్తున్నాయి ..నిజమే..
    ఆ కరిచే కుక్కల వెనక నివ్వెరపరిచే మనకు తెలిసిన నిజాలు ఎన్నో .. వున్నాయి..
    చెప్పమంటారా..?
    నిన్న ఒకామెను ఒక యువకుడు ప్రేమించలేదని కత్తితో గొంతుకోశాడు..
    కానీ ఒక ఆడ కుక్క సారీ వీధి ఆడకుక్క..ప్రతినిత్యం ఎన్నో మగ కుక్కల దౌష్ట్యానికి బలయి పోతూంది...
    మీరు చెప్పండి..ఒక ఆడకుక్క వెనక ఎన్ని మగ కుక్కలు దాన్ని కూర్చో నివ్వకుండా..నిల్చో నివ్వకుండా.. ఎక్కడ పోతే అక్కడ..వెంబడిస్తూ..ఎంతలా వేధిస్తుంతాయి..
    ఒక ఆడ కుక్కని చూశాను నేను.. మగ కుక్కల దౌర్జన్యానికి.. దాని ఒక కన్ను ఘోరంగా..చితికి పోయింది..పాపం..రోజూ ఎక్కడో ఒక చోట ఆడకుక్కలు సారీ .. వీధి ఆడ కుక్కలు..కాలు విరిగి దెబ్బలతో ..కుయ్యో..మొర్రో మంటూ మూలల్లో దాక్కుంటున్నాయి..పాపం..మనం వికృతమైన నవ్వులతో ముఖం పక్కకు తిప్పుకుని వెళ్ళి పోతున్నాము కానీ ..ఏం చేయ గలిగాం..?
    కానీ అమల గారు ధైర్యంగా ఏదో తనకు తోచింది చేస్తున్నారు..
    అంటే ఇప్పుడు కరిచే కుక్కలను నేను సమర్థిస్తున్నానని అనుకోకండి..నాకు తోచింది చెప్పాను..

    రిప్లయితొలగించండి
  4. avs garoo, innallaki meee kalam padunu mallee choodagaluguthunnam...veelunte rojoo oka rachana cheyandi...kasepaina manasara chduvukuntam, aalochisthaam, naavvukuntaam

    రిప్లయితొలగించండి