ఇవాళ ప్రేమికులరోజు అని మా ఫ్రెండ్ సత్తిబాబు చెప్పాడు. ప్రేమకు ఒక రోజు కేటాయించటం ఏవిటి? అని అమాయకంగా అడిగాను. ఆయనెవరో వాలెంటైన్ అనే ఆయన ప్రేమను కాపాడటం కోసం చనిపోయాడు కాబట్టి ఆయన గుర్తుగా ఫిబ్రవరి 14 వ తేదిని ప్రేమికులరోజుగా ప్రకటించటం జరిగిందని తనకు తెలిసిన అజ్ఞానంతో సత్తిబాబు చెప్పాడు. ప్రేమకు ఒక రోజేవిటి ? అని అడిగి నా అజ్ఞానాన్ని మళ్లీ ప్రదర్శించాను. ' నీ బొంద...అమ్మకు ఒక రోజు, నాన్నకు ఒక రోజు చొప్పున కేటాయించుకునే ఉన్నత స్థితికి చేరుకున్నాము. ప్రేమకు ఒక రోజుకంటే ఎక్కువ ఎందుకు ? అంటూ నన్ను చండాలంగా తిట్టాడు.అంటే మిగిలిన రోజుల్లో కొట్టుకు చచ్చినా సరే...ఇవాళ మాత్రం ప్రేమించుకోండి..అనా ఉద్దేశ్యం..అని అడిగా..వాడు నా వంక సీరియస్ గా చూసి 'నీకు వ్యంగ్యం ఎక్కువైంది'..అంటూ వెళ్ళిపోయాడు..
ప్రేమకోసం చనిపోయిన వాళ్ళు భారత దేశంలో లేకనా పరాయిదేశ వాలెంటైన్ వర్ధంతిని ప్రేమికుల రోజుగా గుర్తించాము...ఇది మన విశాల హృదయమా...లేక భావదాస్యమా....? ఇలాంటి అనాలోచిత అసందర్భ సందర్భాలను బహిష్కరించి యువతను ఎడ్యుకేట్ చేయాల్సిన పెద్దవాళ్ళు గానీ, ప్రభుత్వం గానీ, మీడియా గానీ ఆ బాధ్యతకు దూరంగా ఉంటున్నాయి. పైగా ఈ దినాల కాన్సెప్ట్ ను పరోక్షంగా ప్రోత్సహిస్తున్నాయి...అయితే ఈ విపరీత ధోరణిని అరికట్టేందుకు గాను భజరంగ్ దళ్ లాంటి సంస్థలు చేస్తున్న ప్రయత్నం నా దృష్టిలో అభినందనీయమే..నన్ను చాందస వాదినని కొందరు తిట్టినా పర్లేదు. పార్కుల్లో ఈ రోజు దొరికిన జంటలను పట్టుకెళ్ళి పెళ్ళిళ్ళు చేయటం మాత్రం సబబు కాదు. ఈ పెళ్ళిళ్ళు చేసేసి చేతులు దులుపుకోవటం కూడా సరైనది కాదని నా ఫీలింగు..దీనివల్ల భవిష్యత్తులో అనేక సమస్యలు రెండు వైపులా తలెత్తే ప్రమాదంవుంది....
ఇదిలా ఉంచితే.....ఇవాళ రాజకీయ నేపధ్యంలో నిజమైన ప్రేమికులు వేరు...ప్రేమికుల రోజు ఇంకా కొద్ది రోజులు ఉండగానే మెగా ప్రేమికుడు చిరంజీవి కాంగ్రెస్ ను ప్రేమించి తనతో మమేకమై పోయాడు..ప్రేమలో ఒదిగిపోయాడు...తరువాతి ప్రేమజంట ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ వెర్సస్ వైయస్ జగన్మోహన్ రెడ్డి...అలాగే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్సస్ కె.చంద్రశేఖరరావు లది ఓ జంట అయితే గంగా భవానీ...రోజాలది మరో ముచ్చటైన జంట..కరుణానిధి..మాజీ కేంద్రమంత్రి రాజాల జంట..... ఉండవల్లి అరుణకుమార్, అంబటి రాంబాబుల జంట.....ఇలా ముచ్చటైన ఎన్నో జంటలు మన కళ్ళ ముందున్నాయి. ప్రేమ అంటే ఒక అమ్మాయి అబ్బాయిల మధ్యనే ఉండాల్సిన అవసరం లేదు.అది రాజకీయ ప్రేమ కావచ్చు...సామాజిక ప్రేమ కావచ్చు...ఆర్ధిక ప్రేమ కావచ్చు..మరే ప్రేమయినా కావచ్చు.. ప్రేమ ప్రేమే...ప్రేమికులు ప్రేమికులే...కాని ఈ సొసైటీలో అందరూ ప్రేమించే ఒక సామూహిక ప్రేమికుడు వున్నాడు. వాడే కామన్ మాన్..వాడిని చూస్తే అందరికీ ప్రేమే...అందరి దృష్టి వాడి మీదే..పెట్రోల్ డీలర్లు, గ్యాస్ డీలర్లు, పాల ప్యాకెట్ల వాళ్ళు, ఉల్ల్లిపాయల వ్యాపారస్తులు, బియ్యం వ్యాపారస్తులు, కాయగూరలు అమ్మే వాళ్ళు, ఉప్పులు పప్పులు అమ్మే వాళ్ళు ...ఇలా ఒకరేమిటి అందరికీ సామాన్యుడు అంటే అసామాన్యమైన ప్రేమ...అందుకే ఈ దేశంలో సామాన్యుడిని మించిన ప్రేమికుడు...ప్రేమించబడే వాడు మరొకడు లేడు...పైన చెప్పిన వాళ్ళ ప్రేమను తట్టుకోలేక ఈ సామాన్యుడు ప్రతిరోజూ చస్తూనే వున్నాడు..కాబట్టి వాలెంటైన్ కంటే నా దేశపు సామాన్యుడు గొప్ప ప్రేమికుడు.. అందుకే వాడు చచ్చి పోతున్న ప్రతిరోజూ ప్రేమికుల రోజే...సో...ఎంజాయ్ లవర్స్ డే ఎవ్రిడే.....కంగ్రాట్స్ కామన్ మ్యాన్....కీపిట్ అప్...!!!!

