పొద్దున్నే అయ్యప్ప స్వామి గుడికి వెళదామని బయలుదేరాను. ఆదివారం కాబట్టి అదీ ఉదయం ఏడు గంటలసమయం అయినందున పెద్దగా ట్రాఫిక్ ఉండదన్న ధైర్యంతో ఉన్నాను. కాని నేను ఊహించిన దానికి భిన్నంగా సోమాజిగూడ సెంటర్ నుంచి రాజ్ భవన్ దాకా వేలమంది పోలీసులు, వాళ్ళ జిపులతో నిండిపోయింది. కదిలేందుకు వీల్లేదు. ఇంతమంది పోలిసులేమిటి? ఏమయినా గొడవలు జరిగాయా ? అన్న భయంతో వెనక్కి వెళ్ళిపోదామనిపించింది. దగ్గరలో వున్న ఒక పోలిసాఫిసర్ని పిలిచి అడిగాను. వాళ్ళంతా గణేష్ నిమజ్జనం కోసం వచ్చారట. బందోబస్తు నిమిత్తం అన్నమాట. నాకెందుకో సడెన్ గా గణపతి మీద జాలి సానుభూతి కలిగాయి. బొజ్జ గణపయ్యకు ఇంట బందోబస్తా? గణపతితో బాటు పందిళ్ళు వేసి ఉత్సవాలు జరుపుకునే భక్తులకు, హైదరాబాదులో వున్న జనానికి, బయటనుంచి వచ్చే వారికి,పోలీసులకు,వారి కుటుంబాలకు, గవర్నమెంటుకు, వ్యాపారస్తులకు అందరికీ క్షణ క్షణ గండం.ఎప్పుడేమి జరుగుతుందో, ఏ భయంకరమయిన వార్త వినాల్సివస్తుందో అని అందరు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని గడపటం సాధారణమయిపోయింది. దేవుడి ఉత్సవం జరుపుకోవటానికి ఇంత టెన్షన్ అవసరమా? చవితి వస్తోందంటే నాలుగయిదు నెలలముందు నుంచి అటు పోలీసులు ఇటు గవర్నమెంటు వాళ్ళు మీటింగులు, చర్చలు,సమావేశాలు,సమీక్షలు జరిపి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు.పదిరోజులు ఎవరికీ కంటిమీద నిద్ర వుండదు.గతంలో హిందూదేశం అని పిలవబడిన ఒక దేశంలో.. అన్ని మతాలను సాదరంగా సగౌరవంగా సోదర భావంతో చూసుకునే ఒక ధార్మిక భూమిలో ఓ హిందూ దేవుణ్ణి కొలవటానికి ఇన్ని ఆటంకాలా? ఇన్ని అవాంతరాలా? ఇన్ని అవరోదాలా? మరే మతం దేవుళ్ళకు లేని పరిస్థితి గణపతికే ఎందుకు? లోపం ఎక్కడుంది? ముస్లిములు మంచివాళ్ళే..హిందువులు మంచివాళ్ళే..మరి ఎందుకీ పరిస్థితి ? ఈ పాపానికి కారకులెవ్వరు ? ఇదే ప్రశ్న గణపతి అడిగితే ఎవరు సమాధానమిస్తారు ? ఏమని సమాధానమిస్తారు ? మన అదృష్టం ఏమిటంటే గణపతి అడగడు...హైదరాబాదు జనంలాగానే ఆయన కూడా నోరులేనివాడే? ఈ దౌర్భాగ్య స్థితికి కారకులయిన వారిని ముందుగా నిమజ్జనం చేస్తే దరిద్రం వదిలిపోతుంది. గణపతితో బాటు అటు హిందువులు ఇటు ముస్లిములు అందరూ ప్రశాంతంగా ఉంటారు. ఇదంతా నేనేదో మతోన్మాదిలా స్పందించటం కాదు. గణేష్ నిమజ్జనం రోజు భార్యా బిడ్డలతో కలిసి వెళ్లి చూద్దామంటే ధైర్యం చాలక ఇంట్లోనే కూర్చుండిపోయిన నా మీద నాకు కలిగిన జాలితో రాసుకున్న వ్యాసం ఇది.ఇలా ఇంకెవరయినా ఫీల్ అవుతారో లేదో తెలియదు కానీ నేను ఫీల్ అయినదాన్ని రాసుకున్నాను. అంతే..ఖాకి బూట్ల చప్పుళ్ళమధ్య వైభవంగా పండగ చేసుకుంటున్న గణపతీ..అయాం వెరీ సారీ.. మమ్మల్ని క్షమించు..!
ఇదే భావన నాకు అయోధ్య వెళ్ళినప్పుడు అనిపించింది.
రిప్లయితొలగించండిమనలోనే ఉన్న సూడో సెకులరిస్టుల భావజాలం, సెక్యులర్ తీవ్రవాదుల వల్ల ఇలా మతాల మధ్య అగాధం ఏర్పడింది. సెక్యూలరిజం పేరిట కొంతమందిని బుజ్జగించటం మరొక ముఖ్య కారణం. ఎన్నికలలో ఓటుకోసం మతాన్ని వాడేసుకోవటం రాజకీయ నాయకులు మానేస్తేనే కాని ఈ భయాలు పోవు. ఆరోజెప్పుడు వస్తుందో, మనం చూస్తామో లేదో!
రిప్లయితొలగించండిVinayakudu Bavunnadu.
రిప్లయితొలగించండిEnchakka dowunload chesukunnanu.
thanks
నిజనికి ఇది నిజమె
రిప్లయితొలగించండిdear sir
రిప్లయితొలగించండిwe as indians say that we are SECULAR but the fact is that we are SUDO SECULAR.... every one know it but we dont have the guts to admit it. Mr Bonagiri said that he had the same feeling as you when he went to AYODHYA... is really the issue of AYODHYA so serious...no ...its flamed up by our so called IDIOTIC POLITICIANS who play the game with the sentiments of INDIANS.. same is applied in hyd ganesh nimajanam...I AM SURE that EVEN GOD has no answer to our stupid acts.....