17, ఆగస్టు 2010, మంగళవారం

లాంగ్ లివ్ శ్రీరాం .....


 ఇండియన్ ఐడల్ లో మన తెలుగువాడు  నెంబర్ వన్ గా రావటం చెప్పలేనంత ఆనందాన్ని కలిగించింది  . శ్రీ రామచంద్రా మంచి గాయకుడే కాదు , చక్కటి సంస్కారం ఉన్న వ్యక్తి . మంచి కుటుంబం . అన్ని వేలమందిని దాటుకుంటూ దేశం మొత్తం మీద ప్రధమస్ధాయిలో రావటం ఆషామాషీ  కాదు. ఇటువంటి పోటీలలో టాలెంట్ ఎంత అవసరమో గాయకుడికి ఆత్మవిశ్వాసం కూడా అంతే అవసరం . ఆ కాంఫిడెన్స్ శ్రీరాం కి పుష్కలంగా ఉంది . పైగా  ప్రపంచవ్యాప్తంగా  కోట్లాదిమంది తెలుగువాళ్ళ నైతికమద్దతు వుంది . ఆదినుంచీ ఈ షోలో శ్రీరాం అప్పర్ హేండ్ కొనసాగుతూనే వుంది . టాప్ ఫైవ్ లోకి వచ్చేసరికి శ్రీరాంతో బాటు దేశం మొత్తనికి టెన్షన్ పెరిగింది . ఇలాంటి అంశాల్లో సాధారణంగా నార్త్ వాళ్ళకు ఈగో ఎక్కువ ఎలాగైనా సరే తమవాణ్ణి గెలిపించుకోవాలని తాపత్రయం ఎక్కువ . దాన్నో ఉద్యమంలా చేపడతారు. ఈసారి ఆ ఉద్యమం తెలుగువాళ్ళు , ప్రత్యేకించి తెలుగు మీడియా చేపట్టింది . గొప్పపరిణామం . ఎట్టకేలకు విజయం దక్కింది .  తెలుగు గళం జాతీయ స్ధాయిలో సరిగమలు పలికింది . అమితాబ్ , అనూమాలిక్ , సల్మాన్ ఖాన్ , లాంటి వాళ్ళు శ్రీరాం గళ  సౌకుమార్యాన్ని వేనోళ్ళ కొనియాడారు . స్వతంత్రదినం నాడు తెలుగువాళ్ళందరికీ ఇదో గొప్ప వార్త . శ్రీరాంకు అధ్భుతమైన భవిష్యత్తు ఉందన్న విషయం ప్రత్యేకించి చెప్పనవసరంలేదు . గ్రేట్ సింగర్ ... గాడ్ బ్లెస్ యూ డియర్ శ్రీరాం ...
                                      అయితే ఈ మొత్తంలో నాకు అర్ధంకానిదొకటే . గొప్ప గొప్ప న్యాయనిర్ణేతలున్న ఈ షోలో అంతిమంగా ఎవరు నేంబర్ వన్ అన్నది .  జడ్జీలు కాకుండా ఎస్ ఎం ఎస్ లు నిర్ణయించటం ఏమిటి ? చివరి నిమిషం వరకూ శ్రీరాంకు ఓటేస్తూ  ఎస్ ఎం ఎస్ లు పంపమంటూ తెలుగువాళ్ళందరూ  ఒకళ్ళకొకళ్ళు ఎస్ ఎం ఎస్ లు పంపటం ... అందరూ శ్రీరాంకు ఎస్ ఎం ఎస్ లు పంపటం ... ఎవరికోసం ... శ్రీరాం కోసమా... మొబైల్ కంపెనీల కోసమా ? ఏమో ... ఇంత పెద్ద విషయాలు నాలాంటి వాడికి అర్ధం కావు . ఏదేమైనా మనవాడు గెలిచాడు తెలుగువాడికి పేరొచ్చింది... తెలుగువాళ్ళందరికీ పేరొచ్చింది ... శ్రీరాంకు అధ్భుతమైన కెరీర్ ఆవిష్కృతమైంది . గుడ్...   

3 కామెంట్‌లు:

  1. "ఇలాంటి అంశాల్లో సాధారణంగా నార్త్ వాళ్ళకు ఈగో ఎక్కువ ఎలాగైనా సరే తమవాణ్ణి గెలిపించుకోవాలని తాపత్రయం ఎక్కువ"
    తెలుగువాళ్ళం కూడా అదే ఈగోతోనే శ్రీరామ్‍ను గెలిపించుకున్నాం.కానీ ప్రతిభ ఉంటేనే చిరకాలం నిలబడతారు.ఆ ప్రతిభ శ్రీరామచంద్రలో ఉందని అనుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి
  2. నేను చెప్పాలనుకున్నది నాకంటే అందం గా , ఎంతో కరెక్టు గా మీరే చెప్పేశారు..ఇకపైన చూస్కోండి...ఈ ప్రేరణ తో ప్రతిసారీ తెలుగు వాడే ప్రథముడి గా రావడం ఖాయం..

    రిప్లయితొలగించండి