#ప్రేమకోసం చనిపోయిన వాళ్ళు భారత దేశంలో లేకనా పరాయిదేశ వాలెంటైన్ వర్ధంతిని ప్రేమికుల రోజుగా గుర్తించాము...ఇది మన విశాల హృదయమా...లేక భావదాస్యమా....? ఇలాంటి అనాలోచిత అసందర్భ సందర్భాలను బహిష్కరించి యువతను ఎడ్యుకేట్ చేయాల్సిన పెద్దవాళ్ళు గానీ, ప్రభుత్వం గానీ, మీడియా గానీ ఆ బాధ్యతకు దూరంగా ఉంటున్నాయి. పైగా ఈ దినాల కాన్సెప్ట్ ను పరోక్షంగా ప్రోత్సహిస్తున్నాయి...అయితే ఈ విపరీత ధోరణిని అరికట్టేందుకు గాను భజరంగ్ దళ్ లాంటి సంస్థలు చేస్తున్న ప్రయత్నం నా దృష్టిలో అభినందనీయమే..నన్ను చాందస వాదినని కొందరు తిట్టినా పర్లేదు.
రిప్లయితొలగించండిYou are absolutely correct sir. మన ఆచారాల్ని గుడ్డిగా ఫాలో అవ్వొద్దు అంటారు, మళ్ళీ అంతే గుడ్డిగా "ఈ" దురాచారాలనీ ఫాలో అవుతారు. ఈ దినాలే౦టో ఈ కతలే౦టో, అంతా మనీ మాఫియా! అంతా భావదాస్యమే! తెలుసుకుంటున్నారు లెండి నిజానిజాలు.
Rest well said sir with your mark of humorism:))
ఎవిఎస్ గారు, అసలు వాలెంటైన్‌డే అంటే.... వాలెంటైన్‌డే ..అంటే ... (కృష్ణాష్టమి అంటే...:)) )
రిప్లయితొలగించండివాలము కలవాడి దినం అని. అంటే మన హనుమంతులవారు లంకకు ఎగిరిన దినమండి, సందేహం లేదు. మన పూర్వీకులు వాలంటైనులే అనడానికి డార్విన్ సిద్ధాంత రీత్యా కూడా గట్టి ఆధారాలున్నాయ్. కాబట్టి, మనమంతా ఆనందోత్సాహాలతో జరుపుకోవాల్సిన పండగ అంటాను, మీరు ఒప్పుకోవాలి. ఓ సారి మన వాలంటైనుడికి జేజేలు పలుకుదామా? :P :)
జై భజరంగభళీ!
అందరికీ సామాన్యుడు అంటే అసామాన్యమైన ప్రేమ... కరెక్ట్ గా చెప్పారు సార్.
రిప్లయితొలగించండిప్రతీ రోజూ ప్రతీ వాళ్ళూ ఈ సామాన్యుడి కి 'దినం' చేస్తున్నారు.
- యం.వి.బాలసుబ్రహ్మణ్యం
dear sri AVS garu.... feb 14th is purely a business day that is forced on us by the so called business man.... as rightly said by you all days are love days or loveable days...lets love our parents, country, neighbours, friends, and all so that no evil will be there....LOVE ALL AND BE LOVED BY ALL...
రిప్లయితొలగించండిi dont know why you have that impression on 14 feb....evariki nachindi vallu jarupukuntunnaru, aanandistunnaru...prati daniki bhava dasyamu anadam samanjasam kadu....idi naa abhiprayam
రిప్లయితొలగించండి