3, సెప్టెంబర్ 2010, శుక్రవారం

వర్మ గారొక మర్మయోగి .

రాంగోపాల్ వర్మ అంటే నాకు చాలా ఇష్టం.నిస్సందేహంగా గొప్ప దర్శకుడు.తెలుగు వాళ్ళు గర్వించదగ్గ జాతీయ స్థాయి పర్సనాలిటీ. తెలుగు సినిమాలకో ట్రెండ్ నేర్పిన సంచలన సాంకేతిక నిపుణుడు.ఆయనలోని దర్శకుడి ప్రతిభా పాటవాలకు ఎన్నో సినిమాలు ఉదాహరణగా నిలిచాయి.ఎంతోమందికి ఆయన స్ఫూర్తిగా నిలిచారు.ఆయన సినిమాలకు ఒక ప్రత్యేకమైన ఇమేజ్..గ్లామర్..నిరీక్షణ..ఇది అందరికీ సాధ్యం కాని పని.

        కాని ఇటీవలి కాలంలో వర్మలో దర్శకుడిని బిజినెస్ మాన్ డామినేట్ చేస్తున్నాడు. సినిమాను ఎలా అమ్ముకోవాలి.. ఎలా బయ్యర్లను ఆకట్టుకోవాలి..రిలీజుకు ముందే సినిమాను ఎలా సెన్సేషన్ చేసుకోవాలి..అన్న వాటిమీదనే వర్మ గారి దృష్టి యావత్తూ అనే అభిప్రాయం అన్ని వర్గాల్లో వినిపిస్తున్న విమర్శ. ఇంతకుముందు వర్మ సినిమాలు రిలీజుకు ముందు నిశ్సబ్దంగా వుండి రిలీజు తరువాత సంచలనాలను సృష్టించేవి. ప్రస్తుతం రిలీజుకు ముందు సంచలనాలు సృష్టించి రిలీజు తరువాత నిశ్సబ్దంగా ఉంటున్నాయి. ప్రతి సినిమాకు ముందు ఏదో ఒక వివాదం. అవి నిజమే అయినా తరచూ జరుగుతుండటం వల్ల చూసేవాళ్ళకు..వినేవాళ్ళకు అనుమానాలు తలెత్తున్నాయి. ఒక గొప్ప దర్శకుడి సినిమాలకు ఈ తరహా వివాదాలు అవసరమా? అన్న ప్రశ్న నాలాంటి చాలామంది  అభిమానులను బాధకు గురి చేస్తోంది. తమ సినిమాలను బిజినెస్ చేసుకోవటం ఎవరికైనా అవసరమే... కాదనలేము.కానీ రాంగోపాల్ వర్మ లాంటి అత్యున్నత దర్శకుడికి ఆ అవసరం లేదన్నది నా అభిప్రాయం. పొనీ అంతే మేరకు ఆయన సినిమాలు విజయాలను పొందుతున్నాయా? అంటే అదీ లేదు. వర్మ గారి లెక్కలు ఏమిటో తెలుసుకోవాలంటే ఆ మర్మం ఏవిటో అర్ధం చేసుకోవాలంటే అందరివల్లా కాదు.ఇది నా అభిప్రాయం మాత్రమే. వర్మ గారిని అర్ధం చేసుకోవడంలో నేను ఫెయిలయ్యానని ఎవరయినా భావిస్తే నేను చేయగలిగిందేమీ లేదు.  
 

4 కామెంట్‌లు:

  1. మాఫియా మరియు దెయ్యాల సినిమాలు తప్ప ఆయన ఇంక వేరే సినిమాలు ఏమి తీసారు.దాన్ని బట్టి ఆయన గొప్ప దర్శకుడు ఎలా అయ్యారో నాకు అర్థం కావడం లేదు. ఇటువంటి వాళ్ళంతా వాళ్ళకు వాళ్ళు మేధావులమని అనుకుంటూ వితండవాదం చేస్తూ ఉంటారు.ఇటువంటి వాళ్ళు సినీప్రపంచంలో ఇంకా కొద్ది మంది ఉన్నారు.

    రిప్లయితొలగించండి
  2. మనకు కనీసం ఆ మాఫియా, దెయ్యాల సినిమాలు కూడా తీయడం రాదు కదండి. మనకొచ్చిందల్లా విమర్శించడమే. అందుకే మనం ఇక్కడున్నాం. ఆయన అక్కడున్నాడు. వర్మతో సినిమా చెయ్యాలని ఎదురుచూస్తున్న పెద్ద,పెద్ద నటులందరికీ ఆయనకు టాలెంట్ లేదని తెలీదు కదండి పాపం...మీకు తెలిసినట్టు. పోన్లెండి కనీసం ఆయనకైనా తన మీద తనకి మేధావిననే నమ్మకం ఉంది. మనకది లేకే ఇలా బ్లాగుల్లోనూ, పత్రికల్లోనూ, పక్కింటోడితో చెప్పుకునే లోకాభిరామాయణంలోనూ ఎదుట వాడి మీద బురద జల్లుతూ ఉంటాం. అది మన తప్పు కాదులెండి. ఎంతైనా ఎదుటి వాడు గొప్పవాడని ఒప్పుకుంటే మన అహం దెబ్బతినదూ...!

    రిప్లయితొలగించండి
  3. విమర్శకు , విశ్లెషణకు తేడా తెలియకుండా రియాక్టు అవడం ఎందుకండి, పాపం మీ టైం వేస్టు , అది అంత శ్రద్ధ గా ఎదో గొప్ప కామెంటు అనుకొని చదవడం వల్ల మా టైం వేస్టు . వర్మ మంచి దర్శకుడు నో డౌట్ కానీ వర్మ కంటే గొప్ప దర్శకులు ఎంతో మంది ఉన్నారు , ఆయన సినిమాను ప్రమోటుచేసుకునేందుకు అయనకు కాంట్రవర్సీశ్ అవసరమా ,కాదా అన్నవిషయం పై ఈ చర్చ కానీ ఆయన దర్శకుడా కదా అని కాదు అస్సలు ఈ బ్లాగుల్లో తమ బ్లాగులను ప్రమోట్ చేసుకోవడం కోసం ఎదుటి వారు రాసిన దానికి ( అది కరెక్టు అని తెలిసినా ) అర్ధం పర్ధం లేని కామెంట్సు ఇస్తూ ఉంటాం . దాని వల్ల వారి వారి బ్లాగులు చుసేవరు ఎక్కువ అవుతారని వారి అపోహ . పొన్లెండీ ఎవరి గోల వారిది ఎవరి కష్టం వారిది . వర్మగారి కష్టం ఆయనది , మన కష్టం మనది . పాపం ఇవన్నీ తెలియక కొంతమంది అమాయకంగా మంచి విషయాలు అందరితో చర్చిద్దాం అని బ్లాగుల్లో రాస్తుంటారు . మనకు అంత బాగ రాసె సీను లేక పోయినా కామెంట్సు కేమీ తక్కువలేదు .

    రిప్లయితొలగించండి
  4. అవునండి. మా బ్లాగ్‌లో ఏదో ఒక చెత్త ఉంది కాబట్టి అది ప్రమోట్ చేసుకోవడానికి ఇలా తలతిక్క కామెంట్స్ చేస్తుంటాం. ఏమీ లేని వాళ్లు కూడా ఈ రొంపిలోకి దిగడం ఎందుకు చెప్పండి?

    రిప్లయితొలగించండి